పాఠశాల భవనంపై పిడుగుపడి విద్యార్థి మృతి | Building school student killed in lightning | Sakshi
Sakshi News home page

పాఠశాల భవనంపై పిడుగుపడి విద్యార్థి మృతి

Published Thu, Oct 16 2014 3:38 AM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM

పాఠశాల భవనంపై పిడుగుపడి విద్యార్థి మృతి

పాఠశాల భవనంపై పిడుగుపడి విద్యార్థి మృతి

పెనుమూరు: పాఠశాల భవనంపై పిడుగుపడి ఓ విద్యార్థి మృతి చెందింది. ఈ సంఘటన పెనుమూరు మండలంలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు, పాఠశాల టీచర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పెనుమూరు మండలం జెట్టివానిఒడ్డు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో ప్రస్తుతం 11 మంది విద్యార్థులు చదువుతున్నారు. టీచర్‌గా భాస్కర్‌రెడ్డి పనిచేస్తున్నారు. ప్రతి రోజులా బుధవారం సాయంత్రం 4 గంటలకు పాఠశాల నుంచి విద్యార్థులు వెళ్లడానికి ఇంటిగంట కొట్టారు.

ఆ సమయంలో వర్షం పడుతుండడంతో ఇళ్లకు వెళ్లలేక విద్యార్థులంతా పాఠశాల వరండాలో నిలబడి ఉన్నారు. సరిగ్గా 4.10 గంటలకు ఉరుములు, మెరుపులు వచ్చా రుు. పాఠశాల భవనంపై పిడుగుపడింది. వరండాలోనే ఉన్న టీచర్ భాస్కర్‌రెడ్డి సహా విద్యార్థులంద రూ షాక్‌కు గురయ్యూరు. అందరూ గిలగిలాకొట్టుకున్నారు. రెండు నిమిషాలకు టీచర్ తేరుకున్నారు. మూడో తరగతి చదువుతున్న కె.మాధవి(07) అక్కడికక్కడే మృతి చెందింది. నాలుగో తరగతి చదువుతున్న కె.దివ్య(08) అపస్మారక స్థితికి చేరుకుంది.
 
వెంటనే గ్రామస్తులు పెనుమూరు ప్రాథమిక పాఠశాలకు తీసుకెళ్లి చికిత్స చేరుుంచడంతో దివ్య కోలుకుంది. పిడుగుపడ్డ సమయంలో పాఠశాల తరగతి గదిలో ఉన్న ఓ ట్యూబ్ లైట్ పగిలింది. పాఠశాల తరగతి గదులు బీటలు పడ్డాయి. మృతిచెందిన మాధవి జెట్టివానిఒడ్డు గ్రామానికి చెందిన రవిచంద్రారెడ్డి రెండో సంతానం. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉదయం తోటి పిల్లలతో ఆడుకుంటూ పాఠశాలకు వె ళ్లిన మాధవి సాయంత్రం ఇలా తమకు కనిపిస్తుందని అనుకోలేదంటూ తల్లిదండ్రులు బోరున విలపించారు. దీంతో గ్రామస్తులంతా సైతం కంటతడి పెట్టారు.
 
గోడకు ఆనుకోవడం వల్లే మృతి

ముందుగా తేలికపాటి వర్షం పడడంతో పాఠశాల భవనం గోడలు తడిసాయి. ఆ తర్వాత  పిడుగుపడింది. ఈ సమయంలో  మాధవి పాఠశాల గోడకు ఆనుకోవడం వల్ల పిడుగుపాటుతో షాక్ తగిలి మృతి చెందింది. లేకుంటే ప్రమాదం జరిగేది కాదని  గ్రామస్తులు చెబుతున్నారు. పాఠశాల టీచర్ భాస్కర్‌రెడ్డి సహా మిగిలిన వారు వరండాలో గోడకు ఆనుకుని ఉండకపోవడం వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని వారు అంటున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement