Cement prices
-
ఇప్పుడు సిమెంట్ వంతు..భారీగా పెరగనున్న ధరలు..! ఒక బస్తాపై..
రష్యా-ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో నిత్యావసర వస్తువుల, ఇంధన ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులతో సిమెంట్ ధరలు కూడా భారీగా అవకాశం ఉన్నట్లు క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. పెరిగిన ఇన్పుట్ ఛార్జీలు..! సిమెంట్ తయారీలో ఇన్పుట్ ఛార్జీలు పెరగడంతో ఆయా కంపెనీలు ఖర్చులను తీవ్రంగా భరించడం మొదలుపెట్టాయి. దీంతో మార్జినల్ లాభాలను పొందడంలో ఆయా కంపెనీలకు కష్టతరంగా అయ్యే అవకాశం ఉండడంతో కంపెనీలు ఈ నెలలో ఒక్కో బ్యాగ్‌పై రూ. 25 నుంచి రూ. 50 వరకు సిమెంట్ బ్యాగ్ ధరలు పెంచే అవకాశం ఉందని క్రిసిల్ పేర్కొంది. పెరిగిన రవాణా ఖర్చులు..! మార్చిలో ముడి చమురు బ్యారెల్ ధరలు సగటున 115 డాలర్లకు పెరిగిన విషయం తెలిసిందే. రష్యా-ఉక్రెయిన్ వివాదం, ఆస్ట్రేలియాలోని కీలక మైనింగ్ ప్రాంతాల్లో వాతావరణ అంతరాయాలు, దేశీయ డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం వంటి వివిధ కారణాల వల్ల అంతర్జాతీయ బొగ్గు ధరలు కూడా పెరిగాయని క్రిసిల్ పేర్కొంది. విద్యుత్, ఇంధన ధరల పెరుగుదల ఫలితంగా సరుకు రవాణా ఖర్చు పెరిగింది, ఇది సిమెంట్ రవాణాలో 50 శాతం వాటాలను కలిగి ఉంది. బల్క్ డీజిల్ ధరలు లీటరుకు రూ.25 పెంచారు, రిటైల్ డీజిల్ ధరలు కూడా పెరిగాయి. ఇవి సిమెంట్ ధరల పెంపుకు కారణాలుగా ఉన్నాయని క్రిసిల్ వెల్లడించింది. క్రిసిల్ రీసెర్చ్ డైరెక్టర్ హేతల్ గాంధీ ప్రకారం...గత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో సిమెంట్ డిమాండ్ సంవత్సరానికి 20 శాతం పెరగగా...అకాల వర్షాలు, ఇసుక సమస్యలు, కార్మికుల లభ్యత కారణంగా రెండో భాగంలో ఊహించని విధంగా మందగమనాన్ని ఎదుర్కొంది. స్థిరంగా డిమాండ్..! వచ్చే ఆర్థిక సంవత్సరంలో...సిమెంట్‌కు డిమాండ్ 5-7 శాతం వద్ద స్థిరంగా ఉండనుంది, మౌలిక సదుపాయాలతో పాటు టైర్-2, టైర్-3 నగరాల నుంచి సరసమైన గృహాల డిమాండ్‌తో ధరలు స్ధిరంగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ, అధిక నిర్మాణ ఖర్చులు సిమెంట్ డిమాండ్ పెరుగుదలను పరిమితం చేసే అవకాశం లేకపోలేదని హేతల్ గాంధీ అభిప్రాయపడ్డారు. చదవండి: సిమెంటుకు పెరగనున్న డిమాండ్ -
రియల్ ఎస్టేట్ రంగానికి మరో ఎదురు దెబ్బ
కరోనా సంక్షోభంతో కుదేలైన రియల్ ఎస్టేట్ రంగానికి మరో ఎదురు దెబ్బ తగలనుంది. దేశంలో సిమెంట్ ధరలు భారీగా పెరగనున్నట్లు దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో రీటైల్ మార్కెట్లో సిమెంట్ బస్తా ధర రూ.10 నుంచి 15కి పెరిగింది. ఇప్పుడు అదే సిమెంట్ ధర రూ.15 నుంచి రూ.20లకు పెరిగి రానున్న రోజుల్లో సిమెంట్ ధర రూ.400తో ఆల్ టైమ్ హై రికార్డ్‌కు చేరుకోనున్నట్లు క్రిసిల్ రేటింగ్స్ తాజా నివేదిక తెలిపింది. అయితే సిమెంట్ ధరలు పెరగడానికి కారణం దేశంలో బొగ్గు, డీజిల్ ధరలు పెరగడమే కారణమని క్రిసిల్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. నిర్మాణ రంగంపై భారం వాస్తవానికి ఈ ఆర్ధిక సంవత్సరంలో సిమెంట్ అమ్మకాలు 11-13 శాతం పెరిగినట్లు క్రిసిల్ అంచనా వేసింది. అయితే గత ఆర్థిక సంవత్సరం కరోనా లాక్డౌన్ల నేపథ్యంలో పరిశ్రమ దీన్ని వృద్ధిగా భావించట్లేదు. ఈ క్రమంలో రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్ పెరిగితే గానీ తమకు లాభాలు వచ్చే పరిస్థితి లేదని, మార్కెట్లో 75శాతం వాటా ఉన్నా 17 సిమెంట్ కంపెనీ ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు క్రిసిల్ తెలిపింది. సిమెంట్ ధరలు ఎలా ఉన్నాయి దేశంలోనే సిమెంట్ ధరలు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంట్ బస్తా ధర రూ.54పెరిగింది.సెంట్రల్ రీజియన్‌లో రూ.20 పెరిగితే, ఉత్తరాది రాష్ర్టాల్లో రూ.12, పశ్చిమాది ప్రాంతాల్లో రూ.10, తూర్పు నగరాల్లో రూ.5 మేర పెరిగింది. ఆయా కంపెనీలను బట్టి మార్కెట్లో బస్తా ధర రూ.350 నుంచి రూ.400 పలుకుతుండగా.. ఈ క్రమంలో సిమెంట్ ధరలు మునుపెన్నడూ లేని రికార్డు స్థాయికి చేర్చగలవన్న అంచనాలు వినిపిస్తున్నాయి. -
సిమెంట్ ధరలు తగ్గించండి
సాక్షి, హైదరాబాద్: కరోనా మూలంగా దెబ్బతిన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆదుకునేందుకు సిమెంట్ ధరలు తగ్గించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. లాక్డౌన్ మూలంగా ఇతర రంగాల మాదిరిగానే భవన నిర్మాణ రంగం కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నదన్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి గురువారం సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పథకం కోసం సిమెంట్ బస్తాను రూ. 230 చొప్పున ఇచ్చేందుకు 2016లో సిమెంట్ కంపెనీలు అంగీకరించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకంతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలకు బస్తాకు రూ.230కి సిమెంట్ సరఫరా చేయాలని మంత్రులు చేసిన ప్రతిపాదనకు కంపెనీల ప్రతినిధులు అంగీకరించారు. అయితే రియల్ ఎస్టేట్ రంగానికి సరఫరా చేసే సిమెం టు ధరలకు సంబంధించి త్వరలో అంతర్గత సమావేశం ఏర్పాటు చేసుకుని ఎంత మేర తగ్గిస్తామనే అంశాన్ని తెలియజేస్తామన్నారు. స్థానిక యువతకు ఉపాధి సిమెంట్ పరిశ్రమలకు నిలయంగా ఉన్న హుజూర్నగర్ ప్రాంతంలో స్థానిక యువతకు ఉపాధి కల్పించే అవకాశంపైనా సమావేశంలో చర్చించారు. స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. తమకు అవసరమైన సిబ్బందిని ఈ శిక్షణ కేంద్రం నుంచి ఎంపిక చేసుకుంటామని సిమెంట్ కంపెనీల ప్రతినిధులు హామీ ఇచ్చారు. ప్రగతిభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, సీఎస్ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు. -
‘డబుల్’కు సిమెంట్ ట్రబుల్!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. వాస్తవానికి వేసవిలోగా లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించాలనేది లక్ష్యం కాగా, ముందస్తు ఎన్నికలు, తదితర పరిణామాల నేపథ్యంలో అవి అటకెక్కాయి. పూర్తవుతున్న ఇళ్లకు కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించకపోవడంతో మిగిలిన పనులు మందకొడిగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక, అధికారులు చేతులెత్తేయడంతో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ససేమిరా అంటున్నారు. రావాల్సిన బిల్లులు సకాలంలో రాకపోవడమే కాక పులిమీద పుట్రలా సిమెంట్ కంపెనీలు గతంలో ఇచ్చిన హామీ మేరకు సిమెంట్ బస్తాను రూ. 230కి అందివ్వడం లేవు. డబుల్ బెడ్రూమ్ఇళ్ల పనులకు తొలుత కాంట్రాక్టర్లు వెనుకడుగు వేయడంతో పేదల నాదుకునే ఈ పథకానికి ముందుకు రావాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారులే కాక స్వయానా అప్పటి మునిసిపల్‌మంత్రి కేటీఆర్ కూడా కాంట్రాక్టర్లను కోరారు. వారికి సిమెంటు, ఇసుక సరఫరాలో ఇబ్బందుల్లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. డబుల్ ఇళ్ల రేటు తమకు గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్లు మొండికేయడంతో సిమెంటు కంపెనీలతో మాట్లాడి బహిరంగ మార్కెట్‌తో సంబంధం లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కవసరమైన సిమెంట్ బస్తా ధరను రూ.230కి ఖరారు చేశారు. ఆ మేరకు సిమెంట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకనుగుణంగా ఇప్పటి వరకు సరఫరా చేశారు. ఉన్నట్లుండి ఈ నెల ఆరంభం నుంచి పలు సిమెంట్ కంపెనీలు సిమెంట్ సరఫరాకు సంబంధించి కొటేషన్స్ ఇవ్వడం లేదు. ఈ నెల 15న రెండు కంపెనీలు మాత్రం కొటేషన్లు ఇచ్చినప్పటికీ ధరను రూ. 230 నుంచి రూ. 260కి పెంచినట్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్లు కొందరు పేర్కొన్నారు. దీనివల్ల తమపై భారం పెరగడమే కాక ప్రభుత్వంపైనా అదనపు భారం పడనుందంటూ ఒప్పందాని కనుగుణంగా రూ. 230కే సిమెంట్ బస్తా లభించేలా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ‘బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ఇండియా’ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గృహనిర్మాణశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ కమిషనర్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌లకు లేఖలు రాసింది. ఈ అంశంలో ఒప్పందాని కనుగుణంగా సిమెంట్ సరఫరా జరగనిదే తాము పనులు చేయలేమని జీహెచ్ఎంసీలో ఇళ్ల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టరు ఒకరు తెలిపారు. ధర పెంపుతో ఇప్పటి వరకు పూర్తయిన పనులు పోను మిగతా పనులకు ఒక్కో ఇంటికి దాదాపు ఐదారు వేల అదనపు భారం పడనుంది. ఈ లెక్కన వేలసంఖ్యలోని ఇళ్లపై అదనపు భారం పెరగుతుందన్నారు. బిల్లుల చెల్లింపులోనూ జాప్యం.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతుండటంతో తీవ్ర ఇబ్బందులెదురవుతున్నాయని కాంట్రాక్టు ఏజెన్సీలు వాపోతున్నాయి. తాజాగా రూ. 328 కోట్ల చెల్లింపులు జరిగినప్పటికీ, మరో రూ. 300 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి కాక ఇంకో రూ. 300 కోట్ల బిల్లులు రెడీగా ఉన్నాయని సమాచారం. ఇప్పటి వరకు దాదాపు 30వేల ఇళ్ల పనులు పురోగతిలో ఉండగా, రూ. 2800 కోట్ల మేర చెల్లింపులు జరిగాయి. రెండు లక్షలు లక్ష్యం కాగా... గ్రేటర్‌పరిధిలో మొత్తం రెండు లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం కాగా, తొలిదశలో లక్ష ఇళ్ల నిర్మాణానికి సిద్ధమయ్యారు. ఆమేరకు దాదాపుగా భూసేకరణ పూర్తిచేశారు. లక్ష ఇళ్ల నిర్మాణ అంచనా వ్యయం రూ. 8598.58 కోట్లు. గ్రేటర్‌లోని 109 ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు. ఇప్పటి వరకు సింగంచెరువు తండాలో మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. మరో ఐదు ప్రాంతాల్లో దాదాపు 30 వేల ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తికావచ్చిందని అధికారులు పేర్కొన్నారు. -
మళ్లీ పెరిగిన సిమెంటు ధర
సాక్షి, ఏలూరు: సిమెంటు ధర మళ్లీ ఆకాశాన్నంటింది. ఈనెల 1వ తేదీ నుంచి ఒకే దఫా రూ.30 వరకు ధర పెరగటంతో నిర్మాణ రంగంపై పెను ప్రభావం పడుతోంది. దీనికి జీఎస్టీ 28 శాతం కలుపుకుని బస్తాపై రూ.39 మేర ధర పెరిగింది. రవాణా, ఇతర ఖర్చులు కలుపుకుని ఈ ధర మరో రూ.20 పెరగనుంది. పెరిగిన ధర ప్రభావం ఎన్టీఆర్ పక్కా గృహాల నిర్మాణంపై చూపనుందని తెలుస్తోంది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇళ్లు నిర్మించుకోలేని పరిస్ధితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. రకరకాల కారణాలతో మందకొడిగా సాగుతున్న నిర్మాణ రంగం, కంపెనీల సిండికేట్ మాయాజాలంతో అదనపు ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. ధర పెరగనున్నట్లు విక్రయదార్లకు ఆగస్టు నెలాఖరులోనే సమాచారం ఇచ్చిన కంపెనీలు సెప్టెంబర్ 1 నుండి దానిని అమలు చేశాయి. కొన్ని ప్రధాన కంపెనీలు రెండు రోజులు సరఫరా నిలిపివేసి అనంతరం పెరిగిన ధరలతో పునః ప్రారంభించారు. నిర్మాణంలో సూపర్ 59 గ్రేడ్ సిమెంటుకు అధిక గిరాకీ ఉంది. అయితే దీనిపై ధర పెరిగిన ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. ధరలు పెరగక ముందు సూపర్ సిమెంటు బస్తా రూ.288 ఉండగా ఇప్పుడు అది రూ.328 అయింది. 53 గ్రేడ్ ధర రూ.316 ఉండగా రూ.356కు పెరిగింది. దీనికి ఎగుమతి, దిగుమతి, రవాణా వ్యయం సుమారు రూ.15 నుండి రూ.20 వరకు కలుస్తుంది. వివిధ బ్రాండ్లను ఆనుసరించి ధర వ్యత్యాసం ఉంటుంది. పక్కా గృహాల నిర్మాణంలో ఉన్న పేదలపై ఈ ధరలు మోయలేని భారంగా మారాయని, సిమెంటు కంపెనీలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోతే ఎలా అన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై జిల్లా హౌసింగ్ పి.డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం యూనిట్ ధరలో సిమెంటు బస్తాకు రూ.250 మాత్రమే చెల్లిస్తున్నాం.. పెరిగిన ధరలపై ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. -
భారీగా పెరిగిన సిమెంట్ ధరలు
గుంటూరు : రాష్ట్రంలో సిమెంట్ ధరలు భారీగా పెరిగాయి. వారం రోజుల్లోనే కంపెనీలు బస్తాకు 100 రూపాయలు మేర పెంచేశాయి. కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుపై రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్) మండిపడుతోంది. ఉద్దేశ్యపూర్వకంగానే కంపెనీలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయని పేర్కొంటోంది. కంపెనీలు గనుక ధరల పెంపులో దిగిరాకపోతే, నిర్మాణాలు ఆపివేస్తామని క్రెడాయ్ హెచ్చరించింది. ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎలాగైనా ధరలు తగ్గించేలా చూడాలని కోరుతోంది. ధరలను కంపెనీలు తగ్గించని పక్షంలో ఇతర దేశాల నుంచి సిమెంట్ ను దిగుమతి చేసుకుంటామని క్రెడాయ్ తెలిపింది. ధరల పెంపుతో నిర్మాణరంగం తీవ్రంగా దెబ్బతింటుందని బిల్డర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తంచేసింది. సిమెంట్ కంపెనీలు ఈ మేర ధరలు ఒక్కసారిగా పెంచడం ఇదేమీ మొదటిసారి కాదని, అంతకమునుపు కూడా ఇలానే చేశాయని బిల్డర్స్, కాంట్రాక్టర్లు వాపోయారు. ఈ వ్యవహారంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మేజర్ సిమెంట్ కంపెనీలకు భారీ జరిమానాలు కూడా విధించినట్టు గుర్తుచేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గనుక పరిగణలోకి తీసుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుమతామని బిల్డర్స్, కాంట్రాక్టర్లు చెప్పారు. -
త్వరలో సిమెంట్ ధరలు పెరిగే ఛాన్స్
-
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన సిమెంట్ ధరలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు పెరిగాయి. బస్తాకి రూ.30-40 మధ్య ధరలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సిమెంట్‌కు డిమాండ్ పెరగడమే దీనికి కారణమని ఎనలిస్టులు చెబుతున్నారు. ముఖ్య్ంగా రియల్ రంగంపై ప్రభుత్వం దృష్టి, మంచి వాతారణ వార్తలతో సిమెంట్ కు డిమాండ్ పెరగనుందని ఎనలిస్టులు చెబుతున్నారు. దీంతో గురువారం నాటి మార్కెట్లో దక్షిణాది సిమెంట్ స్టాక్స్ జోరుమీదున్నాయి. సాగర్ సిమెంట్ 4.33 శాతం, ఎన్సీఎల్ 4 శాతం రైన్ ఇండస్ట్రీస్ 3.94 శాతం , కేసీపీ 3.19 శాతం లాభాలతో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సిమెంట్ ధరలు గత రెండు రోజులలో బ్యాగ్ ధర రూ 30-40 పెరిగినట్టు ఎన్ సీఎల్ ఇండస్ట్రీస్ ఈడీ ఎన్జీవీఎస్జీ ప్రసాద్ తెలిపారు. సిమెంట్ విక్రయాల్లో ఈ రెండు రాష్ట్రాల్లో 65-70 శాతం వాటాను సొంతం చేసుకున్న ఎన్ సీఎల్ తమవ్యాపారంపై మరింత ఆశావహంగా ఉంది. కాగా గత కొన్ని నెలలుగా సిమెంట్ ధరలు దూకుడు మీదున్నాయి. చాలా షేర్లు 52 వారాల గరిష్టాన్ని తాకాయి. దీంతో ఈ షేర్లకు డిమాండ్ బాగానే పుంజుకుని మార్కెట్ల ఫేవరెట్‌గా నిలుస్తున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో పలు సిమెంట్ కంపెనీలు ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించాయి. మొత్తం 36 సిమెంట్ కంపెనీల సంయుక్త నికరలాభం 84 శాతం ఎగసి రూ. 2,823 కోట్లను తాకింది. ముడివ్యయాలు తగ్గడం, సిమెంట్ రియలైజేషన్లు మెరుగుపడటం వంటి అంశాలు కంపెనీల లాభాలు పెంచాయి. -
సిమెంటు ధర పైపైకి..!
నాలుగు రోజుల్లో బస్తాకు రూ. 40 పెరుగుదల నరసన్నపేట: కొద్ది నెలల క్రితం వరకూ గృహ నిర్మాణదారులను ఇసుక ధరలు భయపెట్టారుు. ఇప్పుడు సిమెంట్ ధరలు బెంబేలెత్తిస్తున్నారుు. ఇసుక ధర ప్రస్తుతం అందుబాటులో ఉండటంతో నిర్మాణాలు ఊపందుకున్నాయి. చాలామంది గృహ నిర్మాణాలకు పూనుకున్నారు. అయితే ఇదే అవకాశంగా చేసుకొని సిమెంట్ వ్యాపారులు ధరలను అమాంతంగా పెంచేశారు. నెల రోజుల క్రితం బస్తా సిమెంట్ 260 రూపాయలకు లభించేది. వారం రోజుల క్రితం రూ. 320 అయింది. ప్రస్తుతం 370 రూపాయలకు చేరింది. దీంతో గృహ నిర్మాణదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అన్ని కంపెనీలు సిండికేట్ అయి.. ఒక్కసారిగా ధరలు పెంచాయి. మహాగోల్డు సిమెంట్ రిటేల్‌గా రూ. 380 పలుకుతోంది. ఇతర కంపెనీల ధరల్లో రూ. 5 నుంచి పది రూపాయల వరకూ తేడా ఉంది. నెల రోజల క్రితం బస్తా రూ. 260 ఉండగా..ఇప్పుడు రూ. 370 కావడం ఏమిటని నిర్మాణదారులు వాపోతున్నారు. పెరిగిన ధరలు గృహనిర్మాణ దారులపై తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని చూపుతున్నాయి. ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. -
గృహ ప్రవేశం చేసేద్దాం!
ఒకపక్క సిమెంట్ ధరలు తగ్గాయి. కొన్నాళ్లుగా స్టీల్ ధరలు కూడా దిగివస్తూనే ఉన్నాయి. వీటన్నిటికీ తోడు సొంతింటికి కీలకమైన గృహ రుణాలూ తక్కువ వడ్డీరేట్లతో ఊరిస్తున్నాయి. వడ్డీరేట్లు మెల్లగా కిందికి దిగుతున్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే కొన్నాళ్లుగా రియల్టీ ధరలు నిలకడగా ఉన్నాయి. మునుపటి అంత బూమ్ లేదు. ఇవన్నీ చూస్తే సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే వారికిదే మంచి తరుణమన్నది నిపుణుల మాట. ఎందుకంటే గడిచిన 14 నెలల కాలంలో ఆర్బీఐ వడ్డీరేట్లను దాదాపు 1.5 శాతం తగ్గించింది. వచ్చే ఐదారు నెలల్లో ఇవి మరింత తగ్గవచ్చనే సంకేతాలు కూడా ఇచ్చింది. ఈ ఏడాది వర్షాలు బాగుంటాయని వాతావరణ శాఖ నివేదికలివ్వడంతో ద్రవ్యోల్బణ ఒత్తిడి కూడా పెద్దగా ఉండే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఈ ఏడాది మరో అర శాతం వరకు వడ్డీరేట్లు తగ్గవచ్చనేది నిపుణుల అంచనా. ఇక వడ్డీరేట్లను లెక్కించడానికి బేస్ రేట్ స్థానంలో మరింత పారదర్శకంగా ఉండే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండింగ్ (ఎంసీఎల్ఆర్) కూడా వచ్చింది. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో కొత్తగా గృహరుణాలు తీసుకునే వారేం చెయ్యాలి? ఇప్పటికే రుణాలకు ఈఎంఐలు చెల్లిస్తున్న వారు ఏం చెయ్యాలి? అనే వివరాలే ఈ వారం ‘సాక్షి’ ప్రాఫిట్ ప్లస్ ప్రధాన కథనం. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం * సొంతింటికి అనుకూలిస్తున్న పరిణామాలు * సిమెంటు, స్టీల్ ధరల తగ్గుదల; రియల్టీ ధరల్లో నిలకడ * మెల్లగా దిగివస్తున్న గృహ రుణాల వడ్డీ రేట్లు * 14 నెలల్లో 1.5% తగ్గిన వడ్డీరేట్లు, ఇంకా తగ్గే అవకాశం * కొత్తగా అమల్లోకి వచ్చిన ఎంసీఎల్ఆర్తో మరింత తగ్గనున్న వడ్డీ వడ్డీరేట్లు ఇంకా తగ్గుతాయా...! ద్రవ్యోల్బణం అదుపులోకి రావడంతో ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తోంది. తాజాగా ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను 0.25 శాతం తగ్గించింది. ఇదే విధంగా గృహరుణాలపై వడ్డీరేట్లు కూడా పావు శాతం తగ్గితే రూ.50 లక్షల గృహరుణం తీసుకున్న వారికి మొత్తమ్మీద రూ.1.95 లక్షల వరకు కలిసొస్తుంది. కానీ ఆర్బీఐ తగ్గిస్తున్న మొత్తాన్ని బ్యాంకులు రుణగ్రహీతలకు వెంటనే బదలాయించడం లేదు. గత 14 నెలల్లో ఆర్బీఐ 1.50 శాతం తగ్గించినా దేశీయ అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ గృహ రుణాల వడ్డీ రేట్లను కేవలం 0.55 శాతం మాత్రమే తగ్గించింది. తాను తగ్గిస్తున్నా అది పూర్తిస్థాయిలో వినియోగదారులకు చేరకపోవడంతో వడ్డీ లెక్కింపునకు ఇపుడు ఆర్బీఐ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. అదే మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్). నిజానికి ప్రతి బ్యాంకూ తాము సేకరిస్తున్న డిపాజిట్లపై కొంత వడ్డీని అందిస్తాయి. రుణాలపై వడ్డీరేట్లను కూడా వీటి ఆధారంగా నిర్ణయించటమే ఎంసీఎల్ఆర్. దీంతో బ్యాంకులు డిపాజిట్ రేట్లను తగ్గిస్తే రుణాల వడ్డీరేట్లు కూడా తగ్గుతాయి. డిపాజిట్ రేట్లు పెరిగితే వాటితో పాటే వడ్డీరేట్లు పెరుగుతాయి. ఏప్రిల్ 1 నుంచి బ్యాంకులు ఈ ఎంసీఎల్ఆర్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. బేస్ రేటు కన్నా ఈ ఎంసీఎల్ఆర్ విధానంలో వడ్డీరేట్లు తక్కువగా ఉండటం విశేషం. ఎంసీఎల్ఆర్కు మారడమే బెస్ట్!! గడచిన పదేళ్లలో వడ్డీరేట్ల లెక్కింపులో చాలా మార్పులొచ్చాయి. 2010కి ముందు ప్రైమ్ లెండింగ్ రేటు విధానం (బీపీఎల్ఆర్) అమల్లో ఉండేది. ఆ సమయంలో బీపీఎల్ఆర్ కంటే రెండు మూడు శాతం తక్కువ రేటుకు గృహరుణాలిచ్చేవారు. ఆ తర్వాత 2010లో బేస్ రేట్ విధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానంలో బేస్ రేటు కంటే తక్కువ రేటుకు రుణాలివ్వడానికి వీల్లేదు. ఇక గృహరుణాల విషయానికి వస్తే బేస్ రేటుకో... లేక దానికి పావు నుంచి అర శాతం కలిపో ఇచ్చేవారు. ఇప్పుడు ఈ రెండింటి స్థానంలో డిపాజిట్ల సేకరణ వ్యయం ఆధారంగా ఎంసీఎఆల్ఆర్ను ప్రవేశపెట్టారు. బేస్ రేటు మాదిరి ఎంసీఎల్ఆర్ రేటు కంటే తక్కువ రేటుకు రుణాలు ఇవ్వడానికి లేదు. కానీ బేస్ రేటుతో పోలిస్తే ఎంసీఎల్ఆర్ ఆధారంగా వడ్డీరేటు లెక్కించటంలో మరింత పారదర్శకత ఉంటుంది. దీంతో ఇప్పటికే రుణాలు తీసుకున్న వారు ఎంసీఎల్ఆర్లోకి మారడం ద్వారా ప్రయోజనం పొందవచ్చన్నది నిపుణుల సూచన. బీపీఎల్ఆర్, బేస్ రేట్‌తో పోలిస్తే ఎంసీఎల్ఆర్ విధానంలో గృహరుణాల వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం కూడా అదనపు ఆకర్షణ. ఇప్పుడు ఎస్బీఐతో సహా చాలా బ్యాంకులు కొంత రుసుము చెల్లించడం ద్వారా ఎంసీఎల్ఆర్లోకి మారడానికి అనుమతిస్తున్నాయి. కేవలం తేడా పది బేసిస్ పాయింట్లే కదా (0.1 శాతం) అనుకోవద్దు. రూ.50 లక్షల రుణానికి 20 ఏళ్లలో పది బేసిస్ పాయింట్లు తగ్గడం వల్ల సుమారు లక్ష రూపాయల భారం తగ్గుతుంది. అదే అర శాతం తగ్గితే రూ.4 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుంది. అందుకే ఈ కొత్త విధానంలోకి మారడం ద్వారా ఈఎంఐ భారం తగ్గించుకోవచ్చు. అదే 2010కి ముందు బీపీఎల్ఆర్ విధానంలో తీసుకున్న వారైతే ఈ కొత్త విధానంలోకి మారడం ద్వారా రుణ భారాన్ని భారీగా తగ్గించుకోవచ్చు. కొత్తగా తీసుకునే వారైతే...! ఏప్రిల్ 1 నుంచి రుణాలు తీసుకునే వారికి ఎంసీఎల్ఆర్ విధానంలోనే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయి. మీ రుణ కాల పరిమితిపై ఎంసీఎల్ఆర్ రేటు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం బ్యాంకులు రుణ కాలపరిమితిని బట్టి అయిదు రకాల ఎంసీఎల్ఆర్ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ ఎంసీఎల్ఆర్ విధానం వచ్చిన తర్వాత బ్యాంకులు అత్యధికంగా ఫిక్స్డ్ వడ్డీరేట్ల వైపునకు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి రుణం తీసుకునేటప్పుడు నిబంధనలన్నీ తప్పకుండా పరిశీలించండి. ఎందుకంటే ఎంసీఎల్ఆర్ విధానంలో దీర్ఘకాలానికి వడ్డీరేట్లు స్థిరంగా ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఫిక్స్డ్ వడ్డీరేటు ఎంత కాలానికి వర్తిస్తుంది? ఆ తర్వాత ఫ్లోటింగ్ రేటు ఉంటుందా? లేక తిరిగి అప్పటి వడ్డీరేటుకు ఫిక్స్డ్ చేస్తారా? అనే విషయంపై స్పష్టత తీసుకోండి. 0.1% తగ్గిన ఎస్బీఐ రేటు... ఎస్బీఐ విషయానికొస్తే బేస్ రేటు 9.3 శాతంగా ఉంటే, ఎంసీఎల్ఆర్ రేటు 9.20%. మొన్నటి వరకు ఎస్బీఐ గృహరుణాలను బేస్ రేటు కంటే పావు శాతం అధిక వడ్డీ రేటుకు అంటే 9.55 శాతానికి ఇచ్చేది. ఇప్పుడు ఈ కొత్త విధానంలో కూడా ఎంసీఎల్ఆర్ కంటే పావు శాతం అధిక వడ్డీరేటుకే గృహరుణాలిస్తోంది. కానీ గృహ రుణాలకు ఎంసీఎల్ఆర్ రేటు 9.2 శాతం కావడంతో 0.10 శాతం తక్కువ రేటుకే అంటే 9.45 శాతానికే రుణాలు లభిస్తున్నాయి. అంతేకాదు!! రానున్న కాలంలో డిపాజిట్ల రేట్లు తగ్గితే ఎంసీఎల్ఆర్ కూడా తగ్గుతుంది. వచ్చే ఏడాది కాలంలో వడ్డీరేట్లు మరో అరశాతం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్బీఐ రుణాల వడ్డీరేట్లు బేస్ రేటు : 9.3% బీపీఎల్ఆర్ రేటు : 14.05% ఎంసీఎల్ఆర్ రేటు : 9.20% -
సిమెంట్ ధరలు పెరుగుతాయ్
రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా ముంబై: సిమెంట్ ధరలు పెరుగుతాయని ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించడంతో డిమాండ్ పుంజుకుంటోందని, ఫలితంగా ధరలు పెరుగుతాయనేది ఇక్రా అంచనా. వర్షాల కారణంగా గత ఏడాది జూలై-సెప్టెంబర్ కాలానికి సిమెంట్ టోకు ధరలు తగ్గాయని (ఉత్తర, పశ్చిమ భారత దేశాల్లో), అయితే వర్షాకాలం పూర్తయిన తర్వాత ధరల పెరుగుదల స్వల్పంగానే ఉందని ఇక్రా పేర్కొంది. గత ఏడాది అక్టోబర్‌లో సిమెంట్ ధరలు బస్తాకు రూ..5-20కు పెరిగాయని, కానీ, నవంబర్, డిసెంబర్‌ల్లో డిమాండ్ లేకపోవడంతో ధరలపై మళ్లీ ఒత్తిడి పెరిగిందని వివరించింది. రానున్న మూడేళ్లలో సిమెంట్‌కు డిమాండ్ 8-8.5 శాతం పెరగనున్నదని, అయితే డిమాండ్‌కు తగ్గట్లుగా ఉత్పత్తి సామర్థ్యం పెరగడం లేదని ఇక్రా వెల్లడించింది. -
4 రోజుల్లో సిమెంట్ ధరలు తగ్గించాలి: పల్లె
సాక్షి, హైదరాబాద్: సిమెంట్ కంపెనీల యాజమాన్యాలు వెంటనే ధరలను తగ్గించాలని ఏపీ సమాచార, ఐటీశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోరారు. నాలుగు రోజుల్లో సిమెంట్ ధరలను తగ్గించాలని, లేకుంటే ప్రత్యామ్నాయ చర్యలు చేపడతామని హెచ్చరించారు. ధరలు తగ్గించకుంటే సిమెంటు కంపెనీలకు ప్రభుత్వం కల్పించే రాయితీలను కట్ చేస్తామని హెచ్చరిక జారీ చేశారు. మంత్రి పల్లె శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్లో 11 సిమెంటు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శాస్త్రీయత లేకుండా పెంచిన ధరల్ని తగ్గించకుంటే కఠిన చర్యలుంటాయని స్పష్టంచేశారు. -
‘సిమెంట్ ధరలు త గ్గించండి’
హైదరాబాద్: సిమెంట్ ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం ఆయూ కంపెనీల యాజమాన్యాలను కోరింది. సోమవారం కమిటీ సిమెంట్ కంపెనీల యజమానులతో సమావేశమై చర్చలు జరిపింది.ఈ విషయమై చర్చించేందుకు ఈ నెల 16న మరోసారి భేటీ కావాలని ఉప సంఘం నిర్ణరుుంచింది. -
కట్టేదెట్టా..!
►ఆకాశన్నంటుతున్న నిర్మాణ సామగ్రి ►సిమెంట్ ధరలు పైపైకి ►మధ్యలోనే నిలిచిపోతున్న నిర్మాణాలు ►ఇబ్బందుల్లో 2 లక్షల మంది కార్మికులు నెల్లూరు (దర్గామిట్ట): సామాన్యులకు సొంతింటి కల సాకారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి కారణం నిర్మాణ సామగ్రి అంతకంతకూ పెరుగుతుండటమే. చాలాచోట్ల నిర్మాణ సామగ్రి ఉన్నంత వరకు పనులు పూర్తి చేసి నిలిపి వేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చాలా నిర్మాణాలు మధ్యలో నే నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ. 200 కోట్లకుపైగా విలువైన నిర్మాణాలు సాగుతున్నాయని బిల్డర్లు చెబుతున్నారు. నెల్లూరులోనే సుమారు రూ. 80 కోట్లు నుంచి 90 కోట్లు మేర నిర్మాణ పనులు జరుగుతున్నాయనేది అంచనా. నిర్మాణరంగంపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 2 లక్షల మందికిపైగా ఆధారపడి జీవిస్తున్నారు. నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిన నేపథ్యంలో మధ్యలోనే నిలిచిపోతుండటంతో కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సిమెంట్ ధరలు పైపైకి ...: గతంలో 50 కిలోల సిమెంట్ బస్తా రూ. 210 నుంచి రూ.235 వరకు ఉండేది. ప్రస్తుతం రూ. 325కు పెరిగింది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. కంపెనీలన్నీ సిండికేట్ కావడం వల్లే ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ఒక మాదిరి ఇంటి నిర్మాణానికి 500 బస్తాలు సిమెంట్ అవసరం ఉంటుంది. అంటే దాదాపు ఒక్క సిమెంట్‌కే అదనంగా రూ. 50వేలు పైనే భారం పడుతుంది. అమాంతంగా పెరిగిన ఇసుక ధరలు : ప్రస్తుతం జిల్లాలోని ఇసుక రీచ్‌లకు వేలం నిర్వహించక పోవడంతో ధరలు అమాంతంగా పెరిగాయి. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ. 2వేలు ఉండగా ప్రస్తుతం రూ. 4 వేలకు పెరిగింది. ఒక్కో ఇంటికి దాదాపు 40 లారీల ఇసుక అవసరం ఉంటుంది. ఈ లెక్కన ఇసుకపైనే దాదాపు రూ. 2లక్షలపైనే భారం పడుతుంది. సామాన్య ప్రజలు పునాదులకు మట్టినే వాడుతున్నారు. ఇటుక ధరలకు రెక్కలు : ఆరు నెలల క్రితం 2 వేల ఇటుకలు రూ. 6500 ఉండేవి. ప్రస్తుతం రూ. 8 వేలకు పెరిగిది. ఒక్కో ఇంటికి దాదాపు 30 వేలకు పైగా ఇటుకలు అవసరం ఉంటుందని అంచనా. క్వాలిటీ ఇటుక అయితే మరో వెయ్యి రూపాయిలు అదనంగా ఖర్చు చేయాల్సిందే. కొండెక్కిన స్టీల్, ఇనుము ధరలు : ఇనుము ధరలు కూడా పెరిగిపోయాయి. ఆరు నెలల క్రితం వైజాగ్ స్టీల్ ధర టన్ను రూ. 38 వేలు ఉంది. అది ప్రస్తుతం టన్ను రూ. 45వేలకు పైగా పెరిగింది. గతంతో పోలిస్తే టన్నుకు రూ. 8వేలు పెరిగినట్టే. ఒక్కో ఇంటికి దాదాపు నాలుగు టన్నుల ఇనుము వినియోగిస్తున్నారని అంచనా. పెరిగిన కంకర ధర : నిర్మాణంలో కంకర కీలకమైంది. దీని ధరలు పెరిగిపోయాయి. గతంలో యూనిట్ ధర రూ. 4 వేలు ఉంటే ప్రస్తుతం రూ. 5 వేలకు పెరిగింది. అదే చీమకుర్తి, రాయవేలూరుల నుంచి తీసుకొచ్చిన కంకరైతే యూనిట్‌కు మరో రూ. 1500 అదనంగా చెల్లించాల్సిందే. ఒక్కో ఇంటికి 8 లారీలు కంకర అవసరం ఉంటుందని చెబుతున్నారు. పెరిగిన కలప ధరలు : ఇటీవల కలప ధరలు కూడా పెరిగాయి. నాణ్యమైన కలప కొనాలంటే ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తక్కువ కలప కొనాలన్నా అడుగు సుమారు. రూ. 1000 ఉంది. అదే నాణ్యత గల కలప కొనాలంటే అడుగు రూ. 2 వేల నుంచి రూ.8 వేల వరకు పలుకుతోంది. ఒక్కో ఇంటికి దాదాపు 50 నుంచి 60 అడుగుల కలప అవసరం. కొంత మంది కలప వినియోగం తగ్గించి ప్లాస్టిక్, ఇతర పదార్థాలను వినియోగిస్తున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు పెరిగిన కష్టాలు : నిర్మాణ సామగ్రి ధర పెరుగుదలతో ఇందిరమ్మ లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరమ్మ పథకంలో భాగంగా ఒక్కో ఇంటికి రూ.75 వేలు నుంచి రూ.లక్ష వరకు ఇస్తున్నారు. ఈ మొత్తం సరిపోవడం లేదు. దీంతో పాటు గత కొన్ని నెలలుగా లబ్ధిదారులకు బిల్లులు చెల్లించడం లేదు. ఇంటి నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు చేపట్టి అమాంతంగా పెరిగి పోతున్న నిర్మాణ ధరలను అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
సిమెంట్ ధరలు తగ్గించలేం!
-
సిమెంట్ ధరలు తగ్గవు.. మరింత పెరుగుతాయి..
హైదరాబాద్: సిమెంట్ ధరలు ఎటువంటి పరిస్థితుల్లోనూ తగ్గవని సిమెంట్ కంపెనీల ప్రతినిధులు స్పష్టం చేశారు. సిమెంట్ ధరలు పెరగడానికి బొగ్గు, విద్యుత్ కొరత, ధరల పెరుగుదలనే కారణమని సంస్థలు వెల్లడించాయి. బొగ్గు, విద్యుత్ కొరత కారణంగా ఇప్పటికే 2 రాష్ట్రాల్లో 4 సిమెంట్ కంపెనీలు మూతపడ్డాయని కంపెనీల ప్రతినిధులు తెలిపారు. ఇప్పట్లో సిమెంట్ ధరలు తగ్గే అవకాశం లేదని.. భవిష్యత్ లో మరింత పెరుగుతాయని సిమెంట్ కంపెనీల ప్రతినిధులు అన్నారు. సిమెంట్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిల్డర్ల జేఏసీ ఈనెల 5 నుంచి 20వ తేదీ (రెండు వారాలు) వరకు సిమెంట్ కొనుగోళ్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. సిమెంట్ ధరల అనూహ్య పెరుగుదలపై బిల్డర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆరు రోజుల పాటు భవనాల నిర్మాణాన్ని ఆపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. -
సి‘మంట’
- ఇంకా తగ్గని సిమెంట్ ధరలు - నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం - ఇబ్బందుల్లో మధ్య తరగతి ప్రజలు కరీంనగర్ : సిమెంట్ ధరలు ఇంకా తగ్గడం లేదు. కంపెనీలు కృత్రిమ కొరత సృష్టించి అమాంతంగా ధరలు పెంచా యి. దీంతో రియల్ ఎస్టేట్ రంగమే కాకుండా అన్నిరకా ల నిర్మాణాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇళ్ల నిర్మాణాలంటేనే బెంబేలెత్తుతున్నారు. సిమెంట్ కంపెనీల తీరుకు నిరసనగా ఈనెల 5నుంచి బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో సిమెంట్ కొనుగోళ్లు నిలిపివేయడం కూడా నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం వర్షాకాలం కావడం భవన నిర్మాణాలకు అనువైన సీజన్ కాదు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు నిర్మాణాలకు అనువైన కాలం. ఈ కాలంలోనే నిర్మాణాలు అధికంగా జరుగుతాయి. సిమెంట్ ధరలు పెరిగినా ఈ కాలంలోనే. జూలై నుంచి వర్షాలు పడటం వల్ల నిర్మాణాలు అంతం త మాత్రంగా ఉంటాయి. అన్‌సీజన్ అయిన వర్షాకాలంలో ధరలు పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జూలై మొదటి వారంలో బస్తా రూ.225 నుంచి రూ.230 ఉండగా.. ప్రస్తుతం రూ.320కి చేరింది. నెల రోజుల్లోనే ఏకంగా ఒక్కో బస్తాపై రూ.వందకు పైగా పెరగడంతో రియల్టర్లు, కాంట్రాక్టర్లు పనులు నిలుపుద ల చేసే యోచనలో ఉన్నారు. ఇప్పటికే స్టీల్, ఇసుక, చిప్స్ ధరలు భారీగా ఉన్నాయి. వీటికి సిమెంట్ ధరలు కూడా తోడయ్యాయి. భవిష్యత్‌లో గృహాలు నిర్మించుకోవాలనుకునే పేద, మధ్య తరగతి ప్రజలకు పెరిగిన ధరలు గుదిబండగా మారాయి. సీజన్లో జిల్లాలో సు మారు 40 వేల టన్నుల సిమెంట్ వినియోగమవుతోం ది. ఇదే అదనుగా సిమెంట్ వ్యాపారులు సైతం ఉన్నపళంగా ధరలు పెంచారనే ఆరోపణలున్నాయి. ఎందుకిలా.. ? సిమెంట్ ధరలు అమాంతం పెరగడానికి రాష్ట్ర విభజన ఓ కారణమని తెలుస్తోంది. గతేడాది తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల వల్ల సిమెంట్ రవాణాకు ఆటంకం కలిగింది. రాష్ట్ర విభజన, ఆ వెంటనే ఎన్నికలు ఇలా ఒక దానికొకటి తోడయ్యాయి. వీటితో పాటు కరెంటు కోతలతో ఉత్పత్తి, రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడిం ది. దీనికితోడు వరుసగా ఎన్నికలు రావడంతో కోడ్ ప్రభావం నిర్మాణ రంగంపై పడింది. కోడ్ అమలుతో చాలా వరకు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఇ ప్పుడిప్పుడే పనులు ఊపందుకుంటున్నాయి. ఈ తరుణంలో కంపెనీలు సిమెంట్ ధరలను పెంచి భారీగా లాభాలు మూటగట్టుకుంటున్నాయి. ప్రస్తుతం బ్రాండె డ్ కంపెనీల సిమెంట్ ధరబస్తా రూ.320 ఉండగా.. ఇతర సాధారణ బస్తాల ధర రూ.300 వరకు ఉంది. ఈ ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. అమ్మకాలు తగ్గాయి నెలరోజులుగా సిమెంట్ ధరలు పెరగడంతో అమ్మకాలు తగ్గాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అవసరమున్న వారు సిమెంట్ కోనుగోలు చేస్తున్నారు. పనులు చేపడదామనే ఆలోచన ఉన్నవారు విరమించుకున్నారు. నిర్మాణ దశలో ఉన్న ఇళ్ల పనులు ఆపేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని సిమెంటు ధరలను అదుపులో పెట్టాలి. -చాడ శ్రీనివాస్‌రెడ్డి, సిమెంట్ వ్యాపారి సిండికేట్‌కు గుణపాఠం తప్పదు సిమెంట్ కంపెనీలకు గుణపాఠం తప్పదు. ఈ నెల 5 నుంచి కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) ఆధ్వర్యంలో సిమెంట్ కొనుగోళ్లు నిలిపివేశాం. ఇప్పటికే ఏపీ, తెలంగాణ సీఎంలను కలిసి విన్నవించాం. మరోసారి కలిసి ఏం చేయాలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకుంటాం. -వై.రాజశేఖర్‌రెడ్డి, క్రెడాయ్ జిల్లా చైర్మన్ -
రెండు వారాలుగా సిమెంట్ కొనుగోళ్లు బంద్
‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్నట్టుగా ఉంది భవన నిర్మాణ రంగ కార్మికుల పరిస్థితి. అమాంతం పెరిగిన సిమెంట్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిల్డర్ల జేఏసీ ఈనెల 5 నుంచి 20వ తేదీ (రెండు వారాలు) వరకు సిమెంట్ కొనుగోళ్లను నిలిపివేసింది. దీంతో హైదరాబాద్ నిర్మాణ రంగం పడకేసింది. దీంతో నిర్మాణ రంగంపై ఆధారపడిన కార్మికులు పనుల్లేక రోడ్డున పడ్డారు. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నిర్మాణ రంగంపై ఆధారపడి సుమారుగా 60 వేల మంది కార్మికులున్నారు. రాడ్ బెండింగ్, పెయింటింగ్, కార్పెంటర్, బ్రిక్ ఇండస్ట్రీస్ వంటి సుమారు 26 విభాగాలు నిర్మాణ రంగానికి అనుబంధంగా తమ కార్యకలాపాలను సాగిస్తుంటాయి. అయితే ఒక్కసారిగా సిమెంట్ బస్తా (50 కిలోలు) ధర రూ.100కు పైగా పెరగడాన్ని నిరసిస్తూ సిమెంటు కొనుగోళ్లకు బిల్డర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రెండు వారాలు బ్రేక్ వేసింది. దీంతో నిర్మాణ పనులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పనులు లేక పోవడంతో.. రెక్కాడితే గారీ డొక్కాడని కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. రెండు వారాలుగా కూలీ లేక పూట గడవడమే కష్టంగా మారిందని పలువురు కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. 20 వేల ఫ్లాట్లకు బ్రేకులు.. ఏటా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ప్రభుత్వ విభాగాల నుంచి 35 వేల ఇంటి దరఖాస్తులు అనుమతులు పొందుతుంటే.. ప్రస్తుతం వీటిలో సుమారుగా 20 వేల ఫ్లాట్లు నిర్మాణ పనులు జరుపుకుంటున్నాయని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) జాతీయ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. అయితే సిమెంట్ హాలిడే ప్రకటించడంతో ఈ ఫ్లాట్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీంతో కొనుగోలుదారులకు ఇచ్చిన సమయంలోగా ఫ్లాట్లను అందించలేమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు పెరిగిన సిమెంట్ ధరతో ప్రాజెక్ట్ వ్యయమూ పెరుగుతుంది. ఈ భారం నుంచి తప్పించుకునేందుకు చ.అ.కు రూ.300కు పైగా పెంచక తప్పని పరిస్థితి నెలకొందని శేఖర్ చెప్పుకొచ్చారు. అంటే ఈ భారం మళ్లీ సామాన్యుడి నెత్తిపైనే పడనుందన్నమాట. రెండు వారాల్లో రూ.37.80 కోట్లు నగరంలో 50-60 వేల మంది భవన నిర్మాణ కార్మికులుంటారని తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు గంధం అంజన్న చెప్పారు. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాకుండా హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. వీరంతా తాపీమేస్త్రి, సెంట్రింగ్ మేస్త్రి (శ్లాబులు వేసేవాళ్లు), మట్టి లేబర్, వండ్రంగి, పెయింటర్, కార్పెంటర్ ఇలా నిర్మాణ రంగంలోని వివిధ దశల్లో కూలీలుగా పనిచేస్తుంటారు. వీరికి ఒక్క రోజుకు మేస్త్రీకి రూ.500, హెల్పర్‌కు రూ.400, మహిళలకు రూ.300 కూలీ చెల్లిస్తుంటారు. అయితే 14 రోజులుగా నిర్మాణ పనులు నిలిచిపోవడంతో కూలీలంతా కలసి రూ.కోట్లలో నష్టపోయారు. ఎలాగంటే రోజుకు 60,000 (కూలీలు) 5 450 (సగటున దినసరి కూలీ) = 2,70,00,000. మొత్తం 14 రోజులకు చూసుకుంటే.. అక్షరాల రూ.37.80 కోట్లు నష్టపోయారన్నమాట. -
సిమెంట్ ధరలపై బిల్డర్ల భగ్గు
- ఆరు రోజులపాటు నిర్మాణ పనుల నిలిపివేత - రాజకీయ నేతలకు ముడుపులివ్వడం వల్లే ధరలు పెరిగాయి - ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధుల ఆరోపణ ఒంగోలు : సిమెంట్ ధరల అనూహ్య పెరుగుదలపై ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు భగ్గుమన్నారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ ఆరు రోజుల పాటు భవనాల నిర్మాణాన్ని ఆపేస్తున్నామని పేర్కొన్నారు. స్థానిక ఎంసీఏ భవన్లో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐవీ వీరబాబు, కార్యదర్శి ఎం హరి ప్రేమనాథ్, కోశాధికారి ఎం రఘురామయ్య తదితరులు కార్యాచరణను ప్రకటించారు. గత పది రోజుల వ్యవధిలో బస్తా సిమెంట్ ధరను రూ.200 రూ.350కు పెంచారని, ఇది నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. ఒంగోలు నగరంలో 60 మంది తమ సంఘంలో సభ్యులుగా ఉన్నారని, 10 వేల మందికి పైగా కార్మికులు ఉపాధి పొందుతున్నారని వివరించారు. సిమె ంట్, ఇనుము ధరల భారీ పెరుగుదల వల్ల తాము నిర్మాణ పనులు నిలిపేయక తప్పడం లేదని చెప్పారు. తాము చేపట్టే ప్రతి పనిపైనా 30 శాతం నిధులను ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తున్నా.. నిర్మాణ రంగంపై ప్రభుత్వం చిన్నచూపు చూడటం బాధాకరమన్నారు. సిమెంట్ కంపెనీలన్నీ తెలంగాణ లో ఉండటంతో.. వాటి యాజమాన్యాలు రాజకీయ నాయకులకు ముడుపులు ఇచ్చి ఇష్టారాజ్యంగా సిమెంట్ ధరలు పెంచేశాయని విమర్శించారు. ఇసుకపై ప్రభుత్వం నిర్ధిష్టమైన ప్రణాళిక విడుదల చేయకపోవడంతో పోలీసులు, మైనింగ్ అధికారులు ట్రాక్టర్ల వెంటపడి బిల్డర్లను వేధిస్తున్నారన్నారు. ఇలా చేయడం సరికాదని, కలెక్టర్ జోక్యం చేసుకోవాలని కోరారు. సోమవారం ఒంగోలులో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శనివారం వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. ఆందోళనలో భవన నిర్మాణ కూలీల సంఘ ప్రతినిధులు, సిమెంట్ వ్యాపారులు పాల్గొనాలని కోరారు. సమావేశంలో బిల్డర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు దుంపా కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు జీ రాజేంద్ర, సభ్యులు జే రాకేష్‌రెడ్డి, ఎం తిరుమల తదితరులు పాల్గొన్నారు. -
కొనలేం.. కట్టలేం!
చుక్కలు చూపిస్తున్న సిమెంట్ ధరలు నెల రోజుల్లో రూ.100కు పైగా పెరిగిన ధర రవాణా, ఇంధన చార్జీలతో స్టీల్, ఇసుక కూడా.. ఫ్లాట్ల ధరలను పెంచే యోచనలో బిల్డర్లు దీంతో సామాన్యులకు దూరమవుతున్న సొంతిల్లు ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు’ అన్న చందంగా ఉంది నిర్మాణ రంగ పరిస్థితి. ఏడాదికాలంగా స్థిరాస్తి కొనుగోళ్లు లేక, బ్యాంకులు రుణాలు మంజూరు చేయక తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న హైదరాబాద్ నిర్మాణ రంగానికి తాజాగా సిమెంట్, స్టీల్, ఇసుక ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మరీ ఎక్కువగా నెల రోజులుగా రూ.100కు పైగా పెరిగిన సిమెంట్ ధరలు బిల్డర్లకు మంట పుట్టిస్తున్నాయి. పెరిగిన ధరల నుంచి ఉపశమనం పొందేందుకు నిర్మాణ సంస్థలన్నీ ఒక్క తాటిపైకొచ్చి చ.అ. ధరను రూ.200 లకు పైగా పెంచేందుకు సిద్ధమయ్యాయి. అంటే సొంతంగా గూడు కట్టుకుందామనుకునే సామాన్యుడికి ఓ పక్క నిర్మాణ సామగ్రి ధరలు చుక్కలు చూపిస్తుంటే.. మరోపక్క అపార్ట్మెంట్లలో ఫ్లాట్ తీసుకుందామంటే చ.అ. ధరలు భారంగా మారాయన్నమాట. ఎటొచ్చీ నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల సామాన్యులకే గుదిబండగా మారింది. సాక్షి, హైదరాబాద్: సరిగ్గా నెల క్రితం.. సిమెంట్ (50 కిలోలు) ధర రూ.240-260గా.. అలాగే టన్ను స్టీలు రూ.44-45 వేలుగా, ట్రాక్టర్ ఇసుక రూ.4,400 లుగా ఉండేది. కానీ, ప్రస్తుతం సిమెంట్ ధర రూ.315 అయ్యింది. కొందరైతే రూ.350కి కూడా అమ్ముతున్నారు. ఇక స్టీలు ధర రూ.46-47 వేలుంటే, ఇసుక రూ.4,500లు పలుకుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ వాహనాల ప్రవేశ పన్నులు విధించడం, మరోవైపు రైల్వే సరుకు రవాణా చార్జీలు 6.5 శాతం పెరగడం, ఇంధన వనరుల ధరలూ ఇదే బాటలో పయనించడం వంటి కారణాలతో నిర్మాణ సామగ్రి ధరలు అమాంతం పెరిగాయి. 27 రోజుల్లో రూ.105 భారం: జూన్ 1న సిమెంట్ బస్తా ధర మార్కెట్లో 210 ఉంది. రాష్ట్ర విభజన 2వ తేదీన జరగ్గా 3వ తేదీన బస్తాకు రూ.50 పెంచి రూ.260 చేశారు. 7వ తేదీ నుంచి ఇంకో రూ.25 పెంచి రూ.285కి చేర్చారు. 19వ తేదీన మరో రూ.10 పెంచి రూ.295కు తీసుకెళ్లారు. తాజాగా మరో రూ.20 భారం వేసి బస్తాను రూ.315 విక్రయిస్తున్నారు. అంటే 27 రోజుల్లో సిమెంట్ బస్తాపై రూ.105 పెంచేశారన్నమాట. సిమెంట్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు, ముడిపదార్థాల ధరలు పెరగడం, విద్యుత్, రవాణా చార్జీలూ భారంగా మారడం వల్లే ధరలు పెంచాల్సి వచ్చిందని సిమెంట్ కంపెనీలు చెబుతున్నాయి. 41 సిమెంట్ కంపెనీలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 41 సిమెంట్ కంపెనీలున్నాయి. ఇవి 34 రకాల బ్రాండ్లతో సిమెంట్‌ను విక్రయిస్తున్నాయి. ఇందులో 20 బ్రాండ్లకు మాత్రం మార్కెట్లో కొంచెం ఎక్కువ గిరాకీ ఉంది. గతంలో రెండు రాష్ట్రాల్లోని కంపెనీలు కలిపి నెలకు 20 లక్షల టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేసేవి. మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించడానికి ఉత్పత్తిని 11 లక్షల టన్నులకు తగ్గించినట్టుగా బిల్డర్లు అసోసియేషన్లు ఆరోపిస్తున్నాయి. సాధారణంగా సిమెంట్ తయారీ రాష్ట్రాల్లో ధర తక్కువగా ఉండి పొరుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే సిమెంట్ తయారీకి అవసరమయ్యే ముడిసరుకు రాష్ట్ర ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాయితీ ధరకే సిమెంట్ లభించాలని బిల్డర్లు కోరుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో: సమైక్య రాష్ట్రంలో గతేడాది జులైలో సిమెంట్ ధర (50 కిలోలు) రకాన్ని బట్టి రూ.320 దాకా ఉంది. తర్వాతి నెలలో రూ.200-225కు పడిపోయింది. గిరాకీ లేకపోవడమే ధర క్షీణతకు కారణమని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 2014 మే నుంచి ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడులో బస్తా సిమెంట్ ధర రూ.360-రూ.370, కర్ణాటకలో రూ.350, కేరళలో రూ.370, ఢిల్లీలో రూ.280-రూ.290, మహారాష్ట్రలో రూ.300, బెంగళూరులో రూ.310-320, ముంబైలో రూ.260-రూ.270 ఉంది. ప్రభుత్వం చేయాల్సినవివే.. 1. మూకుమ్మడిగా పెంచిన సిమెంట్ ధరలపై ‘కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా’ (సీసీఐ)కు ఫిర్యాదు చేస్తామని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) ఏపీ ప్రెసిడెంట్ ఎస్ రాం రెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. అన్ని నిర్మాణ రంగ సంస్థలను ఒకే వేదికపై తీసుకొచ్చి నిర్మాణ పనులను నిలిపివేస్తాం. అయినా ధరలు తగ్గించకపోతే ఫ్లాట్ల ధరలను చ.అ.కు రూ.200 లకు పైగా పెంచుతాం. అంతిమంగా ఈ భారం సామాన్యులపైనే పడుతుంది. 2. సిమెంట్ ఫ్యాక్టరీలు స్థాపించేందుకు ముందుకొచ్చే సంస్థలకు ప్రత్యేక రాయితీలు కల్పించాలి. తాండూర్, ఆదిలాబాద్‌ల్లో ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా పెంచాలి. 3. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఇసుక, స్టీల్, సిమెంట్ వంటి వాహనాలకు టోల్, సర్వీస్ టాక్స్ వంటి పన్నుల్లో మినహాయింపులివ్వాలి. 4. సిమెంట్ పరిశ్రమల్లో విడుదలయ్యే ఉష్ణోగ్రతను వృథాగా వదిలేయకుండా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటే ఖర్చు బాగా కలిసొస్తుంది. ఉష్ణోగ్రతను సద్వినియోగం (వేస్ట్‌హీట్ రికవరీ) చేసుకునే ప్రక్రియకు పునరుత్పాదక ఇంధన హోదాను కూడా కల్పించాలి. 5. విద్యుత్తు ప్లాంట్ల నుంచి వచ్చే ఫ్లైయాష్, శ్లాగ్ను ముడిపదార్థంగా వినియోగించి సిమెంట్‌ను తయారు చేయవచ్చు. విద్యుత్ సంస్థల నుంచి సిమెంట్ కంపెనీలకు ఉచితంగా ఫ్లైయాష్‌ను అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. -
ఈ ‘ధర’ణిలో బతికేదెలా!
- కిలో రూ.30 నుంచి రూ.40కి పెరిగిన సన్నబియ్యం - మండుతున్న కూరగాయల ధరలు - ఒక్కసారిగా రూ.100 పెరిగిన సిమెంట్ - మార్కెట్ అంటే జంకుతున్న సామాన్యులు - ధరల నియంత్రణలో అధికారులు విఫలం ఒంగోలు టూటౌన్: ధరలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. సామాన్యులు కొనలేని స్థితికి చేరుకుంటున్నాయి. మార్కెట్‌కు వెళ్లాలంటే పేద, మధ్యతరగతి ప్రజలు జంకుతున్నారు. నెల రోజులుగాఅన్ని వస్తువుల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల పెరిగిన కొన్ని వస్తువుల ధరలు చూస్తే గుండె గుభేల్మంటోంది. బియ్యం ధరలు అమాంతంగా పెరిగాయి. ప్రజలు ఎక్కువగా వాడే సన్నబియ్యం, లావు బియ్యం ధరలు వినియోగదారులకు మార్కెట్లో చుక్కలు చూపిస్తున్నాయి. బియ్యం ధరలు పెరిగిందిలా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సన్నబియ్యం(బీపీటీలు) కిలో రూ.30 నుంచి రూ.35 ఉంటే ఇప్పుడు కిలో రూ.40 పలుకుతోంది. అదే విధంగా లావు బియ్యం 25 కిలోల బ్యాగ్ రూ.1050 పెరిగింది. కిలో రూ.40 పైనే పెరిగింది. బియ్యం వ్యాపారులు అక్రమ నిల్వలు సృష్టించి ధరలు పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కొక్క రైస్ షాపుల వద్ద 250 క్వింటాళ్ల కంటే అదనంగా బియ్యం నిల్వలు ఉండకూడదు. వ్యాపారులు నిబంధనలు అతిక్రమించి అధికంగా కొని అక్రమ నిల్వలకు పాల్పడుతుండటంతో బియ్యం ధరలు పెరుగుతున్నాయి. సివిల్ సప్లై ఉదాసీనంగా వ్యవహరించడంతో వ్యాపారులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా తయారయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మండుతున్న కూరగాయల ధరలు : కూరగాయల సాగు విస్తీర్ణం రానురానూ తగ్గిపోతుండటంతో కూరగాయల ధరలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అరకొరగా సాగు చేసిన కూరగాయల పంటలకు వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు కరువై.. చీడపీడల బెడదతో పంటలను అర్ధాంతరంగా వదిలేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ ఏడాది వాతావరణం అనుకూలించక వంగతోటలు చీడపీడలకు గురై రైతుకు నష్టాలను మిగిల్చాయి. మార్కెట్లో కూరగాయల ధరలు రెండు నెలలుగా మండుతున్నాయి. గతంలో కేజీ రూ.10 నుంచి రూ.12 వరకు అమ్మిన వంకాయలు ఇప్పుడు డిమాండ్‌ను బట్టి రూ.24 వరకు పలుకుతోంది. ఒక దశలో రూ.40 పెరిగింది. అదే విధంగా క్యారెట్ రూ.24 ఉండగా.. కిలో రూ.60 చేరింది. రూ.40 అమ్మిన చిక్కుళ్లు రూ.80 చేరి వామ్మో అనిపిస్తోంది. కాలీఫ్లవర్ పువ్వు ఒకటి రూ.10 నుంచి రూ.15 ఉండగా ఇప్పుడు రూ.25 వరకు అమ్ముతున్నారు. బీర కిలో రూ.20 నుంచి రూ.30, బీట్రూట్ రూ.22 నుంచి రూ.25 నుంచి రూ.30 వరకు అమ్ముతున్నారు. మిర్చి రూ.14 నుంచి రూ.20 చేరింది. దోసకాయలు రూ.5 నుంచి రూ.10 చేరింది. పెద్దఉల్లి రూ.12 నుంచి రూ.18 పెరిగింది. దొండ కాయలు కిలో రూ.14 నుంచి రూ.20 పెరిగి వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. కూరగాయల ధరలతోపాటు ఆకుకూరలైన గోంగూర, పెరుగు ఆకు, తోటకూర వంటి వాటికి కూడా ధరలు పెరిగాయి. గతనెలలో కేజీ ఉల్లిపాయల ధర రూ.12 నుంచి రూ15 వరకు ఉండగా ప్రస్తుతం రూ 30 లు పలుకుతోంది. పాలధరలు... పాలధరలు అమాంతంగా పెరిగాయి. లీటర్ రూ.42 నుంచి రూ.46 పెరిగింది. గతంలో లీటరు పాలు కొనే వారు ఇప్పుడు అరలీటరు కొనుక్కొని సర్దుకుంటున్నారు. పేద, మధ్య తరగతి వినియోగదారులు చాలమంది పాలనే కొనుక్కోవడం మానేయాల్సి వచ్చింది. పెరుగు, వెన్న ధరలు పెంచేశారు. కొండెక్కిన సిమెంట్ ధరలు : సిమెంట్ మంట పుట్టిస్తోంది. బస్తాపై రెండు సార్లు ధర పెరిగింది. గతంలో రూ.200 నుంచి రూ.210 ఉన్న సిమెంట్ ధరలు ఇప్పుడు రూ.300 నుంచి రూ.310 పెరిగింది. ధరలు పెరుగుతున్న సంగతి ముందే తెలుసుకొని పాత ధరలకు అధిక మొత్తంలో కొని నిల్వలు చేసుకున్నారు. ఇప్పుడు కొత్త ధరలకు అమ్మి వినియోగదారుల నెత్తిన శఠగోపం పెడుతున్నారు. పెరిగిన ధరల ఫలితంగా జిల్లాలో నెలకు 50 వేల టన్నుల అమ్మకాలు జరిగిన వ్యాపారం ఇప్పుడు 40 వేల టన్నులకు పడిపోయింది. అయినా ఇళ్లు కట్టుకునే పేద, మధ్య తరగతి ప్రజలకు భారంగా పరిణమించింది. మార్కెట్లో ధరలు ఒకదాని ప్రభావం ఇంకొక వస్తువు పడి భారంగా పరిణమించాయి. టీ రూ.5 నుంచి రూ.7 పెంచారు. కాఫీ రూ.8 అమ్ముతున్నారు. అల్పాహారాల ధరలూ పెరిగిపోయాయి. ధరల అదుపునకు ప్రభుత్వం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. -
సిమెంట్ ధరలు తగ్గించాలి : నంద్యాల
హుజూర్నగర్ : సిమెంట్ ధరలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఆర్అండ్బీ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఊహించని విధంగా సిమెంట్ ధరలు పెరగడంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణరంగం ఆగిపోయి అనేక మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారన్నారు. సిమెంట్ ఉత్పత్తిలో ముడిసరుకు, విద్యుత్, కూలీల ఖర్చులు పెరగకుండానే అనూహ్యంగా ఉత్పత్తిదారులు ధరలు పెంచారన్నారు. ప్రభుత్వం ఏ మాత్రమూ పట్టించుకోకుండా కాలయాపన చేయడం తగదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వాల కాలంలో గృహనిర్మాణశాఖ ద్వారా ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను మాఫీ చేయాలన్నారు. ఈ మాఫీతో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 30 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరే అవకాశం ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటీనీ అమలుచేసి ప్రజల విశ్వాసాన్ని పొందాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాలు రావాలని సీపీఎం పార్టీ కోరుకుందని, కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినందున నిర్మాణాత్మకమైన సహకారాన్ని అందిస్తామన్నారు. జిల్లాలోని 541 చెరువులు, 4 వేల కుంటలు పూడికతో ఉండి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయిందన్నారు. ప్రభుత్వం ఉపాధి హామీ ద్వారా చెరువులు, కుంటలలోని పూడికను తొలగించినట్లయితే సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అధికారంలోకి వచ్చాక అద్భుతాలు సృష్టిస్తానంటూ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచారం చేసుకున్న నరేంద్రమోడీ నేటి వరకు కనీసం ధరల పెరుగుదలను నియంత్రించేందుకు దృష్టి సారించడం లేదన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ములకలపల్లి రాములు, డివిజన్ కార్యదర్శి పారేపల్లి శేఖర్‌రావు, జిల్లా కమిటీసభ్యులు వట్టికూటి జంగమయ్య, పులిచింతల వెంకటరెడ్డి, డివిజన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
భారీగా పెరిగిన సిమెంట్ ధరలు
-
ఇల్లు...కట్టినోళ్లు గొల్లు!
సిమెంట్ ధరలు పైపైకి... అదే దారిలో ఇతర ముడి సరుకు ధరలు నిర్మాణాలపై అదనపు భారం ‘ఇల్లు కట్టి చూడు... పెళ్లి చేసి చూడు...’ అన్నారు పెద్దలు. పెళ్లి మాటేమో గానీ ఇల్లు కట్టడం మాత్రం పేద, మధ్య తరగతి ప్రజలకు తలకు మించిన భారంగా మారింది. సిమెంట్ ధర వారం రోజుల వ్యవధిలో గతంలో ఉన్నడూ లేనంతగా పెరిగింది. ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే ముడి సరుకు ధరలూ అదే తరహాలో పెరుగుతుండడం సామాన్యులకు ఆందోళన కలిగిస్తోంది. వారం రోజుల వ్యవధిలో సిమెంట్, ఇటుక, స్టీల్, చిప్స్(కంకర), ఇసుక ధరలు పెరగడం వల్ల నిర్మాణాలపై అదనపు భారం పడుతోంది. పిల్లర్లు, స్లాబులకు ఉపయోగించే ఇనుము(స్టీల్) కొంత ఊరట నిస్తున్నాయి. కానీ మిగిలిన ముడి సరుకుల ధరలు పెరగడంతో ఇళ్ల నిర్మాణదారులు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. మండలంలో సొంత ఇళ్లు, ఇతర వాణిజ్య సముదాయాలు, పాఠశాల భవనాలు అధిక సంఖ్యలో నిర్మాణ దశల్లో ఉన్నాయి. ధరల పెరుగుదల కారణంగా మందగించాయి. వేసవిలోనే నిర్మాణం పూర్తి చేసి గృహ ప్రవేశం చేయాలని భావించిన వారికి పెరిగిన ధరలు షాక్‌నిస్తున్నాయి. రూ.300 చేరిన సిమెంట్ వారం రోజుల క్రితం సిమెంట్ ధర అరకులోయలో రూ. 245 ఉంటే అదే సిమెంట్ ధర ఇపుడు రూ. 300 చేరింది. సిమెంట్ పరిశ్రమల యజమానులు సిండికేట్‌గా ఏర్పడడంతో ఒక్కసారిగా ధరలు ఆకాశనంటుతున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నారు. భవిష్యత్‌లో మరలా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బస్తాకు రూ. 60 వరకు పెరగడం గమనార్హం. ఇటుకల ధరలు పైపైకి... భవన నిర్మాణానికి అవసరమైన అన్ని ముడి సరుకుల మాదిరిగానే ఇటుకల ధరలు పెరిగాయి. రెండు వేల మట్టి ఇటుక గతంలో రూ. 8వేలు ఉండగా, ప్రస్తుతం రూ. 10 వేలుకు పెరిగింది. వెయ్యి ఫాల్ జి బ్రిక్స్ రూ. 13వేలు నుంచి రూ. 15వేలకు పెరిగింది. ఇసుక బంగారమే... భవన నిర్మాణానికి ఇసుక ప్రాణదాత. చుట్టుపక్కల గెడ్డల్లో ఇసుక లభిస్తున్నా ధర మాత్రం ఎక్కువగానే ఉంది. ఇసుక బంగారంగా మారింది. ఇదే అదనుగా ట్రాక్టర్, లారీల యజమానులు అదనపు ధరలకు విక్రయిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక ధర రూ. 800 నుంచి రూ. 1000 పలుకుతోంది. వర్షాకాలం రానుండడంతో ట్రాక్టర్, లారీల యజమానులు ఇసుక నిల్వలు చేసుకుంటున్నారు. మార్కెట్లో గిరాకీని బట్టి ధరలు పెంచుతున్నారు. కంకర...ధర కటకట : నిర్మాణాలకు అవసరమైన కంకర ఎస్.కోట సమీపం నుంచి ఈ ప్రాంతానికి ఎక్కువగా దిగుమతి అవుతోంది. నాణ్యమైన కంకర కావడంతో వినియోగదారులు వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో కంకర ధర బాగా పెరిగింది. కొద్ది రోజుల క్రితం రెండు యూనిట్ల లారీ లోడు రూ. రూ.10వేల నుంచి రూ.13వేలకు చేరింది. 40 యం.యం. లారీ లోడు రూ. 7,500 నుండి రూ.9 వేలుకు చేరింది. పునాది బండ...గుది బండ : పునాదులకు ఉపయోగించే బండ రాళ్ల ధర కూడ బాగా పెరిగింది. పునాదులకు అవసరమైన ట్రాక్టర్ లోడు బండరాళ్లు రూ. 1200 నుంచి రూ. 1500 చేరింది. అయినా ఒక యూనిట్ రాయి పూర్తిగా రావడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. -
సిమెంట్ ధరలకు రెక్కలు
సిమెంట్ ధరలకు రెక్కలొచ్చాయి. రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. వర్షాకాలం కాబట్టి సహజంగా ఈ సీజన్లో సిమెంట్ ధరలు స్థిరంగా ఉండవచ్చని గృహనిర్మాణదారులు భావించారు. మార్కెట్ వర్గాలు సైతం ఊహించని విధంగా సిమెంట్ ధరలు ఒక్కసారిగా పెంచేశారు. సామాన్యుడు రెండు గదుల ఇల్లు నిర్మించుకునే పరిస్థితి లేకుండాపోయింది. వారం రోజుల్లో 70 నుంచి 80 రూపాయల వరకు పెరిగాయి. వారం రోజుల క్రితం రూ.200 నుంచి రూ.210కి విక్రయించిన సిమెం ట్ బస్తా ధర ప్రస్తుతం రూ.280కి చేరింది. పెరిగిన ధరల కారణంగా కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారితోపాటు ఏజెన్సీల వారు కూడా ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 23 సిమెంట్ పరిశ్రమలు ఉన్నప్పటికీ ధరలు విపరీతంగా పెరగడానికి ఉత్పత్తి తగ్గిపోవడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. గతంకంటే 50 శాతం సిమెంట్ ఉత్పత్తి మాత్రమే చేస్తున్నారు. ఉత్పత్తి తగ్గి వినియోగం పెరగడంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికితోడు ఇటీవల కాలంలో వివిధ సిమెంట్ కంపెనీ యజమానులు సిండికేట్ అయ్యి ధరలు అమాంతం పెంచినట్లు తెలుస్తోంది. హర్‌ఏక్‌మాల్ సరుకులు మాదిరిగా మార్కెట్లో ఏ కంపెనీ సిమెంట్ అయినా ఐదు, పది రూపాయలు మాత్రమే తేడా ఉంది. సిమెంట్ ధర తక్కువగా ఉందని నిర్మాణాలు మొదలు పెట్టిన వారు నిర్మాణ ఖర్చు మరింత భారమవుతుందేమోనని ఆందోళన చెందుతుండగా మరి కొందరు నిర్మాణాలు మొదలు పెటేందుకు జంకుతున్నారు. ఇంటి నిర్మాణాలు నిలిచితే మా బతుకులు ఎలాగని, పూట ఎలా గడుస్తుందని భవన నిర్మాణ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో రూ.30 పెరిగే అవకాశం మరో రెండు రోజుల్లో సిమెంట్ ధరలు బస్తాకు మరో రూ.30 పెరిగే అవకాశాలు ఉన్నాయి. ధరల పెరుగుదల కారణంగా ఇం డ్లు నిర్మించుకునే వారు తలలు పట్టుకోవడంతో వ్యాపారాలు సా గడం లేదని వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. మరో 30 రూపాయలు పెరిగితే ఇళ్లు నిర్మించుకోవడానికి ఎవరూ ముందుకు రారని, వ్యాపారం సాగదని వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. వ్యాపారం చాలా తగ్గింది గత నెలలో రోజుకు సుమారుగా 100 సిమెంటు బస్తాలను అమ్మెవారం. కానీ ఈ నెలలో సిమెంటు ధర విపరీతంగా పెరి గిపోవడంతో కొనుగోలు చేయడానికి ఇళ్లు నిర్మించుకునే వారు రావడం లేదు. దీంతో వ్యాపారం పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం రోజుకు అతికష్టంగా 30నుంచి 40బస్తాలు మాత్రమే అమ్ముడుపోతున్నాయి. మేస్త్రీలు పనులు కూడా చేయడం లేదు. ధరలు తగ్గితే తప్ప గిరాకీ వచ్చే అవకాశం లేదు. - కండె రమణ, సిమెంటు షాపు నిర్వాహకుడు, మిర్యాలగూడ ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు సిమెంటు ధరలు విపరీతంగా పెర గడంతో సామాన్యులు ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేదు. గత నెలకు ఈ నెలకు 75 రూపాయలు పెరగడంతో మరింత భారంగా మారింది. ఏ ప్రభుత్వం వచ్చినా సిమెంటు ధరలు పెంచడమే కానీ తగ్గేది లేదు. అప్పులు చేసి గూడు నిర్మించుకుంటున్నాను. ధరలు పెరగడంతో అప్పులు కూడా పెరుగుతాయి. ఇల్లు నిర్మాణం మధ్యలో ఉండడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో సిమెంట్ కొనుగోలు చేస్తున్నాను. - చక్రాల ఆగయ్య, తోపుచర్ల