అనంతపురం: అనంతపురం జిల్లా కొమరోలు మండలం ఎడమకల్లు గ్రామ రేషన్ షాపు డీలర్ రవిపై అధికారులు మంగళవారం 6ఏ కేసు నమోదు చేశారు. దుకాణంలో ఉండాల్సిన బియ్యం 37 క్వింటాళ్లకు బదులు ఒక క్వింటా, చక్కెర ఒకటిన్నర క్వింటాళ్లకు బదులు 20 కిలోలు, కిరోసిన్ 199 లీటర్లకుగాను అసలేమీ నిల్వ లేకపోవటాన్ని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా చంద్రన్న కానుకలో భాగంగా లబ్దిదారులకు ఇవ్వాల్సిన 231ప్యాకెట్లకు గాను 168 మాత్రమే ఉన్నాయి. ఇందుకుగాను రవిపై నిత్యావసరాల చట్టం కింద 6ఏ కేసు నమోదు చేశారు. తనిఖీల్లో గిద్దలూరు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ భారతీబాయి, వీఆర్వో భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.