సాక్షి, అమరావతి: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూలమాల వేసి నివాళర్పించారు. తెలుగు ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆయన త్యాగం మనందరికి స్ఫూర్తి అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో...
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి మంత్రి అనిల్‌కుమార్, వైఎస్సార్‌సీపీ నేతలు పూలమాలలు వేసి నివాళర్పించారు. పొట్టి శ్రీరాములు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన ప్రాణత్యాగం ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం అవతరించిందని గుర్తు చేసుకున్నారు.
కృష్ణాజిల్లా: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు జగ్గయ్యపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పూలమాలలు వేసి నివాళర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు తన్నీరు నాగేశ్వరరావు, చౌడవరపు జగదీష్, తుమ్మల ప్రభాకర్, తుమ్మేపల్లి నరేంద్ర, నుకల రంగ, శేషం ప్రసాద్, మారిశెట్టి కోటేశ్వరరావు పాల్గొన్నారు.
నెలూరు జిల్లా: నెల్లూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆత్మకూరు బస్టాండ్ సెంటర్‌లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి కలెక్టర్ ఎం.వి శేషగిరి బాబు, కమిషనర్ వీవీఎస్ మూర్తి పూలమాలలు వేసి నివాళర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment