ఇప్పటిదాకా వందల కోట్లకే పరిమితమైందనుకుంటున్న విశాఖలో వెలుగు చూసిన హవాలా కుంభకోణం విలువ రూ.వేల కోట్లు ఉంటుం దని ఏపీ సీఐడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో పట్టుబడ్డ ప్రధాన నిందితుడు వడ్డి మహేష్ కింది స్థాయిలో వ్యవహారం నడిపాడని, ఆయనకన్నా పై స్థాయిలో ప్రముఖులు, బడా వ్యాపారవేత్తలు, బ్యాంకర్ల పాత్ర ఉండవచ్చని భావిస్తున్నారు.