గాయపడిన జయపతిరావు, నీలం సురేష్
తాడేపల్లిరూరల్ (మంగళగిరి): రేషన్ షాపులో బియ్యం సక్రమంగా ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించిన కార్డుదారులపై రేషన్ డీలర్ భర్త, టీడీపీ నేత దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో రేషన్‌షాపు డీలర్ సంకురు హైమావతి పేరిట ఆమె భర్త, టీడీపీ నేత సంకురు వేణు రేషన్ షాపు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రేషన్ కొలతలో తేడా రావడంతో చిన్నసుబ్బయ్య అనే లబ్ధిదారుడు ప్రశ్నించగా, వేణు అతడిపై దాడికి పాల్పడ్డాడు.
అదే గ్రామానికి చెందిన దుగ్గిరాల జయపతిరావు, నీలం సురేష్ ఇదెక్కడి అన్యాయమంటూ ప్రశ్నించగా.. వారిపైన కాటా రాళ్లతో దాడి చేశాడు. దాడిలో జయపతిరావుకు తల పగిలి రెండు కుట్లు పడగా, సురేష్‌కు ఐదు కుట్లు పడ్డాయి. ఘర్షణలో వేణుకు కూడా కంటిపై గాయమైంది. బాధితులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment