the rain
-
‘వర్షం’ కలిసొచ్చింది!
బోనస్‌లు, రన్రేట్లతో పని లేదు. గణాంకాల లెక్కలు అవసరంలేదు. అనుకోని అతిథిలా వచ్చిన వర్షం ఓ రకంగా భారత్‌ను ఆదుకుంది. చివరి మ్యాచ్‌లో ఎలాంటి గందరగోళం లేకుండా చేసింది. ఇక ‘నాకౌట్’ మ్యాచ్ ఒక్కటే మిగిలింది. ముక్కోణపు సిరీస్‌లో భారత్ ఫైనల్ చేరాలంటే ఇంగ్లండ్‌ను ఓడిస్తే చాలు. ఓడితే, ఇక నేరుగా ప్రపంచ కప్ బరిలోకే. సిడ్నీ: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా సోమవారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. మొదటి నుంచి వాతావరణం మ్యాచ్‌ను ఇబ్బంది పెట్టినా... 16 ఓవర్ల అనంతరం వచ్చిన వర్షం ఆ తర్వాత ఏ మాత్రం తెరిపినివ్వలేదు. దాంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఆ సమయానికి భారత్ 16 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. ఫలితంగా ఇరు జట్లకు చెరో 2 పాయింట్లు కేటాయించారు. టోర్నీలో ఆస్ట్రేలియా (15 పాయింట్లు) ఇప్పటికే ఫైనల్ చేరింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 2, ఇంగ్లండ్ ఖాతాలో 5 పాయింట్లు ఉన్నాయి. కాబట్టి చివరి లీగ్ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఈనెల 30న పెర్త్‌లో జరిగే ఈ మ్యాచ్ ఒక వేళ రద్దయితే అప్పుడు ఇంగ్లండ్ ముందుకు వెళుతుంది. ధావన్ మళ్లీ విఫలం... టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ బెయిలీ, భారత్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. గాయాల నుంచి కోలుకున్న ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా... ఉమేశ్, భువనేశ్వర్‌ల స్థానాల్లో జట్టులోకి వచ్చారు. చిరుజల్లుల కారణంగా మ్యాచ్ 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కాగా, 2.4 ఓవర్ల తర్వాత మళ్లీ వర్షం అంతరాయం కలిగించింది. ఫామ్‌లో లేని ధావన్ (8) మళ్లీ నిరాశపరిచాడు. రాయుడు (24 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడగా ఆడి అవుట య్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే మ్యాచ్ నిలిచిపోయింది. దాదాపు మూడు గంటలకు పైగా వర్షం ఆగకపోవడంతో మ్యాచ్ రద్దయింది. స్కోరు వివరాలు: భారత్ ఇన్నింగ్స్: రహానే (నాటౌట్) 28, ధావన్ (సి) ఫించ్ (బి) స్టార్క్ 8; రాయుడు (సి) వార్నర్ (బి) మార్ష్ 23; కోహ్లి (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (16 ఓవర్లలో 2 వికెట్లకు) 69; వికెట్ల పతనం: 1-24; 2-62; బౌలింగ్: స్టార్క్ 4-0-11-1; హాజల్‌వుడ్ 5-0-25-0; మిషెల్ మార్ష్ 3-0-21-1; డోహర్తి 3-0-10-0; ఫాల్క్‌నర్ 1-0-2-0. -
అతివేగం తెచ్చిన తంటా
చౌడేపల్లె: అతివేగం రెండు ప్రాణాలను బలి గొంది. మరొకరిని తీవ్ర గాయాలపాలు చేసిం ది. ఈ ఘటన చౌడేపల్లె-పుంగనూరు మార్గం లోని ఠాణా కొత్తయిండ్లు సమీపంలో గురువారం చోటుచేసుకుంది. రామసముద్రం మం డలం కొండూరు గ్రామానికి చెందిన సీఆర్.నారాయణరెడ్డి, అతని భార్య శశికళ ఏపీ03 బీజే909 నంబరు గల బొలేరో వాహనంలో తిరుపతిలోని కొడుకు కూతురును చూసేందుకు బయలుదేరారు. అక్కడ మధ్యాహ్నం వరకు గడిపి కొండూరుకు చౌడేపల్లె మీదుగా తిరుగు ప్రయాణమయ్యారు. వాహనం వేగంగా వస్తుండడం, చిన్నపాటి వర్షం పడుతుండడంతో ఠాణాకొత్తయిండ్లు సమీపంలోని మలుపు వద్ద అదుపు తప్పింది. డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోయాడు. రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొన్న వాహనం అదే వేగంతో లోతైన ప్రదేశంలోకి దూసుకెళ్లింది. పెద్ద శబ్దం రావడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెళ్లి వాహనంలోని ముగ్గురిని బయటకు తీశారు. శశికళ(48) అప్పటికే మృతిచెందింది. తీవ్రగాయాలపాలైన నారాయణరెడ్డి, డ్రైవర్ మాలేనత్తంకు చెందిన సురేంద్రను పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డ్రైవర్ మృతిచెందాడు. నారాయణరెడ్డిని మెరుగైన వైద్యం కోసం కోలారు మెడికల్ కళాశాలకు తరలించారు. డ్రైవర్‌కు నెలుగు నెలల క్రితం వివాహమైంది. అతని మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి సాగరంలో మునిగి పోయారు. నారాయణరెడ్డి కుదురుచీమనపల్లె సర్పంచ్‌గా పనిచేశారు. వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. -
పాఠశాల భవనంపై పిడుగుపడి విద్యార్థి మృతి
పెనుమూరు: పాఠశాల భవనంపై పిడుగుపడి ఓ విద్యార్థి మృతి చెందింది. ఈ సంఘటన పెనుమూరు మండలంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు, పాఠశాల టీచర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పెనుమూరు మండలం జెట్టివానిఒడ్డు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో ప్రస్తుతం 11 మంది విద్యార్థులు చదువుతున్నారు. టీచర్‌గా భాస్కర్‌రెడ్డి పనిచేస్తున్నారు. ప్రతి రోజులా బుధవారం సాయంత్రం 4 గంటలకు పాఠశాల నుంచి విద్యార్థులు వెళ్లడానికి ఇంటిగంట కొట్టారు. ఆ సమయంలో వర్షం పడుతుండడంతో ఇళ్లకు వెళ్లలేక విద్యార్థులంతా పాఠశాల వరండాలో నిలబడి ఉన్నారు. సరిగ్గా 4.10 గంటలకు ఉరుములు, మెరుపులు వచ్చా రుు. పాఠశాల భవనంపై పిడుగుపడింది. వరండాలోనే ఉన్న టీచర్ భాస్కర్‌రెడ్డి సహా విద్యార్థులంద రూ షాక్‌కు గురయ్యూరు. అందరూ గిలగిలాకొట్టుకున్నారు. రెండు నిమిషాలకు టీచర్ తేరుకున్నారు. మూడో తరగతి చదువుతున్న కె.మాధవి(07) అక్కడికక్కడే మృతి చెందింది. నాలుగో తరగతి చదువుతున్న కె.దివ్య(08) అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే గ్రామస్తులు పెనుమూరు ప్రాథమిక పాఠశాలకు తీసుకెళ్లి చికిత్స చేరుుంచడంతో దివ్య కోలుకుంది. పిడుగుపడ్డ సమయంలో పాఠశాల తరగతి గదిలో ఉన్న ఓ ట్యూబ్ లైట్ పగిలింది. పాఠశాల తరగతి గదులు బీటలు పడ్డాయి. మృతిచెందిన మాధవి జెట్టివానిఒడ్డు గ్రామానికి చెందిన రవిచంద్రారెడ్డి రెండో సంతానం. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉదయం తోటి పిల్లలతో ఆడుకుంటూ పాఠశాలకు వె ళ్లిన మాధవి సాయంత్రం ఇలా తమకు కనిపిస్తుందని అనుకోలేదంటూ తల్లిదండ్రులు బోరున విలపించారు. దీంతో గ్రామస్తులంతా సైతం కంటతడి పెట్టారు. గోడకు ఆనుకోవడం వల్లే మృతి ముందుగా తేలికపాటి వర్షం పడడంతో పాఠశాల భవనం గోడలు తడిసాయి. ఆ తర్వాత పిడుగుపడింది. ఈ సమయంలో మాధవి పాఠశాల గోడకు ఆనుకోవడం వల్ల పిడుగుపాటుతో షాక్ తగిలి మృతి చెందింది. లేకుంటే ప్రమాదం జరిగేది కాదని గ్రామస్తులు చెబుతున్నారు. పాఠశాల టీచర్ భాస్కర్‌రెడ్డి సహా మిగిలిన వారు వరండాలో గోడకు ఆనుకుని ఉండకపోవడం వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని వారు అంటున్నారు. -
అమ్మవారిని దర్శించుకుని వస్తూ...
జీపు బోల్తాపడి 16మందికి గాయాలు ఆరుగురి పరిస్థితి విషమం మాడుగుల/మాడుగుల రూరల్ : పాడేరు మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకొని బొలేరో వాహనంపై తిరిగి వస్తుండగా వంట్లమామిడి చెక్‌పోస్టు సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో 16మంది యువకులు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. చోడవరం కోటవీధికి చెందిన 20 మంది యువకులు ఆదివారం ఉదయం బొలేరో వాహనంపై బయల్దేరి వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకొని సాయంత్రం నాలుగు గంటల సమయంలో తిరిగి వస్తుండగా స్వల్పంగా వర్షం కురిసింది. వంట్లమామిడి చెక్‌పోస్టు సమీపంలో గల మలుపులో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న 16మంది గాయాలపాలయ్యారు. వీరిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 వాహనంలో మాడుగుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వైద్యాధికారి సౌజన్య క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేశారు. తీవ్రంగా గాయపడిన బొబ్బిలి పరమేష్, ముంజేటి హరి, బొట్టా శ్రీనివాస్, ఎడ్ల దివ్యకుమార్, చింతల తేజ, బోరా గంగునాయుడులను విశాఖ కెజీహెచ్‌కు తరలించినట్టు వైద్యాధికారి తెలిపారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే బాధితుల బంధువులు ఆస్పత్రి వద్ద గుమిగూడారు.