సివిల్ సర్వీసు పరీక్షల్లో గ్రామీణ ప్రాంత అభ్యర్థుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న ప్రస్తుత సీ-శాట్ విధానాన్ని రద్దు
ప్రధాని, రాష్ట్రపతికి ఏపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి
కడప కార్పొరేషన్: సివిల్ సర్వీసు పరీక్షల్లో గ్రామీణ ప్రాంత అభ్యర్థుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న ప్రస్తుత సీ-శాట్ విధానాన్ని రద్దు చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి వినతి పత్రం సమర్పించారు. ఆ ప్రతిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కూడా పంపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత విధానం వల్ల ఐఐటీ, ఐఐఎం లలో చదివి గణితం, ఆంగ్లంపై పట్టున్న వారికే లబ్ధి చేకూరుతోందన్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో మిగతా సబ్జెక్టులపై సమగ్ర అవగాహన కలిగిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.