కరీంనగర్, న్యూస్‌లైన్ : కలెక్టర్ వీరబ్రహ్మయ్య, ఆయన సతీమణి విజయలక్ష్మి గురువారం మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. నిలువెత్తు బంగారాన్ని తల్లులకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ రాజేశ్వర్‌రావు కలెక్టర్ దంపతులకు స్వాగతం పలికి సత్కరించారు. మేడారం జాతరకు జిల్లా నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, మంథని అర్డీఓ అయేషాఖాన్ ఉన్నారు.
జాతర ఏర్పాట్లు పరిశీలన
జిల్లా నుంచి మంథని, కాటారం మీదుగా మేడారం వెళ్లే భక్తులకు ఏర్పాట్లను కలెక్టర్ దారిపొడవునా పరిశీలించారు. మంథని, కాటారం, యామన్‌పల్లి, రేగులగూడెం, బోర్లగూడెం, కాలువపల్లి మీదుగా ఆయన మేడారం చేరుకున్నారు. మేడారంలో పారిశుధ్య పనుల కోసం 150 మంది సిబ్బందిని పంపించాలని డీపీవో కుమారస్వామిని ఆదేశించారు. దారిపొడవునా అన్ని గ్రామాల్లో భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. మహాముత్తారం మండలం సింగారంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు.
మేడారంలో కలెక్టర్ దంపతులు
Published Fri, Feb 14 2014 4:16 AM | Last Updated on Sat, Sep 2 2017 3:40 AM
Advertisement