సిమెంట్ ధరలు తగ్గవు.. మరింత పెరుగుతాయి..
సిమెంట్ ధరలు తగ్గవు.. మరింత పెరుగుతాయి..
Published Tue, Jul 22 2014 6:31 PM | Last Updated on Sat, Sep 2 2017 10:42 AM
హైదరాబాద్: సిమెంట్ ధరలు ఎటువంటి పరిస్థితుల్లోనూ తగ్గవని సిమెంట్ కంపెనీల ప్రతినిధులు స్పష్టం చేశారు. సిమెంట్ ధరలు పెరగడానికి బొగ్గు, విద్యుత్ కొరత, ధరల పెరుగుదలనే కారణమని సంస్థలు వెల్లడించాయి.
బొగ్గు, విద్యుత్ కొరత కారణంగా ఇప్పటికే 2 రాష్ట్రాల్లో 4 సిమెంట్ కంపెనీలు మూతపడ్డాయని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ఇప్పట్లో సిమెంట్ ధరలు తగ్గే అవకాశం లేదని.. భవిష్యత్ లో మరింత పెరుగుతాయని సిమెంట్ కంపెనీల ప్రతినిధులు అన్నారు.
సిమెంట్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిల్డర్ల జేఏసీ ఈనెల 5 నుంచి 20వ తేదీ (రెండు వారాలు) వరకు సిమెంట్ కొనుగోళ్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. సిమెంట్ ధరల అనూహ్య పెరుగుదలపై బిల్డర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆరు రోజుల పాటు భవనాల నిర్మాణాన్ని ఆపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Advertisement
Advertisement