Ration shop dealer
-
కార్డుదారులపై డీలర్ భర్త దాడి
తాడేపల్లిరూరల్ (మంగళగిరి): రేషన్ షాపులో బియ్యం సక్రమంగా ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించిన కార్డుదారులపై రేషన్ డీలర్ భర్త, టీడీపీ నేత దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో రేషన్‌షాపు డీలర్ సంకురు హైమావతి పేరిట ఆమె భర్త, టీడీపీ నేత సంకురు వేణు రేషన్ షాపు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రేషన్ కొలతలో తేడా రావడంతో చిన్నసుబ్బయ్య అనే లబ్ధిదారుడు ప్రశ్నించగా, వేణు అతడిపై దాడికి పాల్పడ్డాడు. అదే గ్రామానికి చెందిన దుగ్గిరాల జయపతిరావు, నీలం సురేష్ ఇదెక్కడి అన్యాయమంటూ ప్రశ్నించగా.. వారిపైన కాటా రాళ్లతో దాడి చేశాడు. దాడిలో జయపతిరావుకు తల పగిలి రెండు కుట్లు పడగా, సురేష్‌కు ఐదు కుట్లు పడ్డాయి. ఘర్షణలో వేణుకు కూడా కంటిపై గాయమైంది. బాధితులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. -
రేషన్ సిబ్బందికి సర్కార్ షాక్
సాక్షి, చెన్నై: సమ్మె బాటకు సిద్ధపడ్డ రేషన్ షాపుల సిబ్బందిపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నో వర్క్..నో పే అంటూ సమ్మె రోజుల్లో జీతాలు నిలుపుదలకు తగ్గ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది కాస్త సోమవారం నుంచి విధుల్ని బహిష్కరించి సమ్మెకు సిద్ధ పడ్డ రేషన్ సిబ్బందిని ఆందోళనలో పడేసింది. రాష్ట్రంలో రెండు కోట్ల 20 లక్షల మేరకు కుటుంబకార్డుదారులు ఉన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నేతృత్వంలోని రేషన్ దుకాణాల ద్వారా కుటుంబకార్డుదారులకు ఉచిత బియ్యం, చౌక ధరకే చక్కెర, కంది, ఉద్ది, పామోలిన్, కిరోసిన్ అందిస్తున్నారు. ముఫ్పై వేలకు పైగా ఉన్న రేషన్ దుకాణాల్లో 70 వేల మంది దాకా పనిచేస్తున్నారు. అయితే, ఇటీవల కాలంగా అధికారులు తమను వేధిస్తున్నారంటూ, రేషన్ దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆత్మహత్యాయత్నాల బాట కూడా పట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాగే, అధికారుల వేధింపుల నుంచి రక్షించాలని, తమకు జీతాలు పెంచాలన్న, ఇతర అలవెన్స్‌లు పెంచాలన్న డిమాండ్లతో తొలుత రేషన్ సిబ్బంది పోరుబాటను దశల వారీగా సాగిస్తున్నారు. అయితే, పాలకుల్లో స్పందన లేని దృష్ట్యా, ఇక సేవల నిలుపుదలకుసిద్ధమయ్యారు. గతంలో వలే కాకుండా, ఈ సారి సంఘాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి సమ్మె గంటకు సిద్ధమయ్యాయి. సోమవారం నుంచి విధుల్ని బహిష్కరించి సమ్మెలోకి వెళ్లేందుకు నిర్ణయించాయి. నీరుగార్చేందుకు అస్త్రం.. రేషన్ దుకాణాల్లో సాధారణంగా నెలలో మొదటి, రెండు, మూడు వారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సిబ్బంది సమ్మె గంట మోగించిన పక్షంలో నిత్యావసర వస్తువుల సరఫరా ఆగే ప్రమాదం నెలకొనడం ఖాయం. దీనిని పరిగణించిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. ఎక్కడెక్కడ విధులకు రాకుండా సిబ్బంది సమ్మెలోకి వెళ్తారో అక్కడల్లా ప్రత్యామ్నాయ సిబ్బంది ద్వారా నిత్యావసర వస్తువుల్ని కార్డుదారులకు ఎలాంటి ఆటంకం అన్నది లేకుండా సరఫరా చేయడానికి చర్యలు చేపట్టారు. అదే సమయంలో సిబ్బందిని దారిలోకి తెచ్చుకోవడంతో పాటు సమ్మెను అణగదొక్కేందుకు ప్రభుత్వం కొత్తబాటను ఎంచుకుంది. సిబ్బందికి హెచ్చరికలు చేస్తూ ఆదివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో ఓ హెచ్చరిక సిబ్బందిని డైలమాలో పడేశాయి. నో వర్క్..నో పే అంటూ విధులకు హాజరు కాని వారికి సమ్మె రోజులకు జీతాలు నిలుపుదల చేయనున్నట్టు ప్రకటించారు. పౌరసరఫరాల విభాగం అధికారి కన్నన్ ఈ ఉత్తర్వుల్ని అన్ని మండల, డివిజన్ కార్యాలయాలకు జారీ చేశారు. ఆయా దుకాణాల తాళాలను మండల అధికారులు చేజిక్కించుకోవాలని, సమ్మె గంట మోగిన పక్షంలో నిత్యావసర వస్తువుల సరఫరాకు ఆటంకం అన్నది లేకుండా ప్రత్యామ్నాయ సిబ్బంది ద్వారా అందించేందుకు తగ్గ చర్యలు చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో వివరించారు. అలాగే, ఎక్కడెక్కడ సిబ్బంది విధులకు హాజరు కారో, ఆ రోజుల్లో వారికి జీతాలు ఇవ్వబోమని స్పష్టం చేయడం గమనార్హం. ఇది కాస్త రేషన్ సిబ్బంది సంఘాల్ని కలవరంలో పడేసింది. గతంలో ఇదే మాదిరిగా సంఘాలన్నీ ఒకే వేదికపైకి రాగా, పాలకుల హెచ్చరికలతో చీలికలు తప్పలేదు. అదే పరిస్థితి మళ్లీ పునరావృతం అయ్యేనా అన్నది వేచి చూడాల్సిందే. -
సబ్సిడీ కోత.. డీలర్లు డీలా
సాక్షి, ఇల్లెందు అర్బన్: పట్టణం, మండలంలోని రేషన్ దుకాణాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న సబ్సిడీ బియ్యం సంచుల్లో నాలుగైదు కిలోల కోత ఉంటోంది. దీంతో డీలర్లు నష్టపోతున్నారు. ప్రభుత్వం సరఫరా చేసే చౌకధర బియ్యం ప్రతీ సంచిలో 50 కేజీలు ఉండాల్సి ఉండగా రేషన్ దుకాణానికి వచ్చే సరికి 43 నుంచి 47కిలోలు మాత్రమే ఉంటోంది. ప్రతీ సంచిలో ఐదారు కిలోల దాక కోత ఉంటుందని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లెందు పట్టణ, మండల పరిధిలో 38 రేషన్‌దుకాణాలు ఉన్నాయి. 60వేలకు పైగా ఆహరభద్రత కార్డులు ఉన్నాయి. దాదాపు 4012 క్వింటాళ్ల బియ్యం ఇల్లెందుకు సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–పాస్ యంత్రాలతో అర్హులైన లబ్దిదారులకు ఎక్కడి నుంచైనా బియ్యం పొందే వెసులుబాటు ఏర్పడింది. ప్రతి నెలా ఒకటి నుంచి 15వ తేదీ వరకు బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. అనంతరం మిగిలిన స్టాక్ అంతా రాష్ట్ర ఉన్నతాధికారులకు సైతం తెలియజేసేలా ఆన్లైన్లో నమోదవుతోంది. దీంతో అక్రమాలు జరిగే ప్రసక్తే ఉండదు. ఇంత వరకు బాగానే ఉన్నా డీలర్లు బియ్యం కోసం కట్టిన డీడీకి తగినన్ని బియ్యం సరఫరా కావడంలేదు. దీంతో ప్రతి నెల డీలర్లు సొంత ఖర్చుతో 10 నుంచి 15 క్వింటాళ్ల బియ్యాన్ని తీసుకొని ప్రజలకు పంపిణీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. నిబంధనలు బేఖాతరు జిల్లా నుంచి పట్టణంలోని జీసీసీ గోదాముకు వచ్చిన బియ్యాన్ని నిల్వ అనంతరం ఆయా గ్రామాల్లోని రేషన్ దుకాణాలకు తూకం వేసి పంపాల్సి ఉంది. కానీ సరాసరి లారీలో నుంచి తిరిగి లారీలోకి తరలించడం, ప్రతీ సంచిలో రంధ్రాల నుంచి బియ్యం పడిపోవడం జరుగుతోంది. దీంతో పాటు గోదాంలకు సరఫరా అయ్యే సమయంలో బియ్యం తూకం వేయకపోవడంతో అవకతవకలకు తావిచ్చినట్టైంది. ఫలితంగా తక్కువ పడిన బియిన్ని భర్తీ చేస్తూ... డీలర్లు నష్టపోతున్నారు. నాలుగైదు కేజీల బియ్యం తక్కువగా వస్తోంది.. రేషన్ దుకాణానికి వచ్చే బియ్యం సంచుల్లో కోత ఉంటోంది. ప్రతీ సంచిలో నాలుగైదు కేజీల బియ్యం తక్కువగా వస్తున్నాయి. అలా చేయకపోవడంతో తూకం తక్కువగా ఉండి డీలర్లు నష్టపోవాల్సి వస్తోంది -స్వరూప, డీలర్ అధికారులు పట్టించుకోవడంలేదు.. గత కొంత కాలం నుంచి మాకు సరఫరా అయ్యే బియ్యం సంచుల్లో తూకం తేడాలు ఉంటున్నాయి. సంచుల్లో తక్కువగా బియ్యం వస్తోందని అనేక మార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదు. సంచుల్లో తక్కువగా బియ్యం రావడంతో మేమే స్వయంగా ప్రతి నెలా రెండు, మూడు క్వింటాళ్ల బియ్యాన్ని కొనుగోలు చేసి ప్రజలకు పంపిణీ చేయాల్సి వస్తోంది. -కటకం పద్మావతి, డీలర్ -
రేషన్ షాపు డీలర్‌పై కేసు
అనంతపురం: అనంతపురం జిల్లా కొమరోలు మండలం ఎడమకల్లు గ్రామ రేషన్ షాపు డీలర్ రవిపై అధికారులు మంగళవారం 6ఏ కేసు నమోదు చేశారు. దుకాణంలో ఉండాల్సిన బియ్యం 37 క్వింటాళ్లకు బదులు ఒక క్వింటా, చక్కెర ఒకటిన్నర క్వింటాళ్లకు బదులు 20 కిలోలు, కిరోసిన్ 199 లీటర్లకుగాను అసలేమీ నిల్వ లేకపోవటాన్ని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా చంద్రన్న కానుకలో భాగంగా లబ్దిదారులకు ఇవ్వాల్సిన 231ప్యాకెట్లకు గాను 168 మాత్రమే ఉన్నాయి. ఇందుకుగాను రవిపై నిత్యావసరాల చట్టం కింద 6ఏ కేసు నమోదు చేశారు. తనిఖీల్లో గిద్దలూరు ఫుడ్ ఇన్స్పెక్టర్ భారతీబాయి, వీఆర్వో భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. -
రేషన్ డీలర్‌పై మహిళల దాడి
-
తమాషా చేస్తున్నావా!
♦ డీఎస్ఓపై.. దుర్భాషలాడిన మంత్రి ఓఎస్డీ ♦ ఫోన్లో చందూలాల్ ఓఎస్డీ అతిప్రవర్తన ♦ 6ఏ కేసు తొలగించాలని హెచ్చరిక ♦ కంటతడి పెట్టిన డీఎస్ఓ ఉషారాణి ♦ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే యోచనలో ఉద్యోగులు ‘ఎవరు మాట్లాడేది డీఎస్ఓనా.. ఒకసారి చెపితే అర్థం కాదా.. మావాళ్ల మీద 6(ఏ) కేసు పెట్టొద్దని చెప్పినా వినట్లేదు. ఏమనుకుంటున్నావ్. అసలు నీది ఏ బ్యాచ్. జిల్లాలో ఎక్కడ ఏం జరిగేది నాకు తెలుసు.. తమాషాలా? అక్కడ జనంతో ధర్నా చేయిస్తా అప్పుడు తెలుస్తుంది. ముందు నువ్వు పూర్తి వివరాలతో వచ్చేవారం రా.. రివ్యూ ఏర్పాటు చేస్తా..’ ఇలా మాట్లాడింది ఎవరో కాదు. జిల్లాకు చెందిన మంత్రి అజ్మీరా చందూలాల్ హైదరాబాద్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి(ఓఎస్డీ)గా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్. ఫోన్లో ఇవతలివైపు ఉన్నది జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి(డీఎస్ఓ) ఉషారాణి. సాక్షి ప్రతినిధి, వరంగల్ : మహబూబాబాద్‌లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చిన ఓ రేషన్ దుకాణం డీలరుపై అధికారులు నమోదు చేసిన కేసు ఎత్తివేయాలని మంత్రి చందూలాల్ ఓఎస్డీ ప్రవీణ్‌కుమార్ ఫోన్లో డీఎస్ఓ ఉషారాణిని ఆదేశించారు. ముందుగానే తాను ఫోన్ చేసినా ఎందుకు కేసు నమోదు చేశారని కోపగించుకున్నారు. తన అక్కసునంతా ఫోన్లో మహిళా అధికారిపై వెళ్లగక్కాడు. సాటి అధికారి అని చూడకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. దీంతో తోటి ఉద్యోగుల సమక్షంలోనే డీఎస్వో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓఎస్డీ మాట్లాడిన తీరుపై ఉద్యోగుల్లోనే నిరసన వ్యక్తమవుతోంది. మంత్రి పేషీలో పనిచేస్తే దబాయింపు చేయడమేమిటనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓఎస్డీ మాట్లాడిన తీరుతో డీఎస్వో ఉషారాణి తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కంటతడి పెట్టారు. ఇదీ విషయం.. పౌర సరఫరాల శాఖలో అక్రమాలను అరికట్టేందుకు జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ కొంతకాలం నుంచి.. ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు నేరుగా ఫోన్‌ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత నెల మొదటివారంలో మహబూబాబాద్ నుంచి ఒక ఫోన్‌కాల్ వచ్చింది. మహబూబాబాద్‌లోని 126 నంబర్ రేషన్‌షాపు డీలరు కార్డుదారులకు సరుకులు ఇవ్వడంలేదని, షాపు తెరవడంలేదని, సరుకులు పక్కదారి పడుతున్నాయన్నది ఆ ఫోన్‌కాల్ ఫిర్యాదు సారాంశం. టోల్ ఫ్రీ నంబర్‌కు అందిన ఫోన్‌కాల్ ఫిర్యాదుపై వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ అక్కడి అధికారులను ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ మహౠబాబాద్ సహాయ సరఫరా అధికారి(ఏఎస్వో) చందన్‌కుమార్ ఆరోపణలు వచ్చిన షాపులో తనిఖీలు చేశారు. సరుకుల నిల్వల్లో భారీగా తేడాలు ఉండటంతో పూర్తిస్థాయి విచారణ చేసి సదరు డీలర్‌పై నిత్యావసరాల చట్టంలోని 6ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. తదుపరి చర్యల కోసం దీనికి సంబంధించిన ఫైల్ డీఎస్వో ద్వారా జాయింట్ కలెక్టర్‌కు చేరింది. కేసు వద్దని ఒత్తిడి.. షాపులో తనిఖీలు చేసినప్పటి నుంచి అధికారులపై ఒ త్తిళ్లు మొదలయ్యాయి. మొదట కేసు నమోదు చేయవద్దని ఆదేశాలు వచ్చాయి. కేసు నమోదైన తర్వాత తాజా కేసు ఎత్తివేయాలని తీవ్రస్థాయిలో అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు. ఇదే క్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ ఓఎస్డీగా పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్ డీఎస్ వో ఉషారాణికి ఫోన్ చేసి కేసు విషయంలో ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. కేసు తమ పరిధిలో లేదని జాయింట్ కలెక్టర్ ఆదేశాల ప్రకారం అధికారులు విచారణ చేసి నివేదిక ఇచ్చారని డీఎస్వో తెలిపారు. ఏదైనా ఉంటే జేసీతో మాట్లాడాలని సూచించారు. ఇలా ఈ వ్యవహారం నడుస్తోంది. తాజాగా సోమవారం కలెక్టరేట్లోని పౌర సరఫరాల శాఖ కార్యాలయంలో డీఎస్వో ఉషారాణి అధికారులతో సమావేశమయ్యారు. అధికారులతో మాట్లాడుతు న్న క్రమంలో డీఎస్వోకి ఫోన్‌కాల్ వచ్చింది. తాను వద్ద ని చెప్పినా కేసు ఎందుకు నమోదు చేశారని నిలదీశారు. ఇప్పటికైనా కేసు ఎత్తివేయాలని ఆదేశించారు. అది తన పరిధిలో వ్యవహారం కాదని డీఎస్వో మరోసారి చెప్పా రు. అయినా పట్టించుకోకుండా ఓఎస్డీ వినకుండా... వా రంలో రావాలి రివ్యూ ఏర్పాటు చేస్తా అప్పుడు చెపుతా అంటూ హెచ్చరిస్తూ మాట్లాడారు. ఈ ఘటనతో డీఎస్ వో కంటతడి పెట్టుకున్నారు. అధికారులు సమావేశం ముగించుకుని వెళ్లిపోయారు. ఈ విషయంపై జేసీకి, కలెక్టర్‌కు, పౌరసరఫరాల మంత్రికి ఫిర్యాదు చేయాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయంపై మం త్రి చందూలాల్ ఓఎస్డీ ప్రవీణ్‌కుమార్‌ను ‘సాక్షి ప్రతినిధి’ ఫోన్లో సంప్రదించగా.. తాను అధికారులతో బాగానే ఉంటానని చెప్పారు. డీఎస్‌వోతో మాట్లాడాను. విషయం ఏమిటని ఆరా తీశాను. హైదరాబాద్‌కు అక్కడి అధికారులను మేం ఎందుకు రప్పిస్తాం’ అని అన్నారు. -
రేషన్ డీలర్‌కు పదేళ్ల జైలుశిక్ష
ఓ రేషన్ షాపు డీలరు, అతని సహాయకుడికి పదేళ్లు జైలుశిక్ష పడింది. 2006లో నిత్యావసర సరుకుల కోసం తన దుకాణానికి వచ్చిన ౩౩ ఏళ్ల వ్యక్తిని సదరు డీలరు, అతని సహాయకుడు సరుకులు లేవని వెనక్కి పంపే ప్రయత్నం చేయగా వివాదం తలెత్తి వ్యవహారం చివరకు హత్యకు దారితీసింది. చెన్నై నగరంలోని సిద్దనూరు ప్రాంతంలో జరిగిన ఈ కేసును దాదాపు తొమ్మిదేళ్లు విచారించిన మద్రాస్ హైకోర్టు శుక్రవారం తన తుది తీర్పును వెలువరించింది. దోషులిద్దరికీ జైలుశిక్షతోపాటు ఐదేసి వేల రూపాయల జరిమానాను కూడా విధించింది -
చిన్నా.. మనసు వెన్న
దూలపల్లి: ఏ షాపు ముందైతే కిలోమీటర్ మేర క్యూ ఉంటుందో... ఎప్పుడు చూసినా షాపు మూసే ఉంటుందో... అది రేషన్ షాపే అని అందరికీ తెలుసు... ఎప్పుడో ఒకసారి సరుకులు ఇచ్చి... వారం పది రోజులు కనిపించకుండా పోయే డీలర్లు ఎంతోమంది ఉన్నారు. రేషన్ ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు అయిపోయిందో తెలియక పేదలు కిరాణా షాపులను ఆశ్రయిస్తున్న సంఘటనలు దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక వేళ డీలర్‌ను బతిమాలినా.. నువ్వు రాలేదు రేషన్ అయిపోయింది పో... అనే బెదిరింపుతో పేదలు ఆవేదన చెందుతున్నారు. రేషన్ వచ్చిన రోజు పనులు మానుకొని రేషన్ షాపుల్లో గంటల కొద్దీ నిరీక్షించి సరుకులు తీసుకెళ్తున్నారు. కానీ సూరారం కాలనీలో ఉన్న రేషన్ షాపులో ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఎప్పుడు వెళ్లినా ప్రజలు రేషన్ సరుకులు తీసుకోవచ్చు. సూరారం కాలనీలోని రేషన్ షాపు నంబరు 566ను ఎల్.దీనమణి పేరు మీద ఉండగా ఆమె భర్త ఎల్.చిన్నా నిర్వహిస్తున్నాడు. ఈ దుకాణ పరిధిలో 814 కార్డులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, కూలీనాలి చేసుకునే ప్రజలే అధికం. వారి ఇబ్బందులను గుర్తించిన నిర్వాహకుడు చిన్నా ప్రతినెలా 1 నుంచి 20వ తేదీ వరకు సమయపాలన పాటిస్తూ దుకాణాన్ని తెరిచే ఉంచుతున్నాడు. సరుకులు వచ్చిన వెంటనే కార్డుదారుల ఫోన్లకు మెసేజ్‌లు పంపుతున్నాడు. వివిధ కారణాలతో ఒక నెల రేషన్ సరుకులు తీసుకెళ్లకపోయినా తర్వాత నెలలో రెండు నెలల రేషన్ సరుకులు అందజేస్తున్నాడు. సరుకుల వివరాలు ఎప్పటికప్పుడు రాసి ఉంచుతున్నాడు. దీంతో వివిధ రేషన్ దుకాణాల్లో ఉన్న వారు చిన్నా షాపులోకి తమ రేషన్ కార్డులను మార్చుకుంటున్నారు. ఎప్పుడూ రేషన్ సరుకులు తీసుకోకుండా వెనుదిరిగన రోజులు లేవని లబ్ధిదారులు చెబుతున్నారు. ఇటీవల ఆహార భద్రత కార్డులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే బాధ్యత రేషన్‌డీలర్లకు అప్పగించిన విషయం తెలిసిందే. రేషన్ డీలర్ల పనితీరును పరిశీలిస్తున్న నేపథ్యంలో చిన్నా దుకాణానికి వచ్చిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ దుకాణంలో ఉంచిన సరుకుల వివరాలు, ఆహార భద్రత కార్డుల విషయమై ఉంచిన సమాచారాన్ని చూసి ముగ్ధులయ్యారు. వెంటనే బాలానగర్ ఏఎస్‌ఓకు ఫోన్ చేసి షాపు నంబరు-566 మాదిరిగా మిగిలిన దుకాణాల్లో కూడా అమలు చేయాలని సూచించారు. చిన్నా పనితీరు బాగుందని కితాబు ఇచ్చారు. మెసేజ్‌తో ఎంతో సులువు నేను సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నా. గతంలో ఇక్కడే ఉండేవాళ్లం. పిల్లల చదువుల నిమిత్తం ప్రస్తుతం ఖైరతాబాద్‌లో ఉంటున్నాం. రేషన్ సమాచారాన్ని ప్రతి నెలా డీలర్ చిన్నా మెసేజ్‌లు పెట్టడం వల్ల సులువుగా ఉంది. దీని వల్ల రేషన్ కోసం సెలవు పెట్టాల్సిన అవసరం లేకుండాపోయింది. - రామారావు సమయానికి సరుకులు మా కార్డు వేరే రేషన్ దుకాణం పరిధిలో ఉండేది. సరుకుల కోసం ప్రతి నెలా నాలుగైదు సార్లు దుకాణం చుట్టూ చక్కర్లు కొట్టాల్సివచ్చేది. ఒక్కోసారి సరుకులు అవిపోయేవి. చిన్నా దుకాణం పనితీరు గురించి తెలుసుకుని కార్డు మార్పించుకున్నాం. సమయానికి సరుకులు అందుతున్నాయి. - కృష్ణకుమారి పేదలు ఇబ్బందులు పడొద్దనే ఇక్కడ అంతా పేద, మధ్యతరగతి కుటుంబాల వారే. సరుకులు అందకపోతే వారు పడే ఇబ్బందులు నాకు తెలుసు. అందుకే సరుకులు వస్తే ఫోన్లకు మెసేజ్ పెట్టి రేషన్ సరుకులు అందేలా చూస్తున్నాను. అన్ని సరుకులు అందుబాటులో ఉంచుతున్నా. సమయపాలన పాటిస్తున్నాను. - చిన్నా -
పరేషన్!
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ప్రొద్దుటూరు పట్టణంలోని 14వ రేషన్ షాపు డీలర్‌కు 94.20 క్వింటాళ్ల బియ్యం, 3.30 క్వింటాళ్ల చక్కెర, 660 లీటర్ల పామాయిల్, 600 కిలోల కందిపప్పును పౌరసరఫరాల శాఖ అధికారులు అందించాల్సి ఉంది. ఈ మేరకు డీలర్ డబ్బును కూడా ముందుగా చెల్లించాడు. అయితే ప్రభుత్వం మాత్రం డీలర్‌కు 80.71 క్వింటాళ్ల బియ్యం, 2.81 క్వింటాళ్ల చక్కెర, 568 లీటర్ల పామాయిల్, 559 కిలోల కందిపప్పు మాత్రమే సరఫరా చేసింది. అలాగే ప్రొద్దుటూరు మండలంలోని 126వ చౌకదుకాణానికి సంబంధించి 69.76 క్వింటాళ్ల బియ్యం, 2.49 క్వింటాళ్ల చక్కెర, 499 లీటర్ల పామాయిల్‌ను సరఫరా చేయాల్సి ఉండగా 59.35 క్వింటాళ్ల బియ్యం, 2.12 క్వింటాళ్ల చక్కెర, 429 లీటర్ల పామాయిల్ మాత్రమే సరఫరా చేశారు. పట్టణంలోని ఓ డీలర్‌కు 418 రేషన్‌కార్డులు ఉన్నాయి. ఈ ప్రకారం ప్రతి నెల ఈ డీలర్‌కు 63 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేస్తుండగా ఈనెలలో 53 క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేశారు. వీటిని వినియోగదారులకు ఎలా పంపిణీ చేయాలో అర్థం కావడం లేదని ఈ సందర్భంగా డీలర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది జిల్లాలోని పలు రేషన్ షాపు డీలర్ల పరిస్థితి. జిల్లాలోని ప్రతి చౌక దుకాణానికి 85 శాతం మాత్రమే సరుకులను సరఫరా చేయాలని ప్రభుత్వం గతనెల 31న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రేషన్ షాపు డీలర్లు 15 శాతం మందికి సరుకులు పంపిణీ చేయడం కుదరదు. ఈ నిబంధనల ప్రకారం చూస్తే రేషన్ షాపునకు వెళ్లి ముందు వరుసలో ఉన్నవారికే తప్ప అందరికి సరుకులు అందని పరిస్థితి. ప్రతి నెల 18, 19 తేదీలలో డీలర్లు బ్యాక్లాగ్ చూపిస్తే, 22, 23 తేదీలలో జిల్లా అధికారులు రేషన్‌ను కేటాయించేవారు. వెంటనే డీడీలు చెల్లిస్తే 30వ తేదీ లోగా ఆయా రేషన్ షాపుల పరిధిలోని గోదాముల నుంచి అధికారులు రేషన్ షాపులకు సరుకులు పంపిణీ చేసేవారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి డీలర్లు వినియోగదారులకు సరుకులు అందించేవారు. ఏ కారణంగానో ఈ నెల మాత్రం రేషన్ కేటాయింపులో తీవ్ర జాప్యం జరిగింది. గతంలో పండుగలకు అదనపు కోటా ఇచ్చే వారు. ప్రస్తుతం దీపావళి పండుగ గడిచిపోయినా ఇంత వరకు వినియోగదారులకు సాధారణంగా ఇచ్చే సరుకులు అందని పరిస్థితి. జిల్లాలోని 51 మండలాల్లో తెల్లరేషన్ కార్డులు, ఏఏవై, ఏపీ మొత్తం 7,72,449 కార్డులు ఉన్నాయి. ప్రొద్దుటూరు పౌరసరఫరాల శాఖ గోదాము పరిధిలో ప్రొద్దుటూరు మండలంలో 138 రేషన్ షాపులు, రాజుపాళెం మండల పరిధిలో 23 రేషన్ షాపులు, చాపాడు మండల పరిధిలో 32 రేషన్ షాపులు ఉన్నాయి. కాగా సోమవారం వీటిలో కేవలం 5 రేషన్ షాపులకు మాత్రమే గోదాము నుంచి సరుకులు వెళ్లాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. పైగా గతంలో ఎన్నడూ లేనివిధంగా రేషన్‌కోటాలో 15 శాతం కోత విధించిన ప్రభుత్వం ఇందుకు కారణాలు కూడా వెల్లడించడం లేదు. దీంతో సరుకులు ఏవిధంగా పంపిణీ చేయాలి, మిగతా వారికి ఏం సమాధానం చెప్పాలని డీలర్లు తర్జనభర్జనలు పడుతున్నారు. ఏఏవై, ఏపీ కార్డులకు మాత్రం 100 శాతం బియ్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మిగతా అన్ని కార్డులకు బియ్యంతోపాటు అమ్మహస్తం సరుకులను కూడా 85 శాతం ప్రకారం సరఫరా చేయాలని స్పష్టం చేశారు. ఈ విషయంపై జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి ప్రభాకర్‌ను న్యూస్‌లైన్ వివరణ కోరగా ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే సరుకులు కేటాయించామని తెలిపారు. ఎప్పుడూ ఇలా జరగలేదు ఇంత వరకు ఎన్నడూ ఇలా రేషన్‌లో కోత విధించలేదు. వినియోగదారులకు ఎలా అందించాలో అర్థం కావడం లేదు. అందరికి సరుకులు ఇవ్వకపోతే వినియోగదారు లు మాపై కస్సుబుస్సుమంటారు. - వీరయ్య, డీలర్ వినియోగదారులకు సర్దిచెప్పడం కష్టం ఇలా తక్కువగా సరుకులు కేటాయిస్తే వినియోగదారులకు తక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. వారికి సర్దిచెప్పడం సమస్యే. మిగతా వారికి ఇచ్చి మాకు ఎందుకు ఇవ్వలేదని ఒత్తిడి చేస్తారు. - ఫాసిం జగన్, డీలర్