
రాజకీయ జిత్తులమారి చంద్రబాబు : జ్యోతుల
రాజానగరం : చెప్పింది చేయడం, చేసేది చెప్పడం ముఖ్యమంత్రి చంద్రబాబు నైజం కాదని, మనిషి బలహీనతలను తనకు అనుకూలంగా మలచుకోవడంలో ఆయనొక రాజకీయ జిత్తుల మారని శాసన సభలో వైఎస్సార్ సీపీ ఉపనేత జ్యోతుల నెహ్రూ విమర్శించారు. రుణ మాఫీ పథకం అమలు తీరును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీకి చెందిన భూపాలపట్నం సొసైటీ అధ్యక్షుడు పేపకాయల విష్ణుమూర్తి రాజానగరంలో చేపట్టిన 36 గంటల నిరాహార దీక్ష శిబిరాన్ని సోమవారం ఆయన సందర్శించి, మద్దతు పలికారు. ఈ సందర్భంగా జ్యోతుల మాట్లాడుతూ రుణమాఫీపై వంచనకు గురైన రైతుల పక్షాన ఆందోళన చేపట్టడం అభినందనీయమన్నారు. ఆందోళనను ఉధృతం చేద్దామన్నారు. రుణమాఫీని ఉద్యానవన పంటలకూ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కలెక్టర్‌ను కలిసి వివరించనున్నామన్నారు. శాగోదుంపను ఉద్యానవన పంట నుంచి తొలగించడం విడ్డూరంగా ఉందన్నారు. రుణ మాఫీ పథకం బేషరతుగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 31, ఫిబ్రవరి 1తేదీల్లో తణుకులో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టే నిరసన దీక్షను కూడా విజయవంతం చేద్దామని, భారీ ఎత్తున కదలిరండి అంటూ రైతాంగానికి జ్యోతుల పిలుపునిచ్చారు.
మాయల మరాఠీ చంద్రబాబు
నమ్మిన వారిని మోసం చేయడం, మాయ మాటలతో బురిడీ కొట్టించడం చంద్రబాబు నైజమని ప్రత్తిపాడు, కొత్తపేట ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. బాబును వారు మాయల మరాఠీగా అభివర్ణించారు. రాజానగరంలో దీక్షా శిబిరాన్ని సందర్శించి, సంఘీభావం తెలిపారు. రైతుల పక్షాన ఈ విధంగా పోరాటం చేయడాన్ని రాజానగరం నుంచి ప్రారంభించి, తమకు స్ఫూర్తిగా నిలిచారంటూ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మిని, 36 గంటల దీక్ష చేస్తున్న విష్ణుమూర్తిని అభినందించారు. శిబిరంలో రాజానగరం మండలానికి చెందిన మరో 20 మంది రైతులు కూడా మద్దతు దీక్షలు చేపట్టారు. కానవరం సొసైటీ అధ్యక్షుడు వాడ్రేవు శ్రీనివాసకుమార్ ప్రారంభించిన ఈదీక్షా శిబిరాన్ని ఆకుల వీర్రాజు వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మందారపు వీర్రాజు, సర్పంచులు గండి నానిబాబు, ఉండమట్ల రాజబాబు, కొవ్వాడ చంద్రరావు, ఉపసర్పంచ్ అక్కిరెడ్డి మహేష్, సొసైటీ మాజీ అధ్యక్షులు అడబాల చినబాబు, అనదాస సాయిరామ్, మాజీ సర్పంచ్‌లు కొల్లి నూకరాజు, వాసంశెట్టి పెద్దవెంకన్న, స్థానిక నాయకులు సందర్శించి, మద్దతు పలికారు.