గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు
మదనపల్లెలో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ దాడులు
రూ.5 లక్షల గంజాయి స్వాధీనం
12 మంది నిందితుల అరెస్టు
మదనపల్లె: మదనపల్లెలో జిల్లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, స్థానిక ఎక్సైజ్ అధికారులు మంగళవారం మూకుమ్మడిగా దాడులు నిర్వహించి రూ.5 లక్షల విలువైన గంజాయి ప్యాకెట్లను స్వాధీ నం చేసుకున్నారు. ఆటోతో సహా 12 మంది నిందితులను అరెస్టు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ నీలకంఠరెడ్డి, స్థానిక ఎక్సైజ్ సీఐ తిరుపతయ్య కథ నం మేరకు.. పుంగనూరు, మదనపల్లె, కురబలకోట మండలాలకు చెందిన 12 మంది వైజాగ్ నుంచి 42 కిలోలా గంజాయిని ఫ్యాకెట్ల రూపంలో మదనపల్లెకు తీసుకొచ్చారు. సీటీయం రోడ్డులోని తట్టివారిపల్లె నాలుగురోడ్ల కూడలి వద్ద పుంగనూరుకు ఆటోలో గంజాయిని తరలిస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
ఈ దాడు ల్లో పుంగనూరు భగత్‌సింగ్ కాలనీకి చెందిన శ్రీనివాసులు(33), రమేష్(40), జయమ్మ(22), రెడ్డెమ్మ(35), పుంగనూరు కొత్తపేటకు చెందిన ఆటో డ్రైవర్ గంగాధర్(25), మదనపల్లె చీకిలిగుట్టకు చెందిన ఎరుకుల శంకర్(35), చంద్రాకాలనీకి చెందిన ఎరుకుల చంద్ర(40), అదేకాలనీకి చెందిన ఎరుకుల లక్ష్మయ్య(38), చంద్రాకాలనీలోని రిటైల్ వ్యాపారి వెంకటరెడ్డి(42), కురబలకోట మండలం సర్కార్‌తోటకు చెందిన నూర్ మహ్మద్‌బాషా(50), అదే ఊరుకు చెందిన మహబూబ్‌బాషా(45), కురబలకోటకు చెందిన ఖాదర్‌బీ(52)ను అదుపులోకి తీసుకున్నట్లు చె ప్పారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.5 లక్షలు ఉంటుందన్నారు. దాడుల్లో పాల్గొన్న ఎస్‌ఐలు పురుషోత్తం, సుభాషిని, మునయ్య, శివకృష్ణమ్మలతోపాటు వేమారెడ్డి, ఆలీ, వెంకటేష్, మహేష్, సురేష్, సురేంద్ర, ఉమా మహేశ్వర్, రమణ, బాలకృష్ణలను అభినందించారు.