అమ్మవారిని దర్శించుకుని వస్తూ... | Come here you can ... | Sakshi
Sakshi News home page

అమ్మవారిని దర్శించుకుని వస్తూ...

Published Mon, Jul 7 2014 12:53 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM

Come here you can ...

  •  జీపు బోల్తాపడి 16మందికి గాయాలు
  •  ఆరుగురి పరిస్థితి విషమం
  • మాడుగుల/మాడుగుల రూరల్ : పాడేరు మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకొని బొలేరో వాహనంపై తిరిగి వస్తుండగా వంట్లమామిడి చెక్‌పోస్టు సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో 16మంది యువకులు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. చోడవరం కోటవీధికి చెందిన 20 మంది యువకులు ఆదివారం ఉదయం బొలేరో వాహనంపై బయల్దేరి వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకొని సాయంత్రం నాలుగు గంటల సమయంలో తిరిగి వస్తుండగా స్వల్పంగా వర్షం కురిసింది.

    వంట్లమామిడి చెక్‌పోస్టు సమీపంలో గల మలుపులో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న 16మంది గాయాలపాలయ్యారు. వీరిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 వాహనంలో మాడుగుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వైద్యాధికారి సౌజన్య క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేశారు. తీవ్రంగా గాయపడిన బొబ్బిలి పరమేష్, ముంజేటి హరి, బొట్టా శ్రీనివాస్, ఎడ్ల దివ్యకుమార్, చింతల తేజ, బోరా గంగునాయుడులను విశాఖ కెజీహెచ్‌కు తరలించినట్టు వైద్యాధికారి తెలిపారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే బాధితుల బంధువులు ఆస్పత్రి వద్ద గుమిగూడారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement