‘ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు-లోకేశ్‌ దీక్ష’ | chandrababu, lokesh should fight for special status, says mudragada | Sakshi
Sakshi News home page

‘ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు-లోకేశ్‌ దీక్ష’

Published Mon, Jan 30 2017 11:40 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

‘ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు-లోకేశ్‌ దీక్ష’ - Sakshi

‘ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు-లోకేశ్‌ దీక్ష’

కాకినాడ: ఏపీకి  ప్రత్యేక హోదా కోసం లోకేశ్ తో కలిసి చంద్రబాబు దీక్ష చేపట్టాలని కాపు జేఏసీ నాయకుడు ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేశారు. చంద్రబాబు-లోకేశ్‌ దీక్షలో కొంచెం చోటు ఇస్తే తాను కూడా కూర్చుంటానని చెప్పారు. తమిళనాడు ప్రయోజనాల కోసం గతంలో జయలలిత ఏవిధంగా ఆమరణదీక్ష చేపట్టారో అదేవిధంగా చంద్రబాబు దీక్ష చేయాలన్నారు.

పోలవరం విభజన చట్టంలోని అంశమని, ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో తగువు పెట్టుకుంటే పోలవరం నిర్మాణం ఎందుకు ఆగిపోతుందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ లో ఉద్యమాలను అణచివేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారని ధ్వజమెత్తారు. కాపు రిజర్వేషన్లు సాధించేవరకు నిద్రపోమని పునరుద్ఘాటించారు. తుని ఘటనలో తన ప్రమేయం ఉంటే విచారణ సిద్ధమని ముద్రగడ ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement