కలెక్టర్‌ ఉపాధ్యాయుడైన వేళ | Chittoor Collector Taught Lessons At School | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ ఉపాధ్యాయుడైన వేళ

Published Thu, Sep 5 2019 9:02 AM | Last Updated on Thu, Sep 5 2019 9:02 AM

Chittoor Collector Taught Lessons At School - Sakshi

ఎస్‌ఆర్‌పురం జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న కలెక్టర్‌ భరత్‌ గుప్త

సాక్షి, చిత్తూరు: కలెక్టర్‌ నారాయణ భరత్‌గుప్త ఉపాధ్యాయుడి అవతారమెత్తారు. మండల పర్యటనలో భాగంగా ఆయన స్థానిక జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించారు. 10వ తరగతి విద్యార్థులతో పలు విషయాలపై ముచ్చటించారు. జువాలజీ సబ్జెక్టుపై పాఠాలు బోధించారు. అనంతరం మండల కేంద్రంలో చేపట్టిన జలశక్తి అభియాన్‌ పనులను పరిశీలించారు. నీరు వచ్చే దారులను గుర్తించి పనులు చేపట్టాలని ఆదేశించారు.

కబ్జాకు గురైన పేదల, ప్రభుత్వ భూములను రీసర్వే ద్వారా గుర్తించాలని అధికారులకు సూచించారు. మండలంలోని 56 కనికాపురం లెక్క దాఖలా సర్వే నంబర్‌ 136లో 70 ఎకరాలు, నెలవాయి లెక్క దాఖలాలో సర్వే నంబర్‌ 135లో 10 ఎకరాలకు పైగా డీకేటీ భూములను పేదలకు ఇచ్చారని, వీటిని రీ సర్వే చేసి ఆక్రమణలు ఉంటే తొలగించాలని ఆదేశించారు. 56కనికాపురంలో భూములు కోల్పోయిన రైతుల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ఇది చదవండి : గాంధీ పేరు రాయలేకపోతున్నారు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement