విద్యార్థిని కిడ్నాప్‌కు విఫలయత్నం | college girl escapes from kidnap attempt | Sakshi
Sakshi News home page

విద్యార్థిని కిడ్నాప్‌కు విఫలయత్నం

Published Fri, Jan 23 2015 4:06 PM | Last Updated on Thu, Mar 21 2019 9:07 PM

college girl escapes from kidnap attempt

దర్మవరం: కళాశాలకు వెళ్తున్న అమ్మాయిని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేసేందుకు యత్నం చేశారు. ఈ సంఘటన శుక్రవారం అనంతపురం జిల్లా ధర్మవరం శ్రీసాయి మహిళ డిగ్రీ కళాశాల సమీపంలో జరిగింది. అదే కళాశాలలో డ్రిగ్రీ చదువుతున్న స్రవంతి అనే విద్యార్థిని కాలేజీ ముందు ఉన్న బుక్‌స్టోర్‌కు వెళ్లింది. అదే సమయంలో మంకీ క్యాపులు (ముసుగులు) వేసుకున్న నలుగురు వ్యక్తులు ఆమెను బలవంతంగా సుమోలోకి ఎక్కించడానికి ప్రయత్నించారు.  వారి దాడితో అప్రమత్తమైన యువతి వెంటనే కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు.

యువతి ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన ఏఏస్పీ ఆఫీసుకు కూతవేటుదూరంలో జరగడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement