చిత్తూరు (అర్బన్): చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూపై నమోదైన మారణాయుధాల కేసు, మోసం చేసిన కేసుల విచారణను ఈనెల 18కి వాయిదా వేస్తూ స్థానిక నాలుగో అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
చింటూ నివాసంలో మారణాయుధాలు ఉన్నాయని, మహిళల్ని మోసం చేసి బంగారు ఆభరణాలు కాజేసిన ఓ కేసులో మహిళల్ని బెదిరించాడని చిత్తూరు టూటౌన్ పోలీసులు చింటూపై గతంలో కేసులు నమోదు చేశారు. కేసుల విచారణలో భాగంగా చింటూను బుధవారం కడప జైలు నుంచి చిత్తూరు కోర్టు ఎదుట హాజరు పరచారు. తదుపరి విచారణ వాయిదా వేస్తూ న్యాయమూర్తి యుగంధర్ ఆదేశాలు జారీ చేశారు.
చింటూపై కేసు 18కి వాయిదా
Published Thu, Mar 10 2016 1:03 AM | Last Updated on Mon, Aug 13 2018 3:10 PM
Advertisement