చిన్నారిని కబళించిన మృత్యువు | child expired | Sakshi
Sakshi News home page

చిన్నారిని కబళించిన మృత్యువు

Published Sat, Feb 14 2015 3:42 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

child expired

 అనుమసముద్రంలో విషాదం
 అనుమసముద్రంపేట : ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడాదిన్నర చిన్నారిని క్షణాల్లో మృత్యువు కబళించింది. ఈ సంఘటన మండలంలోని అనుమసముద్రం మిట్టమీద తూర్పువీధిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు.. ఏఎస్‌పేటకు చెందిన మహేష్, లక్ష్మి దంపతులు రెండేళ్లుగా అనుమసముద్రంలో బాడుగ ఇంటిలో ఉంటున్నారు. వీరికి ఏడాదిన్నర వయసు కలిగిన కౌషిని దుహిజ అనే కుమార్తె ఉంది. శుక్రవారం ఉదయాన్నే నిద్రలేచిన కౌషిని ఇంటి ముందు ఆడుకుంటుంది. అదే వీధిలో వారింటికి ఎదురుగా ఉన్న ఇంటిలో ఖాజాపీర్ అనే ఆటోడ్రైవర్ ఉంటున్నాడు. ఉదయాన్నే తన టాటా మ్యాజిక్ ఆటోను ఏఎస్‌పేటకు తీసుకెళ్లేందుకు ఖాజాపీర్ బయలుదేరాడు. అయితే చిన్నారి ఆటో వద్ద ఉండడాన్ని ఖాజాపీర్ గమనించలేదు.
 
 స్టార్ట్ చేసి ముందుకెళ్లాడు. టాటా మ్యాజిక్ వాహనం కింద ఉన్న చిన్నారి కౌషిని తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అదే వాహనంలో  పాపను ఏఎస్‌పేటలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి ఆత్మకూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. అనుమసముద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న ఏఎస్‌పేట ఎస్సైలు అంకమ్మ, రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం చిన్నారిని ఆత్మకూరుకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement