
శోభా నాగిరెడ్డి
కర్నూలు: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జ్ఞాపక శక్తి కోల్పోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. అప్పుడు విభజనన్న బాబు కొత్త రాజధానికి 4 లక్షల కోట్ల రూపాయలు అడిగారు, ఇప్పుడు యూటర్న తీసుకుని సమైక్యాంధ్ర అంటున్నారన్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనపై చంద్రబాబు కపట నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
పాలమూరు లిప్ట్ ఇరిగేషన్ సర్వేకు జీవో 72ను విడుదల చేశారు. ఈ జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిగులు జలాలపై ఆధారపడుతున్న రాయలసీమను ఆదుకోవాలని కోరారు. జీవో వెనక్కి తీసుకునేంతవరకు రాయలసీమ మంత్రులు ప్రతాపరెడ్డి, టిజి వెంకటేష్లను నిలదీయాలన్నారు. రాయలసీమకు నీళ్లు అందేంతవరకు వైఎస్ఆర్ సీపీ న్యాయపోరాటం చేస్తుందని హెచ్చరించారు.