28, 29 తేదీల్లో పలు రైళ్లు రద్దు | cancellation of several trains on the 28, 29 | Sakshi
Sakshi News home page

28, 29 తేదీల్లో పలు రైళ్లు రద్దు

Published Tue, Sep 27 2016 2:02 AM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

28, 29 తేదీల్లో పలు రైళ్లు రద్దు

28, 29 తేదీల్లో పలు రైళ్లు రద్దు

- సత్తెనపల్లి- పిడుగురాళ్ల మధ్య దెబ్బతిన్న రైల్వేట్రాక్
- ట్రాక్ పునరుద్ధరణ నేపథ్యంలో రైళ్ల రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
 
 సాక్షి, హైదరాబాద్/విజయవాడ (రైల్వేస్టేషన్): రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు సత్తెనపల్లి-పిడుగురాళ్ల మధ్య రైల్వేట్రాక్ దెబ్బతినడంతో ట్రాక్ పునురుద్ధరణ పనులను పూర్తిగా చేపట్టేందుకు 28, 29వ తేదీల్లో పలు రైళ్లను రద్దు చేసినట్లు విజయవాడ డివిజన్ ఇన్‌చార్జ్ పిఆర్వో జే.వి.ఆర్కే రాజశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 రద్దు అయిన రైళ్ల వివరాలు: విజయవాడ-సికింద్రాబాద్ రైలు నంబరు (12795) ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (12796), గుంటూరు-వికారాబాద్ (12747), వికారాబాద్-గుంటూరు ( 12478), మిర్యాలగూడ-పిడుగురాళ్ల ప్యాసింజర్ (77676), పిడుగురాళ్ల-మిర్యాలగూడ ప్యాసింజర్ (77677), గుంటూరు-మాచర్ల ప్యాసింజర్ (57317), మాచర్ల-నడికుడి ప్యాసింజర్ (57324), నడికుడి-మాచర్ల ప్యాసింజర్ (57323), మాచర్ల-గుంటూరు ప్యాసింజర్ (57320),  గుంటూరు-మాచర్ల ప్యాసింజర్ (57319) రైళ్లను 28, 29 తేదీల్లో రద్దు చేశామని, ఈ మార్గంలో నడిచే  మరో ఐదు రైళ్లను కూడా పాక్షికంగా రద్దు చేశామని తెలిపారు. అలాగే మరో 19 రైళ్లను కూడా ఈ రెండు రోజులు దారి మళ్లిస్తున్నట్లు పిఆర్వో రాజశేఖర్ తెలిపారు.

 దారి మళ్లించిన రైళ్లు ఇవే: భువనేశ్వర్-పుణె ఎక్స్‌ప్రెస్ (ఇరువైపుల), కాకినాడ పోర్ట్-ముంబై ఎక్స్‌ప్రెస్ , కాకినాడ పోర్ట్-భావనగర్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-తిరువనంతపురం శబరి ఎక్స్‌ప్రెస్ (ఇరువైపుల), సికింద్రాబాద్-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (ఇరువైపుల), సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్(ఇరువైపుల), హైదరాబాద్-చెన్నై సెంట్రల్ చెన్నై ఎక్స్‌ప్రెస్ (ఇరువైపుల), తిరుపతి-సికింద్రాబాద్ నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ (ఇరువైపుల), హైదరాబాద్-నర్సాపూర్ నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ (ఇరువైపుల), సికింద్రాబాద్-విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (ఇరువైపుల), టాటానగర్-కాచిగూడ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ కాజీపేట మీదుగా విజయవాడ మార్గంలో దారి మళ్లించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement