► హవాలా కుంభకోణం దర్యాప్తుకు ప్రత్యేక బృందాలు
► కీలకపత్రాలు అందజేసిన ఈడీ ఆధికారులు
అల్లిపురం (విశాఖ దక్షిణ): కోట్ల రూపాయల హవాలా కుంభకోణంలో డొల్ల కంపెనీలపై ఏపీ సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని విశాఖలో తప్పుడు చిరునామాల్లో ఏర్పాటు చేసిన కంపెనీలపై విచారణ చేపట్టారు. అదే విధంగా కోల్‌కతాలో కంపెనీల అడ్రస్‌లపైనా ఆరా తీసేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. నిందితుడు వడ్డి మహేష్ ఆర్థిక లావాదేవాలపై దర్యాప్తు చేసేందుకు నలుగురు సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. చైనా, సింగపూర్, హాంకాంగ్‌లలో కేసుకు సంబంధించిన ఐటీ కంపెనీలపైన కూడా వీరు ఆరా తీయనున్నారు. సీఐడీ ఐజీ అమిత్‌గార్గ్ మంగళవారం ఉదయం నుంచి అధికారులతో వరుసగా సమీక్షించారు.
ఇప్పటికే ఆదాయ పన్నుశాఖ అధికారులు ఆధారాలు అందజేసిన ట్లు సమాచారం. ఎన్‌ఫోర్సుమెంట్ అధికారు లు కీలకమైన పత్రాలను సీఐడీ అధికారులకు అందజేశారు. విశాఖ పోలీసులు తమ దర్యాప్తు వివరాలను ఇచ్చారు. కేసు విచారణను సీఐడీ అదనపు ఎస్పీ నాగేశ్వరరావుకు అప్పగించారు. ఈ కేసు గురించి అధికారులను అడిగినా ఎవరూ మాట్లాడటంలేదు. నిందితులు వడ్డి మహేష్ తండ్రి శ్రీనివాసరావు, ఆచంట హరీష్, రాజేష్‌లను నగర పోలీసులు విచారణ నిమిత్తం సీఐడీ అధికారులకు అప్పగించినట్లు తెలిసింది. కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్‌లతోపాటు కేసులో కీలకం గా వ్యవహరించిన దిల్లీకి చెందిన మరో ముగ్గు రు నిందితుల వివరాలను ఆరా తీస్తున్నారు. విశాఖలోనే అధికంగా బ్యాంకు లావాదేవీలు జరగడంతో వాటిని పరిశీలిస్తున్నారు.
డొల్ల కంపెనీలపై సీఐడీ ఆరా
Published Wed, May 17 2017 2:38 AM | Last Updated on Tue, Sep 5 2017 11:18 AM
Advertisement