మిర్యాలగూడ క్రైం, న్యూస్‌లైన్: ఇటీవల మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులో నిందితుడిని శనివారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వన్‌టౌన్ సీఐ రాజేశ్వర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డకు చెందిన ఓ మైనర్ బాలిక (15) డిసెంబర్ 27న హైదరాబాద్‌కు వెళ్లింది. అదే రోజు సాయంత్రం ఇమ్లిబన్ బస్టాండ్‌లో ఉన్న బాలికను వేములపల్లి మండలం తోపుచర్లకు చెందిన నన్నెబోయిన రమేష్ గమనించాడు. బాలికకు మాయమాటలు చెప్పి చౌటుప్పల్ సమీపంలోని కోయలగూడం వద్దకు తీసుకెళ్లాడు.
అక్క డ రోడ్డు పక్కన ఉన్న ఓ పాడుబడిన దాబాలోకి తీసుకెళ్లి లైం గికదాడికి పాల్పడి పరారయ్యాడు. బాలికకు ఎటూవెళ్లాలో తోయక నల్లగొండకు వచ్చి అక్కడనుంచి సూర్యాపేటకు చేరుకుంది. ఫోన్‌ద్వారా మిర్యాలగూడలో ఉన్న తన తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు సూర్యాపేటకు వచ్చి ఇంటికి తీసుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు రమేష్‌ను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. అదే విధంగా గత కొంతకాలంగా ఇదే బాలికను సెల్‌ఫోను ద్వారా వేధిస్తున్న పట్టణానికి చెందిన మరో మైనర్ బాలుడిని కూడా అరెస్టు చేసినట్లు సీఐ చెప్పారు. ఇద్దరిపై నిర్బయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. సమావేశంలో ఎస్‌ఐ సర్వయ్య, సిబ్బంది తోటమట్టయ్య, అంజయ్య, కోడిరెక్క కిరణ్ తదితరులు ఉన్నారు.
నిర్భయ చట్టం కింద ఇద్దరిపై కేసు నమోదు
Published Sun, Jan 5 2014 4:06 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement