ప్రజాపాలనకు ‘వంద’నం | CM YS Jagan To Visit Today Srikakulam District | Sakshi
Sakshi News home page

ప్రజాపాలనకు ‘వంద’నం

Published Fri, Sep 6 2019 9:59 AM | Last Updated on Fri, Sep 6 2019 11:06 AM

CM YS Jagan To Visit Today Srikakulam District - Sakshi

అలుపెరుగని బాటసారిలా వచ్చాడు.. జనం బాధలు విన్నాడు.. నేనున్నానని భరోసా ఇచ్చాడు.. ప్రజామోదంతో అఖండ విజయం సాధించాడు.. ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కి నిన్నటి కలలెన్నింటినో నిజం చేస్తున్నాడు..కేవలం వంద రోజుల్లో ఎంతో ఘనత సాధించాడు.. ఎన్నాళ్ల నుంచో వేధిస్తున్న సమస్యలకు చరమగీతం పాడాడు.. విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ మనసున్న ముఖ్యమంత్రినని నిరూపించుకున్నాడు..ఎన్నని చెప్పడం.. ఎవరికని చెప్పడం.. ఎందరెందరో లబ్ధిదారులు.. ఎన్నెన్నో పనులు.. ఇక దేవుడే దిక్కని ప్రాణాలు చిక్కబట్టుకున్న ఉద్దానం కిడ్నీ బాధితులకు గతంలో ఎవరూ చేయని విధంగా సాంత్వన చర్యలు చేపట్టినా.. తాగునీటి సమస్యను తీర్చేలా వాటర్‌ గ్రిడ్‌ను తలపెట్టినా.. పాలన చేపట్టి వంద రోజులవుతున్న సందర్భంగా నాణ్యమైన బియ్యం పంపిణీకి  సిక్కోలులోనే శ్రీకారం చుడుతున్నా.. అది జగన్మోహనుడికే చెల్లింది.. శత దినోత్సవ వేళ ఇది.. సంబరాల సమయమిది.. ఈ శుభ సందర్భంలో ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తమ చెంతకే రానుండడంతో శ్రీకాకుళం జిల్లా ప్రజల మనసులు ఆనందంతో ఉప్పొంగుతున్నాయి.. ప్రజా నేతకు ఘన స్వాగతం పలకాలని∙ఉవ్విళ్లూరుతున్నాయి.  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసే మాటే చెబుతారని... చెప్పిన మాట తప్పక అమలు చేస్తారని నిరూపించారు. ఎన్నికల ముందు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన తాము అధికారంలోకి వస్తే సిక్కోలుకు అండగా నిలుస్తామని చెప్పా రు. ఉద్దానంను అన్ని రకాలుగా ఆదుకుంటాన ని హామీ ఇచ్చారు. తిత్లీ బాధితులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.  చెప్పినట్టుగానే చేశా రు. మాటిచ్చి...మడం తిప్పని నేతగా నిలిచారు.  దశాబ్ధాలనుంచి ఉద్దానం ప్రజలు ఎదుర్కొంటు న్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించా రు. ఐదేళ్లలో చంద్రబాబు చేయలేని పనిని 100 రోజుల పాలనలో చేసి చూపించారు. వెనుకబడి న  శ్రీకాకుళం జిల్లాకు మరింత మేలు చేశారు.

 ఉద్దానానికి ఆపద్బాంధవుడు
ఉద్దానవాసుల 30 ఏళ్ల కష్టానికి సీఎంగా వైఎస్‌ జగన్‌ రాకతో తెరపడుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ రోగులకు పింఛన్లను రూ.3000 నుంచి రూ.10 వేలకు పెంచారు. దీనివలన ప్రస్తుతం 726 మంది లబ్ధి పొందుతున్నారు. అంతేకాకుండా హామీ ఇచ్చిన విధంగా పలాసలో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, ఇందుకు అనుసంధానంగా కిడ్నీ వ్యాధుల రీసెర్చ్‌ సెంటర్, అతిపెద్ద డయాలసిస్‌ సెంటర్‌ను మంజూరు చేసి, ఈమేరకు బడ్జెట్‌లో రూ.50 కోట్లను కేటాయింపు కూడా చేసారు. అలాగే తాజాగా ఈ కేంద్రానికి రెగ్యులర్‌ వైద్యులు, నిపుణులు, కాంట్రాక్ట్‌ ఉద్యోగాల నియామకాల ప్రక్రియకు ఉత్తర్వులు జారీ చేసారు.ఇవి ఏర్పాటైతే ప్రస్తుతం ఉన్న 16వేల మంది కిడ్నీ రోగులకు మేలు జరగనుంది.

జిల్లాకు జలసిరి..
ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణం తాగునీరేనని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో జగన్‌ దానికోసం ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాలకు ఇంటింటికీ మంచినీటిని కొళాయిల ద్వారా నిరంతరం అందించేలా ప్రత్యేక ప్రాజెక్టును మంజూరు చేశారు. దానికోసం రూ.600 కోట్లు కేటాయిస్తూ పరిపాలన ఆమోదం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ ప్రాజెక్టుతో ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, సోంపేట, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లోని 807 గ్రామాలకు నీటి సరఫరా చేయనున్నారు. దాంతోపాటు జిల్లాలో మొత్తం 38 మండలాల్లోనూ ప్రతి గ్రామంలోనూ ఇంటింటికీ కొళాయిల ద్వారా మంచినీరు అందించేందుకు రూ.3673 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ను జగన్‌ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో పలు జిల్లాలో ఈ వాటర్‌ గ్రిడ్‌ను ప్రకటించినప్పటికీ, తొలి విడతలో శ్రీకాకుళం జిల్లాలో పథకాన్ని పూర్తి చేయాలని, పథకం అమలు చేయాలని సీఎం ఆదేశించారు.

ఇంటింటికీ నాణ్యమైన బియ్యం..
జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా నాణ్యమైన బియ్యాన్ని వలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి అందించేలా పథకాన్ని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా రేషన్‌ సరుకులన్నీ ప్యాకింగ్‌గా ఇంటింటికీ అందించేలా చర్యలు చేపట్టారు. నేడే ఆ బృహత్కార్యాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తున్నారు. 

మత్స్యకారులకు రూ. 11.95 కోట్లతో  ప్రత్యేక జెట్టీ..
మత్స్యకారులు వేటాడి తెచ్చిన మత్స్య సంపదను భద్రపరచాలన్నా, ఆరబెట్టుకోవాలన్నా ఇబ్బంది పడుతున్నారు. సరైన సౌకర్యాల్లేక ఇసుక దిబ్బలు, ఆవాసాలు వద్దనే ఆరబెట్టుకుంటున్నారు. వీరి సమస్యను గుర్తించిన సీఎం రూ. 11.95 కోట్లతో ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్, టీ–జెట్టీ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. నిధులు విడుదల చేసి నేడు మంచినీళ్లపేట వద్ద  శంకుస్థాపన చేస్తున్నారు. దీనివలన 9వేలమందికి లబ్థి చేకూరనుంది. దాదాపు 800 బోట్లు టీ జెట్టీ వద్ద వేట సాగించేందుకు అవకాశం ఉంటుంది. 

మొక్కజొన్న రైతులకు తీపికబురు..
2017–18 రబీ సీజన్‌లో మొక్కజొన్న పండించిన రైతులు గిట్టుబాటు ధర లేక అప్పుల్లో కూరుకుపోయారు. ఆ ఏడాది మొక్కజొన్న ధర క్వింటాకు రూ.800 నుంచి రూ. వెయ్యి మధ్యలో ఉండటంతో సాగు పెట్టుబడులు కూడా రాలేదు. అప్పట్లో రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంటను అమ్ముకోవడానికి పడుతున్న కష్టాలను పరిగణలోకి తీసుకుని నాటి ప్రభుత్వం క్వింటాకు రూ.200 బోనస్‌ చెల్లిస్తామని ప్రకటించింది. కానీ ఒక్క పైసా విడుదల చేయలేదు. కానీ అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 15,915మందికి రూ. 11.17 కోట్లు మంజూరు చేసింది.

తిత్లీ బాధితులకు  ఆపన్నహస్తం..
తిత్లీ తుపాను బీభత్సంతో జిల్లాలో ప్రధానంగా ఉద్దాన ప్రాంతంలో వేలాది ఎకరాల కొబ్బరి, జీడి తోటలు ధ్వంసమయ్యాయి. 15,97,559 కొబ్బరి చెట్లు నేలమట్టమయ్యాయి. 56,810 ఎకరాల జీడితోటలు నాశనమయ్యాయి. గత ప్రభుత్వం సరిగా ఆదుకోలేదు. సరికదా బాధితులను గుర్తించడంలో రాజకీయ ం చేసింది. అనర్హులను నష్టపరిహార జాబితాలోకి తీసుకొచ్చింది. ఇదే సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్ర చేయగా, కళ్లారా చూసిన నష్టాన్ని విని, చూసి చలించిపోయారు. అన్ని రకాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఆచరణలో పెట్టారు. నష్టపోయిన వారికి గత ప్రభుత్వం కొబ్బరి చెట్టుకు రూ. 1500 ఇవ్వగా తాజాగా జగన్‌ ప్రభుత్వం ఏకంగా ఒక్కో చెట్టుకు రూ.3000 ఇవ్వాలని నిర్ణయిం చింది. అలాగే జీడి తోటలకు హెక్టార్‌కు గత ప్రభుత్వం రూ.30 వేలు ఇస్తే, జగన్‌ ప్రభుత్వం రూ.50 వేలు ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement