చెత్త గుట్టలకు చెక్ | Check mounds of garbage | Sakshi
Sakshi News home page

చెత్త గుట్టలకు చెక్

Published Wed, Dec 3 2014 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM

చెత్త గుట్టలకు చెక్

చెత్త గుట్టలకు చెక్

► బిన్ మానిటరింగ్‌తో సత్ఫలితాలు
► జియో గ్రాఫికల్ సిస్టం ద్వారా పర్యవేక్షణ
► ప్రయోగాత్మకంగా గుడివాడలో అమలు
► రాష్ట్రంలోనే ప్రథమస్థానం

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చెత్త సమస్యకు చెక్‌పెట్టే ‘బిన్ మానిటరింగ్ ప్రోగ్రాం’ విజయవంతమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా  31 మున్సిపాల్టీల్లో  ఈ విధానాన్ని అమలు చేస్తుండగా...   గుడివాడ మున్సిపాల్టీ రాష్ట్రంలోనే ్రప్రథమ స్థానాన్ని దక్కించుకుని పలువురి
 ప్రశంసలు పొందుతోంది.
 
గుడివాడ : రాష్ర్టంలోని మున్సిపాల్టీల్లో అపరిశుభ్రతను పారదోలేందుకు ప్రభుత్వం బిన్ మానిటరింగ్  విధానాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాల్టీలుండగా 31 మున్సిపాల్టీలను బిన్ మానిటరింగ్ విధానంలో చెత్త తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో  ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేసేందుకు గుడివాడ మున్సిపాల్టీని ఎంపిక చేశారు.  20 రోజులుగా గుడివాడ మున్సిపాల్టీలో బిన్ మానిటరింగ్ ప్రోగ్రాం  అమలు విజయవంతంగా సాగుతూ రాష్ట్రం లోనే ప్రథమస్థానంలో నిలుస్తోంది. ఈ విధానం ద్వారా ప్రతి రోజు ఉదయాన్నే పట్టణంలో ఉన్న డంపర్ బాక్సుల్లో ఉండే చెత్తను మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది తొలగించింది లేనిదీ అతి సులువుగా తెలుసుకునే అవకాశం ఉంది.  పట్టణంలో ఉన్న డస్ట్‌బిన్స్, చెత్తకుప్పలు వేసే ప్రాంతాలను జియో మ్యాపింగ్ విధానం ద్వారా గుర్తిస్తారు. ఈప్రాంతాల్లో ఎప్పటికప్పుడు క్లీన్‌చేసి ఫొటోలు తీసి అప్‌లోడ్ చేస్తే ఆప్రాంతంలో చెత్త తొలగించిందీ లేనిదీ వెంటనే తెలిసి పోతుంది.

పట్టణం అంతా తిరగాల్సిన పనిలేదు...

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి జియో విధానం ద్వారా బిన్ మానిటరింగ్ విధానాన్ని అమలు చేస్తారు. గుడివాడ పట్టణంలో 28 ప్రాంతాల్లో బిన్ మానిటరింగ్ అమలు చేస్తున్నారు. 28 డస్ట్‌బిన్స్ ఉండే ప్రాంతాలు జియో మ్యాపింగ్‌లో కనిపిస్తాయి. ప్రతి రోజు ఉదయాన్నే ఆయా డస్ట్‌బిన్స్ క్లీన్ చేసి ఖాళీ డ స్ట్‌బిన్ ఏర్పాటుచేసి మున్సిపాల్టీలో ఉండే శానిటరీ ఇన్‌స్పెక్టర్లు వారి వద్ద ఉండే ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఫొటోలు తీస్తారు. ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉండే బిన్ మానిటరింగ్ యాప్ ద్వారా ఫొటోను అప్‌లోడ్ చేస్తారు. జియో మ్యాపింగ్ విధానం ద్వారా ఆ ప్రాంతంలో తీసిన ఫొటోను మాత్రమే శాటిలైట్ తీసుకుంటుంది. బిన్ ఖాళీ చేయగానే వెంటనే జియో మ్యాపింగ్‌లో ఆ ప్రాంతంలో ఖాళీగా ఉంచిన డస్ట్‌బిన్ ఫొటో కనిపిస్తుంది. ఆ డస్ట్‌బిన్ ప్రాంతం పచ్చరంగులోకి మారుతుంది. ఆ డస్ట్‌బిన్ నుంచి ఎన్ని గంటలకు చెత్త తీసింది, ఖాళీ డస్ట్‌బిన్ ఎన్ని గంటలకు పెట్టిందనే విషయాలు అక్కడ ప్రత్యక్షమవుతాయి.

గతంలో ఎక్కడ చెత్త తొలగించారు. ఎక్కడ తొలగించ లేదోమున్సిపల్ కమిషనర్ లేదా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, చైర్మన్  తిరిగితేనే తెలిసేది. లేదా ఆప్రాంతం ప్రజలు ఫిర్యాదులు చేస్తేనే తెలిసేది. కానీ ఈ విధానం వచ్చాక నేరుగా కార్యాలయంలో ఉండి ఇంటర్నెట్‌లో సీడీఎంఏ వెబ్‌సైట్‌లోకి వెళితే రాష్ట్రంలో బిన్ మానిటరింగ్ అమలవుతున్న అన్ని మున్సిపాల్టీల్లో చెత్త తీసిందీ లేనిదీ ఫొటోతోసహా ప్రత్యక్షం అవుతుంది. ఫొటో అక్కడ తీస్తేనే అప్‌లోడ్ అవుతుంది తప్ప... పరిశుభ్రంగా ఉంచిన ప్రాంతంలో తీసిన ఫొటో  అప్‌లోడ్ కాదు.
 

Advertisement
Advertisement