
బాధిత యువతితో సీఐటీయూ, సీపీఐ, ఐద్వా నాయకులు
బొబ్బిలి: ప్రేమ పేరిట యువకుడి చేతిలో మోసపోయిన యువతికి న్యాయం చేయాలని సీఐటీయూ, సీపీఐ, ఐద్వా నాయకులు పొట్నూరు శంకరరావు, ఒమ్మి రమణ, కె.పుణ్యవతి డిమాండ్ చేశారు. గొల్లపల్లికి చెందిన ఒకే సామాజిక వర్గానికి చెందిన యువతి, యువకుడు ప్రేమించుకున్నారని, యువతి ఆ యువకుడి చేతిలో మోసపోయిందని ప్రస్తుతం ఆమె 4నెలల గర్భవతి అని వారు పేర్కొన్నారు. ఆదివారం సదరు యువతి యువకుడి ఇంటి వద్ద ఆందోళన చేయడానికి వెళ్లగా పెద్దలు అడ్డుకున్నారు. సుమారు 2 గంటలకు పైగా వాగ్వాదం జరిగింది. తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, తనకు న్యాయం చేయాలని బాధిత యువతి కోరగా, యువకుడి బంధువులు మాట్లాడుతూ ఏదైనా సమస్య ఉంటే పెద్దలు కూర్చుని సామరస్యంగా చర్చించాలని, ప్రజా సంఘాల పేరిట ఇలా ఆందోళనలు చేస్తే ఎలా అని పలువురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment