బాలికపై లైంగికదాడి
► నల్లగొండ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి..
► ఆడశిశువుకు జన్మనిచ్చిన బాలిక
► నిందితుడిని అరెస్ట్
సమాజం పోకడ తెలియని ఓ బాలిక తల్లిదండ్రికి దూరంగా హాస్టల్‌లో ఉంటూ పదోతరగతి చదువుకుంటోంది.. వరుసకు మేనమామ అయిన యువకుడు ఆ మైనర్‌పై కన్నేశాడు.. బాలిక ఇంటికి వచ్చిన సందర్భంలో మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు.. ఇంకేముంది ఆ బాలిక గర్భం దాల్చింది.. ఆ అభాగ్యురాలు ఈ విషయాన్ని కూడా గుర్తించలేకపోయింది..ఏడు నెలల అనంతరం ఆడబిడ్డకు జన్మనివ్వడంతో కామాంధుడి అకృత్యం నల్లగొండలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నల్లగొండ : సమాజం అంటే తెలియని బాలికను వరుసకు మేనమామ అయిన యువకుడు నమ్మించి లోబరుచుకున్నాడు. సదరు బాలిక కళ్లు తెరిచేలోపే ఓ ఆడశిశువుకు జన్మనిచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు.. నల్లగొండ జిల్లా అనుముల మండలం మదారిగూడెం గ్రామానికి చెందిన ఓ బాలిక జిల్లా కేంద్రంలోని ఓ బాలికల వసతిగృహంలో ఉంటూ పదోతరగతి చదువుకుంటోం ది. తనకు వరుసకు మేనమామ అయినటువంటి త్రిపురారం మండల కేంద్రానికి చెందిన యువకుడు కొన్ని నెలల క్రితం నమ్మించి లోబరుచుకున్నాడు. బాలిక సెలవు రోజుల్లో మదారిగూడెం వచ్చిన సమయంలో ఇంటికి వెళ్లి తన వాంఛను తీర్చుకున్నాడు.
దీంతో బాలిక గర్భం దాల్చిన విషయాన్ని పసిగట్టలేక పోయింది. కాగా బాలికకు ఈనెల ఐదవ తేదీన కడుపు నొప్పిగా ఉందని వసతిగృహ అధికారికి తెలపడంతో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఏడునెలల గర్భిణీ అని చెప్పా రు. అంతేకాకుండా బాలిక ఆడశిశివుకు జన్మనిచ్చిం ది. వెంటనే నల్లగొండ వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పాటు అధికారులు బాలి క తల్లికి సమాచారం అందించారు. పోలీసులు హు టాహుటిన లైంగికదాడికి పాల్పడిన యువకుడిపై కేసు నమోదు చేయాలని హాలియా సర్కిల్ పోలీసులును ఆదేశించారు. దీంతో హాలియాపోలీసులు సద రు యువకుడిపై కేసు నమోదు చేసి ఈనెల 6వ తేదీ న కోర్టులో హాజరుపరిచారు. బాలిక జన్మనిచ్చిన ఆడశిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు.
ఎస్సీ అభివృద్ధి శాఖ ఇన్‌చార్జి డీడీ ఈశ్వరయ్యకు రివర్షన్
‘బి’ హాస్టల్ వార్డెన్‌పై సస్పెన్షన్ వేటు
పట్టణంలోని ఎస్సీ బాలికల ‘బి’ హాస్టల్‌లో చోటుచేసుకున్న బాలిక ఉదం/తానికి సంబం ధించి అధికా రులపై వేటు పడింది. బాలిక కేసుకు సంబంధించిన ఘటన వివరాలను బయటకు పొక్కనీయకుండా గోప్యంగా ఉంచినందుకుగాను హాస్టల్ వార్డెన్ టి.రాధాకుమారిని విధుల నుంచి తొలగించారు. నల్లగొండ ఏఎస్‌డబ్ల్యూఓగా పనిచేస్తూ ఎస్సీ అభివృద్ధి శాఖకు ఇన్‌చార్జి డీడీగా పనిచేసిన ఈశ్వరయ్య పై కూడా కలెక్టర్ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. హాస్టల్స్‌పై పర్యవేక్షణ లోపించడం, బాలిక ఘటన పట్ల జిల్లా అధికారి ఆలస్యంగా గుర్తించడాన్ని కలెక్టర్ సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో జిల్లాల పునర్విభజనలో భాగంగా ఇచ్చిన వర్క్ టు ఆర్డర్‌ను రద్దు చేస్తూ డీడీ స్థానం నుంచి రివర్షన్ ఆర్డర్ జారీ చేశారు. ఆ స్థానంలో మాడా పీఓ నరోత్తమ్‌రెడ్డికి ఇంచార్జి డీడీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.