
కర్నూలు(సెంట్రల్) : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఈ నెల 17వ తేదీకి బదులు 18న ఆయన జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ జి.వీరపాండియన్ ‘సాక్షి’కి తెలిపారు. ముందుగా ఈ నెల 17న సీఎం కర్నూలు పర్యటన ఖరారైంది. అయితే ఆ రోజు సోమవారం కావడంతో ‘స్పందన’ కార్యక్రమానికి ఆటంకం కలుగుతుందని, 18వ తేదీన ఖరారు చేసుకోవాలని వీడియో కాన్ఫరెన్స్‌లో స్వయంగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జిల్లా అధికారులకు సూచించారు. దీంతో జిల్లా అధికారులు 18వ తేదీన సీఎం జిల్లా పర్యటనను ఖరారు చేశారు. ఆ రోజు కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. అలాగే డాక్టర్ వైఎస్‌ఆర్ కంటి వెలుగు మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఏఎన్‌ఎం సబ్ సెంటర్ల నిర్మాణానికి భూమి చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment