
మాట్లాడుతున్న డీఈఓ పాండురంగస్వామి
చిత్తూరు కలెక్టరేట్: రాష్ట్రంలో పలుచోట్ల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండడంతో ఈ నెల 22న జరగాల్సిన పదో తరగతి ఇంగ్లిష్ పేపర్–1 వాయిదా వేశారని డీఈఓ పాండురంగస్వామి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇంగ్లిషు పేపర్–1 వాయిదా పడినందున విద్యార్థులు 23న జరిగే ఇంగ్లిషు పేపర్–2 కు సిద్ధం కావాలని సూచించారు. వాయిదా పడ్డ పేపర్ –1 పరీక్ష ఏప్రిల్ 3న జరుగుతుందని వివరించారు.
విధుల నుంచి ఇద్దరు టీచర్ల తొలగింపు..
పరీక్షల విధుల్లో నిర్లక్ష్యం వహిం చి నందుకు ఇద్దరు ఉపాధ్యాయులను తొలగించినట్లు డీఈఓ పాండురంగస్వామి తెలిపారు. ఏర్పేడు జెడ్పీ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో ఒకరు, పిచ్చాటూరు జెడ్పీ హైస్కూల్‌లో ఒకరిని తొలగించినట్లు వెల్లడించారు. ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి బుధవారం నిమ్మనపల్లె మండలంలో 2, బి.కొత్తకోట మండలంలో 3 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారని చెప్పారు. హిందీ పరీక్షకు 52,769 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 52,562 మంది హాజరయ్యారన్నారు. 207 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment