
సాక్షి, అమరావతి: సీఆర్‌డీఏపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష జరుపుతున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఈ సమావేశం ప్రారంభమైంది. సీఆర్‌డీఏ కమిషనర్ లక్ష్మీనరసింహం, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ రెండోసారి సీఆర్‌డీఏ సమీక్షా సమావేశం జరుపుతున్నారు. జూన్ 26న తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment