దోచుకోవడం, దాచుకోవడమే ‘బాబు’ ప్రణాళిక | cm chandrababu naidu government to support in corruption | Sakshi
Sakshi News home page

దోచుకోవడం, దాచుకోవడమే ‘బాబు’ ప్రణాళిక

Published Tue, Apr 5 2016 3:11 AM | Last Updated on Tue, May 29 2018 11:50 AM

దోచుకోవడం, దాచుకోవడమే ‘బాబు’ ప్రణాళిక - Sakshi

దోచుకోవడం, దాచుకోవడమే ‘బాబు’ ప్రణాళిక

 అనంతపురం అర్బన్: రాష్ట్రాన్ని దోచుకుంటూ, దాచుకునేందుకే సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళిక రూపొందించుకుని పాలన సాగిస్తున్నారని పీసీసీ ఉపాధ్యక్షుడు సాకే శైలజానాథ్ ధ్వజమెత్తారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట యువజన కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షుడు శివశంకర్ అధ్యక్షతన చేపట్టిన ఒక్కరోజు నిరాహార దీక్ష శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు విస్మరించి ప్రజలు మోసం చేశారని మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను లాక్కోవడం, ఇసుక ద్వారా రూ. కోట్లు దోచుకోవడం తప్ప ఈ రెండేళ్లలో సీఎం చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఇంటింటి కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు శైలజానాథ్ సూచించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు దాదాగాంధీ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, ఎన్ ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు లోకేశ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement