vaddi mahesh
-
సోషల్ మీడియాకు సెన్సార్ ఉండాల్సిందే..!
-
సోషల్ మీడియాకు సెన్సార్ ఉండాల్సిందే
కాకినాడ: సోషల్ మీడియాకు సెన్సార్ ఉండాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ మహిళలను కించపరిచేలా పోస్టులు పెడితే కచ్చితంగా చర్యలుంటాయని స్పష్టం చేశారు. వడ్డీ మహేశ్ హవాలా కేసును సీఐడీకి అప్పగించినట్లు చినరాజప్ప తెలిపారు. మహేశ్ వెనుక ఎవరున్ననేది విచారణలో తేలుతుందని ఆయన పేర్కొన్నారు. -
డొల్ల కంపెనీలపై సీఐడీ ఆరా
► హవాలా కుంభకోణం దర్యాప్తుకు ప్రత్యేక బృందాలు ► కీలకపత్రాలు అందజేసిన ఈడీ ఆధికారులు అల్లిపురం (విశాఖ దక్షిణ): కోట్ల రూపాయల హవాలా కుంభకోణంలో డొల్ల కంపెనీలపై ఏపీ సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని విశాఖలో తప్పుడు చిరునామాల్లో ఏర్పాటు చేసిన కంపెనీలపై విచారణ చేపట్టారు. అదే విధంగా కోల్‌కతాలో కంపెనీల అడ్రస్లపైనా ఆరా తీసేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. నిందితుడు వడ్డి మహేష్ ఆర్థిక లావాదేవాలపై దర్యాప్తు చేసేందుకు నలుగురు సభ్యులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. చైనా, సింగపూర్, హాంకాంగ్‌లలో కేసుకు సంబంధించిన ఐటీ కంపెనీలపైన కూడా వీరు ఆరా తీయనున్నారు. సీఐడీ ఐజీ అమిత్‌గార్గ్ మంగళవారం ఉదయం నుంచి అధికారులతో వరుసగా సమీక్షించారు. ఇప్పటికే ఆదాయ పన్నుశాఖ అధికారులు ఆధారాలు అందజేసిన ట్లు సమాచారం. ఎన్ఫోర్సుమెంట్ అధికారు లు కీలకమైన పత్రాలను సీఐడీ అధికారులకు అందజేశారు. విశాఖ పోలీసులు తమ దర్యాప్తు వివరాలను ఇచ్చారు. కేసు విచారణను సీఐడీ అదనపు ఎస్పీ నాగేశ్వరరావుకు అప్పగించారు. ఈ కేసు గురించి అధికారులను అడిగినా ఎవరూ మాట్లాడటంలేదు. నిందితులు వడ్డి మహేష్ తండ్రి శ్రీనివాసరావు, ఆచంట హరీష్, రాజేష్‌లను నగర పోలీసులు విచారణ నిమిత్తం సీఐడీ అధికారులకు అప్పగించినట్లు తెలిసింది. కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్లతోపాటు కేసులో కీలకం గా వ్యవహరించిన దిల్లీకి చెందిన మరో ముగ్గు రు నిందితుల వివరాలను ఆరా తీస్తున్నారు. విశాఖలోనే అధికంగా బ్యాంకు లావాదేవీలు జరగడంతో వాటిని పరిశీలిస్తున్నారు. -
ఏపీ చరిత్రలో అతి పెద్ద కుంభకోణం!
-
రూ. వేల కోట్ల హవాలా!
► విశాఖ హవాలా కుంభకోణంపై సీఐడీ అంచనాలు ► ఇందులో బడాబాబులు, బ్యాంకర్ల పాత్ర సాక్షి, విశాఖపట్నం: ఇప్పటిదాకా వందల కోట్లకే పరిమితమైందనుకుంటున్న విశాఖలో వెలుగు చూసిన హవాలా కుంభకోణం విలువ రూ.వేల కోట్లు ఉంటుం దని ఏపీ సీఐడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో పట్టుబడ్డ ప్రధాన నిందితుడు వడ్డి మహేష్ కింది స్థాయిలో వ్యవహారం నడిపాడని, ఆయనకన్నా పై స్థాయిలో ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు, బ్యాంకర్ల పాత్ర ఉండవచ్చని భావిస్తున్నారు. సీఐడీ ఐజీ అమిత్‌గార్గ్ పర్యవేక్షణలో కేసు విచారణ ప్రక్రియ మొదలయింది. ప్రధాన నిందితుడు వడ్డి మహేష్‌ను సోమవారం ఉదయం కోర్టుకు తరలించగా రిమాండ్ విధించారు. మహేష్‌ను కస్టడీకి తీసుకొని విచారించాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. ఏపీ చరిత్రలో అతి పెద్ద కుంభకోణం! మహేష్ తండ్రి శ్రీనివాసరావే కొడుకును ఇందులో సూత్రధారులకు పరిచయం చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. ఆయనను అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబడుతున్నారు. మరోవైపు గోయల్, గోయంకా, గుప్తా అనే హవాలా వ్యాపారులను అదుపులోకి తీసుకునే పనిలో ఉన్నారు. ఈ కేసును ఛేదించేందుకు సీఐడీ అధికారులు సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల సాయాన్ని తీసుకోనున్నారు. నకిలీ కంపెనీల రిజిస్ట్రేషన్ ప్రక్రియపైనా సీఐడీ దృష్టి సారించనుంది. ఈ కంపెనీల సంబంధిత డైరెక్టర్లను అదుపులోకి తీసుకుంటే మరిన్ని విషయాలు బయటపడతాయని సీఐడీ భావిస్తోంది. మరోవైపు ఈ కుంభకోణంలో పెద్దల పాత్ర ఉందన్న వీరు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటిదాకా రూ.1,369 కోట్ల హవాలా కుంభకోణం జరిగినట్టు ప్రాథమికంగా తేల్చినా మున్ముందు ఇది వేల కోట్లకు చేరుకుంటుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా నిలిచిపోవచ్చని అంటున్నారు. 12 కంపెనీలు.. 30 ఖాతాలు హవాలా కుంభకోణంలో 12 బోగస్ కంపెనీలను సృష్టించారని, 30 బ్యాంకు ఖాతాలను తెరిచారని, నకిలీ పాన్‌కార్డులు, డాక్యుమెంట్లను రూపొందించి మోసానికి పాల్పడ్డారని విశాఖ పోలీస్ కమిషనర్ యోగానంద్ చెప్పారు. ఆయన సోమవారం కమిషనరేట్‌లో విలేకరులకు కేసు వివరాలను వెల్లడించారు. నిందితుడు మహేష్ ఆయా కంపెనీల ఉద్యోగులతో వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించి హవాలా సొమ్ముతో రూ.680.94 కోట్ల లావాదేవీలు నిర్వహించారని తెలిపారు. ఈ కంపెనీలు రూ.569.93 కోట్ల మేర విదేశీ మారకద్రవ్యాన్ని భారత్‌కు నష్టం కలిగించాయని చెప్పారు. అంతేగాక.. కోల్‌కతా బ్యాంకుల్లో మరో రూ.800 కోట్ల సొమ్మును జమ చేసినట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులు చెప్పారన్నారు. 2014 నుంచి మొదలైన ఈ వ్యవహారం పెద్దనోట్ల రద్దు వరకు వేగంగా సాగిందన్నారు. సమావేశంలో డీసీపీ నవీన్ గులాటీ, స్పెషల్ బ్రాంచి ఏడీసీపీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
1000 కోట్ల హవాలా రాకెట్.. మరో ఇద్దరి అరెస్ట్
విశాఖ: హవాలా కుంభకోణం కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.1000 కోట్లకు పైగా హవాలా రాకెట్ నడిపిటన్లు పోలీసులు గుర్తించారు. అరెస్టయిన వ్యక్తులు అన్నదమ్ములు ఆచంట రాజేశ్, హరీశ్ అని పెరవలికి చెందిన వారని పోలీసులు వెల్లడించారు. మరోవైపు హవాలా కుంభకోణంలో ప్రధాన నిందితుడు వడ్డి మహేశ్‌ను అదుపులోకి తీసుకున్న విశాఖ పోలీసులు, ఐటీ అధికారులు కలిసి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కీలక పత్రాలు, ఆధారాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ నకిలీ ధ్రువపత్రాలతో 30 బ్యాంకులకు కచ్చుటోపీ పెట్టినట్లు సమాచారం. హైదరాబాద్, శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల్లో 12 డొల్ల కంపెనీలు పెట్టి వాటి ద్వారా మహేశ్ ఈ హవాలా కుంభకోణం నడిపించాడు. కోల్‌కతా కేంద్రంగా సాగిన భారీ హవాలా కుంభకోణం బ్యాంకు లావాదేవీలు విశాఖ నుంచే ఎక్కువగా జరిగాయని విశాఖ శాంతి భద్రతల డీసీపీ నవీన్ గులాటి ఇదివరకే తెలిపారు. విశాఖ కేంద్రంగా హవాలా మార్గంలో కోట్లాది రూపాయలు విదేశాలకు తరలిపోయిన కేసులో 12 డొల్ల కంపెనీలున్నట్లు గుర్తించారు. బ్యాంకు అధికారుల పాత్రపై 3 ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నట్లు చెప్పిన పోలీసులు నేడు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కేసు తీవ్రత దృష్ట్యా సీబీఐకి బదిలీ చేసే అవకాశాలా కనిపిస్తున్నాయి. మహేశ్ తండ్రి శ్రీనివాసరావు అక్రమ వ్యాపారాలకు ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడితో సంబంధాల కోణంలోనూ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. -
మంత్రి అచ్చెన్నఇలాకాలో ‘హవాలా’మహేశ్!
-
మంత్రి అచ్చెన్న ఇలాకాలో.. ‘హవాలా’మహేశ్!
సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: హవాలా కుంభకోణంలో ప్రధాన నిందితుడు వడ్డి మహేశ్, అతని తండ్రి శ్రీనివాసరావు అక్రమ వ్యాపారాలకు ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి ఇలాకాతోనూ సంబంధాలున్నాయని తెలిసింది. వీరు శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళి మండలం కురుడు పరిధి రామయ్యపేటలో అక్రమంగా స్టోన్ క్రషర్ ఏర్పాటుకు ఏర్పాట్లు చేసుకున్నారు. శ్రీ పద్మప్రియ స్టోన్క్రషరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. దీనికి కార్యాలయంగా శ్రీకా కుళంలోని ఎల్బీఎస్ నగర్ కాలనీలోని ఓ అద్దె ఇల్లు చిరునామాగా ఉంది. విశాఖ నుంచి 4 రోజుల క్రితం ఆదాయపన్ను శాఖ అధికారులు వచ్చి ఈ ఇంట్లోనే తనిఖీ చేశారు. ఇక్కడి నుంచే వడ్డి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ తండ్రీకొడుకులకు అధికారపార్టీ నేతlసోదరుడు అండగా ఉన్నారనే ఆరోపణలున్నాయి. వారి సాయంతో రెండేళ్ల క్రితం రామయ్యపేట వద్ద కొండపోరంబోకు స్థలం (సర్వే నంబరు 514)ను ఆక్రమించారు. ఇటీవల ఖరీదైన బెంజ్ కారు కొనడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు మహేశ్‌పై దృష్టిపెట్టారు. డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరి శీలించి మహేశ్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకొని విశాఖపట్నం తీసుకువెళ్లినట్లు తెలిసింది. -
మహేశ్‌దే కీలక పాత్ర: నవీన్ గులాటి
విశాఖ : రూ.1000 కోట్లకు పైగా హవాలా రూపంలో విదేశాలకు తరలించిన కేసులో విచారణ కొనసాగుతోందని డీసీపీ నవీన్ గులాటి తెలిపారు. ఈ కేసు వివరాలను డీసీపీ నవీన్ గులాటి శనివారం మీడియాకు వివరించారు. ఈ హవాలా వ్యవహారంలో వడ్డి మహేశ్‌దే కీలక పాత్ర అని ఆయన తెలిపారు. ఐటీ అధికారుల సాయంతో విచారణ చేస్తున్నామని, సుమారు 30 బ్యాంకుల్లో అకౌంట్లు తెరిచినట్లు చెప్పారు. విశాఖ, శ్రీకాకుళం, కోల్‌కతాలో బోగస్ కంపెనీలు ఏర్పాటు చేసి హాంకాంగ్, చైనా, సింగపూర్‌లకు డబ్బు తరలించినట్లు వెల్లడించారు. కాగా ఆదాయపన్ను శాఖ ఫిర్యాదుతో వెలుగు చూసిన ఈ వ్యవహారం ప్రస్తుతం ఉత్తరాంధ్రలో సంచలనం రేపుతోంది. శ్రీకాకుళం నుంచి కోల్‌కతాకు వెళ్లి అక్కడ స్థిరపడిన వడ్డి మహేశ్, అతని తండ్రి వడ్డి శ్రీనివాసరావు, ఆచంట హరీష్, చింతా రాజేష్, ప్రశాంత్‌కుమార్‌రాయ్ బర్మన్, ప్రవీణ్‌కుమార్ ఝా, ఆయిష్ గోయల్, వినీత్ గోయంకా, విక్రాంత్ గుప్తాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, కోల్‌కతాల్లో 12 బోగస్ కంపెనీలు, భాగస్వామ్య కంపెనీలు ప్రారంభించి, వాటి ద్వారా డబ్బును హవాలా మార్గంలో విదేశాలకు తరలించిన విషయం తెలిసిందే.