ప్రముఖ రచయిత్రి గోవిందరాజు సీతాదేవి మృతి పట్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ : ప్రముఖ రచయిత్రి గోవిందరాజు సీతాదేవి మృతి పట్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ఆయన సంతాపం తెలిపారు. గోవిందరాజు సీతాదేవి నిన్న ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమెమె 300కు పైగా చిన్నకథలు, 21 నవలలు రాశారు. సుందర స్వప్నం, ఆలయం, పూలవాన, దేవుడు బ్రతికాడు తదితర నవలలు ప్రముఖమైనవి. సీతాదేవి ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణికి సొంత చెల్లెలు. ఆమెకు కుమారులు నలుగురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు