
దగాపడ్డ ఆంధ్రులారా మేల్కోండి: చలసాని
మదనపల్లె : ‘దగాపడిన ఆంధ్రులారా ఇకనైనా మేల్కొనకపోతే నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్ అంధకారమవుతుంద’ని ఆంధ్ర మేధావుల వేదిక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మదనపల్లెలో విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర విభజన విషయంలో అప్పటి పాలక పక్షం, ప్రతిపక్షం అన్యాయం చేశాయన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి నికర జలాల కోసం పోరాటం చేయకుండా అలస్వతం వహిస్తే విద్యుత్ సంక్షోభం ఏర్పడుతుందన్నారు.
గాలేరు-నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ ప్రాజెక్టు కాలువలకు నికర జలాలు కేటాయించి తాగు, సాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా, లోటుభర్తీ చేయకపోతే నవ్యాంధ్రప్రదేశ్ పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు. రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను తక్కువ రేటుకు తెలంగాణకు 24 సంవత్సరాలు ఇస్తూ సీమాంధ్ర ప్రాంతాన్ని అంధకారమం చేయడం బాధాకరమన్నారు.