హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 25 న సింగపూర్ వెళ్లనున్నారు. సింగపూర్ జాతిపిత, మాజీ ప్రధానమంత్రి లీక్వాన్‌యూకు నివాళులర్పించేందుకు ఆయన సింగపూర్ బయలదేరనున్నారు. ఈ పర్యటనలో ఆయనతోపాటు కమ్యూనికేషన్ అడ్వయిజర్ పరకాల ప్రభాకర్, ప్రిన్సిపల్ సెక్రటరీ సతీష్ చంద్ర వెళ్లనున్నారు. తిరిగి మార్చి 26న చంద్రబాబు బృందం రాష్ట్రానికి చేరుకుంటుంది.
కాగా కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్న లీ క్వాన్ సోమవారం మృతిచెందారు. క్వాన్ భౌతికకాయాన్ని ఈ నెల 28 వరకు పార్లమెంటు హౌజ్‌లో ఉంచనున్నారు. 29న అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
ఈ నెల 25న బాబు సింగపూర్ పర్యటన
Published Tue, Mar 24 2015 2:14 PM | Last Updated on Wed, May 29 2019 3:21 PM
Advertisement
Advertisement