
కడపలో కూలిన హోటల్ భవనం
వైఎస్‌ఆర్ జిల్లా కేంద్రం కడప నడిబొడ్డున, ఏడురోడ్ల కూడలిలో ఉన్న సుజాత హోటల్ భవనం శుక్రవారం మధ్యాహ్నం కుప్పకూలింది.
ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలు
కడప అర్బన్: వైఎస్‌ఆర్ జిల్లా కేంద్రం కడప నడిబొడ్డున, ఏడురోడ్ల కూడలిలో ఉన్న సుజాత హోటల్ భవనం శుక్రవారం మధ్యాహ్నం కుప్పకూలింది. అందులో పనిచేస్తున్న ఇద్దరు మహిళా కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద ఉన్న పార్వతి (50)ని మొదట అగ్నిమాపకశాఖ వారు రక్షించి వెంటనే 108లో రిమ్స్‌కు తరలించారు. ఈలోపునే శిథిలాల నుంచి కేకలు విన్పించాయి.
మరో మహిళ చౌడమ్మ(55) ఇరుక్కుపోయిందని గుర్తించారు. అగ్నిమాపకశాఖ, పోలీసు సిబ్బంది దాదాపు గంటకుపైగా శ్రమించి చౌడమ్మను రక్షించి రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.