బాబు టూర్ ... స్కూళ్లకు సెలవు
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని కురబలకోటలో ఈ రోజు జరిగే జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో బాబు పాల్గొనున్నారు. అయితే ఆ కార్యక్రమానికి భారీగా ప్రజలను తరలించేందుకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు.
జిల్లాలోని చిత్తూరు, మదనపల్లె డివిజన్లలోని వివిధ స్కూళ్లకు చెందిన దాదాపు 400 బస్సులను ఉన్నతాధికారులు తీసుకున్నారు. బస్సులు లేకుంటే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని స్కూల్ యాజమాన్యం ఉన్నతాధికారులు తెలిపారు. దాంతో సదరు డివిజన్లలో పాఠశాలలకు విద్యాశాఖ సెలవు ప్రకటించారు.