ఏపీకి కేంద్రం సహకరించడం లేదు: చంద్రబాబు | Central govt not helping to Andhra pradesh state, says Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

ఏపీకి కేంద్రం సహకరించడం లేదు: చంద్రబాబు

Published Sun, Mar 8 2015 5:44 PM | Last Updated on Sat, Jun 2 2018 3:18 PM

ఏపీకి కేంద్రం సహకరించడం లేదు: చంద్రబాబు - Sakshi

ఏపీకి కేంద్రం సహకరించడం లేదు: చంద్రబాబు

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.  ఆదివారం నెల్లూరులో ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు సమీక్ష సమావేశంలో  చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి జమ్మూకశ్మీర్ కంటే అధ్వానంగా ఉందని అన్నారు. రాష్ట్రంలోని ఉన్నతాధికారులు కోరినవన్నీ తీర్చామనీ తెలిపారు.

సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేశామని చెప్పారు. చిత్తశుద్ధితో పనిచేసి ఏపీ రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచేందుకు పని చేయాలని ఉన్నతాధికారులకు ఈ సందర్బంగా చంద్రబాబు సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement