
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రేపు(బుధవారం) మధ్యాహ్నం 1:29 నిముషాలకు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. రెండు ఖాళీ స్థానాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. కొత్త మంత్రులతో గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించనున్నారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం వైఎస్ జగన్ రాజ్‌భవన్‌కు చేరుకోనున్నారు. రాజ్యసభకు ఎన్నికైనందున సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ తమ మంత్రి పదవులకు చేసిన రాజీనామాలను నిన్న గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదించిన సంగతి తెలిసిందే. వారు రాజీనామాలు చేసిన స్థానాల్లో కొత్త మంత్రులను నియమించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment