
టీఆర్ఎస్ దొంగాట ఆడింది: చంద్రబాబు
అనంతపురం: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎన్నికల సంఘాన్ని కలుస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దొంగాట ఆడిందని ఆరోపించారు.తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి గెలిచిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రహస్య ఓటింగ్ విధానం మార్చాలన్నారు. దామాషా పద్ధతిలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ కావాలనే ఇబ్బందులు సృష్టిస్తోందన్నారు.
తనను విమర్శించే అర్హత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. వైఎస్ జగన్ ఎందుకు దీక్ష చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని గొట్లూరు గ్రామంలో 'జన్మభూమి-మాఊరు' కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.