'చంద్రబాబు...సోనియాకు సహకరించారు'
తిరుపతి : సీమాంధ్రలోని ఆరుకోట్ల మంది ప్రజలతో కాంగ్రెస్ పార్టీ ఆడుకుంటోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రలోని చేతి వృత్తుల వారు సైతం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలోని తుడా సర్కిల్లో క్రిస్టియన్ మైనార్టీల దీక్షలో భూమన గురువారం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భూమన నడిరోడ్డుపై బుట్టలు అల్లుతూ నిరసన తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటానికే సోనియాగాంధీ రాష్ట్రాన్ని విభజించాలని కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోవడానికి చంద్రబాబునాయుడు... సోనియాగాంధీకి సహకరించారని కరుణాకర్ రెడ్డి అన్నారు.