వాళ్లిద్దరూ అవిభక్త కవలలు: భూమన | chandrababu, venkaiah naidu conjoined twins, says bhumana karunakar reddy | Sakshi
Sakshi News home page

వాళ్లిద్దరూ అవిభక్త కవలలు: భూమన

Published Wed, Sep 28 2016 3:13 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

వాళ్లిద్దరూ అవిభక్త కవలలు: భూమన - Sakshi

వాళ్లిద్దరూ అవిభక్త కవలలు: భూమన

హైదరాబాద్ : ప్రత్యేక హోదాను పక్కనపెట్టిన చంద్రబాబు, వెంకయ్యనాయుడు తెలుగు జాతి ద్రోహులుగా మిగిలిపోతారని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. హోదా కోసం ఏపీ ప్రజలంతా పోరాడుతుంటే చంద్రబాబు, వెంకయ్య శరీరాలు వేరు అయినా...ఆలోచన ఒకటేనని, అవిభక్త కవలలుగా ప్రత్యేక హోదా అవసరం లేదంటున్నారని భూమన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వెంకయ్య నాయుడు చవకబారు మాటలు మాట్లాడుతున్నారన్నారు. టీడీపీ ప్రతినిధిగా కాకుండా వెంకయ్య తన స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించాలని సూచించారు. ఆయన టీడీపీ అధికార ప్రతినిధిగా బీజేపీలో కొనసాగుతున్నారని ప్రజలు అనుకుంటున్నారని భూమన అన్నారు. ప్రత్యేక హోదా కోసం తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement