కడప అగ్రికల్చర్ : ముఖ్యమంత్రి చంద్రబాబు చుట్టూ ఉన్న వారంతా ఆర్థిక నేరస్తులేనని, ఇలాంటి వారిని దగ్గర పెట్టుకుని ప్రత్యేకహోదా, ప్రత్యేక నిధులుంటూ దేశ, విదేశాల్లో తిరిగితే నిధులు వస్తాయా అని శాసనమండలిలో ప్రతిపక్షనేత సి. రామచంద్రయ్య ధ్వజమెత్తారు. శనివారం కడప నగరంలోని ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి సుజనాచౌదరి ఆర్థిక నేరస్తుడని, ఆయన మారిషస్ బ్యాంకుకు బకాయి ఎగ్గొట్టే ప్రయత్నం చేయగా ఆ బ్యాంకు నోటీసులు ఇచ్చిందని ఆరోపించారు. ప్రత్యేకహోదా ఎందుకు ఇవ్వలేదని ప్రధాని నరేంద్ర మోదీని అడిగే దమ్ము సీఎంకు లేదన్నారు. స్వదేశీ కంపెనీలకు రాజధాని నిర్మాణాన్ని అప్పగిస్తే కమీషన్ల వ్యవహారం, ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుందని సింగపూర్ కంపెనీకి అప్పగించారన్నారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌ను కేరళ రాష్ట్ర ఇంజనీరింగ్ నిపుణులు నిర్మించిన విషయం చంద్రబాబు మరచినట్లు ఉన్నారని చెప్పారు.
చంద్రబాబు చుట్టూ ఆర్థిక నేరస్తులే
Published Sun, Aug 2 2015 1:53 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement