జిల్లాస్థాయి ఎడ్ల పోటీ విజేతగా నర్సయ్యపేట | cattle championship | Sakshi
Sakshi News home page

జిల్లాస్థాయి ఎడ్ల పోటీ విజేతగా నర్సయ్యపేట

Published Wed, Feb 5 2014 2:47 AM | Last Updated on Mon, May 28 2018 4:20 PM

జిల్లాస్థాయి ఎడ్ల పోటీ విజేతగా నర్సయ్యపేట - Sakshi

జిల్లాస్థాయి ఎడ్ల పోటీ విజేతగా నర్సయ్యపేట

 ఉరకలెత్తిన ఎడ్లు
  అనకాపల్లి మండలం కూండ్రంలో జిల్లా స్థాయి ఎడ్ల పోటీలు ఉత్సాహంగా సాగాయి. యలమంచిలి రామునాయుడు తీర్థంలో భాగంగా నిర్వహించిన పోటీల్లో 25 ఎడ్లబండ్లు పాల్గొన్నాయి. నర్సయ్యపేటకు చెందిన ముమ్మిన రామకృష్ణ ఎడ్లు ప్రథమ స్థానంలో నిలిచాయి.
 
 తుమ్మపాల, న్యూస్‌లైన్:
 కూండ్రంలో యలమంచిలి రామునాయుడు 9వ వర్థంతిని పురస్కరించుకొని మంగళవారం తీర్ధ మహోత్సవం  వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన జిల్లాస్థాయి ఎడ్లబండ్ల పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 25 ఎడ్లబండ్లు పాల్గొన్నాయి. నర్సయ్యపేటకు చెందిన ముమ్మిన రామకృష్ణ ఎడ్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. వీలుపర్తి సిద్ధివినాయక ఎడ్లు రెండో స్థానంలో, కృష్ణరాయుడుపేటకు చెందిన ఇసరపు హేమంతకుమార్ ఎడ్లు మూడో స్థానంలో, ఎల్.కోట తలారికి చెందిన ఎం.అచ్చంనాయుడు ఎడ్లు నాలుగో స్థానంలో, కొత్తపెంట అభయాంజనేయస్వామి ఎడ్లు అయిదో స్థానంలో, తమ్మకాపల్లి బంగారమ్మ ఎడ్లు ఆరో స్థానంలో, కందిపూడికి చెందిన పైడిమాంబ ఎడ్లు ఏడో స్థానంలో, కొత్తపెంటకు చెందిన అభయాంజనేయ-3 ఎడ్లు 8వ స్థానంలో నిలిచాయి.
 
  విజేతలకు రూ.8 వేలు, రూ.6 వేలు, రూ.4 వేలు, రూ.3 వేలు, రూ.2 వేలు, రూ.1500, రూ.1200, రూ.1000 చొప్పున అనకాపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి భాస్కరరావుతో అందజేశారు. నిర్వాహకులు యలమంచిలి పెద రమణ, యలమంచిలి లక్ష్మణరావు, యలమంచిలి చిన రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దంతులూరి దిలీప్‌కుమార్, జి.వి.నాయుడు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement