దానవాయిపేట (రాజమండ్రి): ఆంధ్రప్రదేశ్‌లోని వర్కింగ్ జర్నలిస్టులకు త్వరలోనే హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని, ఎన్నికల కోడ్ ఉన్నందున కాస్త ఆలస్యమైందని సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మండెల శ్రీరామమూర్తి గురువారం రాజమండ్రిలో ఉపముఖ్య మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, జిల్లా ఇన్‌చార్జి, జలవన రుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులను కలిసి హెల్త్ కార్డులు మంజూరు చేయకపోవడం వల్ల జర్నలిస్టులు పడుతున్న ఇబ్బందులను వివరించారు.
దీనిపై స్పందించిన మంత్రులు హెల్త్ కార్డుల ప్రక్రియ త్వరలోనే మొదలవుతుందని, అక్రిడిటేషన్ల కమిటీ ఫైల్‌పై ముఖ్యమంత్రి సంతకం చేసిన వెంటనే ఆగస్టు ఒకటి నుంచి కొత్త కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెలాఖరుకు ముగియనున్న అక్రిడిటేషన్ల గడువును జూలై నెలాఖరు వరకూ పొడిగించి ఆగస్టు ఒకటి నుంచి కొత్త కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పల్లె వివరించారు. అదే విధంగా కొత్తగా అర్హులైన వారికి తాత్కాలిక అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని మంత్రులు డీపీఆర్‌వోను ఆదేశించారు.
జర్నలిస్టులకు త్వరలో హెల్త్‌కార్డులు
Published Fri, Jun 26 2015 2:46 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 AM
Advertisement
Advertisement