25న ముస్సోరి వెళ్లనున్న చంద్రబాబు | chandrababu naidu mussoorie tour on 25th | Sakshi
Sakshi News home page

25న ముస్సోరి వెళ్లనున్న చంద్రబాబు

Published Thu, Sep 21 2017 11:09 AM | Last Updated on Fri, Sep 22 2017 10:02 AM

chandrababu naidu mussoorie tour on 25th

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 25వ తేదీన ముస్సోరి పర్యటనకు వెళ్లనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. అఖిల భారత సర్వీసుల శిక్షణా సంస్థ నుంచి చంద్రబాబుకు ఆహ్వానం అందినట్లు తెలిపారు. శిక్షణలో ఉన్న ఐఏఎస్‌లనుద్దేశించి చంద్రబాబునాయుడు ప్రసంగించనున్నట్లు చెప్పారు. ఏపీలో పాలనా సంస్కరణలపై ఐఏఎస్‌లతో మాట్లాడనున్నట్లు తెలిపారు. చంద్రబాబు ఇన్‌ సర్వీస్‌ ఐఏఎస్‌లు, శిక్షణలో ఉన్న ఐఏఎస్‌ల..జాయింట్‌ సెషన్‌లో పాల్గొననున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement