ఏలూరు: నకిలీ పత్రాలతో ముగ్గురు వ్యక్తులు బ్యాంకు నుంచి రూ.2.5 కోట్లను రుణంగా పొందినట్టు తేలడంతో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు శాఖ అధికారులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. బ్యాంకు చీఫ్ మేనేజర్ ఎన్.రవికాంత్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి సీఐ బంగార్రాజుకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.