ఇంద్రకీలాద్రి(విజయవాడ): ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం చంద్రబాబుకు ఆలయ ఈఓ నర్సింగరావు దగ్గరుండి స్వాగతం పలికారు. సీఎంతో పాటు దేవాదాయ శాఖా మంత్రి మాణిక్యాల రావు, భారీ నీటిపారుదుల శాఖామంత్రి దేవినేని ఉమ హాజరయ్యారు.