విపక్షం బలంగా ఉంది!
శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం చంద్రబాబు
-
అసెంబ్లీ వ్యూహంపై మంత్రులు, విప్‌లు, నేతలతో సీఎం చంద్రబాబు చర్చ
-
జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయాలని సూచన
-
18న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
-
20వతేదీన 11 గంటలకు సభకు బడ్జెట్
-
22న వ్యవసాయ బడ్జెట్
-
సెప్టెంబర్ 12 వరకూ సమావేశాలు జరిగే అవకాశం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం చంద్రబాబు గురువారం అందుబాటులో ఉన్న మంత్రులు, చీఫ్ విప్, విప్‌లు, పార్టీనేతలతో సమావేశమయ్యారు. మంత్రులు పి.పుల్లారావు, పీతల సుజాత, కామినేని శ్రీనివాస్, ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్, చీఫ్ విప్ కాలువ శ్రీనివాస్, విప్‌లు చింతమనేని ప్రభాకర్, కూన రవికుమార్, పి.యామినీబాల, పార్టీ ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్ ఇందులో పాల్గొన్నారు.
ప్రతిపక్షాలు ప్రస్తావించే అంశాలపై వెంటనే స్పందించే బాధ్యతను మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కింజారపు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, తోట త్రిమూర్తులకు అప్పగించారు. మంత్రులకు సమాచారం అందించే బాధ్యతను పయ్యావుల కేశవ్, వేం నరేందర్‌రెడ్డి, రావుల చంద్రశేఖరరెడ్డిలకు అప్పగించారు. విమర్శలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. శాసనసభలో బలమైన ప్రతిపక్షం ఉందని, వారి కదలికలు, వ్యూహాలపై ఎప్పటికపుడు సమాచారం సేకరించాలని ఆదేశించారు.
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని పదేపదే ఆరోపణలు చేయాలని, అలాగైతేనే విపక్షాన్ని కట్టడి చేయగలమని సూచించారు. జగన్‌తోపాటు వైఎస్సార్ సీపీలో క్రియాశీలకంగా ఉండే సుమారు 25 మంది ఎమ్మెల్యేలపై కూడా నిఘా వేసి పనితీరుపై సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలని ఉద్బోధించారు. వారిలో ఎవరైనా సభలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తే ముందుగా సేకరించిన వారి వ్యక్తిగత వివరాలను సభలో ప్రస్తావించాలని, అలా టార్గెట్ చేస్తేనే వారిని కట్టడి చేయగలమని పేర్కొన్నారు.
ఉపశమనం పేరుతో..
-
ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్ 12వ తేదీ వరకూ జరుగుతాయి.
-
20వతేదీ ఉదయం 11 గంటలకు ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు రూ.లక్ష కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
-
సుమారు రూ. 20 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్లు ప్రణాళిక వ్యయంగా, రూ.80 వేల కోట్ల నుంచి రూ.85 వేల కోట్లు ప్రణాళికేతర వ్యయంగా చూపించనున్నారు.
-
రైతులు, డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీకి కేటాయించే మొత్తాన్ని రుణ ఉపశమనం పేరుతో ప్రస్తావించనున్నారు.
-
21వ తేదీ అసెంబ్లీకి సెలవు. 22న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయరంగానికి రూ.15 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
-
అసెంబ్లీలో బడ్జెట్‌పై 23వతేదీ నుంచి 28వతేదీ వరకూ చర్చ జరుగుతుంది.
-
29న వినాయ చవితి సెలవు. 30, 31న శని, ఆదివారాలు కావటంతో అసెంబ్లీకి సెలవు ప్రక టించనున్నారు.
-
సెప్టెంబర్ 1వ తేదీన తిరిగి ప్రారంభమయ్యే సమావేశాలను 12వ తేదీ వరకు నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.