గుంటూరు : గుంటూరులో చైన్‌స్నాచర్లు హల్‌చల్ చేస్తున్నారు. శనివారం రెండు గంటల వ్యవధిలో ఏడుగురు మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రంలోని పట్టాభిపురం, అరండల్‌పేట పరిధిలో బైక్ పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు మహిళల మెడల్లోని బంగారు గొలుసులను లాక్కెళ్లారు. ఈ వరుస చోరీలతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. కాగా చోరీకి గురైన సొత్తు ఎంత అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.